- Home
- Feature
- Best Tourist Village: ఇక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు..మాంసం, మందు ముట్టరు, మనదేశపు బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఇది
Best Tourist Village: ఇక్కడ ఇళ్లకు తాళాలు ఉండవు..మాంసం, మందు ముట్టరు, మనదేశపు బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఇది
Best Tourist Village: మన దేశంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ, మన దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఒకటి ఉందని తెలుసా?. దానికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఈ గ్రామంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?

టూరిస్ట్ విలేజ్..
మన దేశంలో టూరిస్ట్ ప్లేసులు అనగానే.. బీచ్ లు, హిల్ స్టేషన్స్, పెద్ద పెద్ద నగరాలు, కోటలు గుర్తుకు వస్తాయి. కానీ, ప్రత్యేకంగా మన దేశానికి ఓ టూరిస్ట్ విలేజ్ ఒకటి ఉంది అని మీకు తెలుసా? అది కూడా చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఏ ఇంటికీ కనీసం తాళాలు కూడా ఉండవు. అంతేకాదు, ఆ గ్రామంలో ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టరు. మాంసాహారం తినరు. మరి, ఈ గ్రామం బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా ఎలా మారింది..? ఇంతకీ ఆ గ్రామం ఏంటి?
అత్యుత్తమ పర్యాటక గ్రామం..
భారతదేశపు ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన ఊరు దేవ్ మాలి. ఇది రాజస్థాన్ లోని బేవార్ జిల్లా మసూదా సబ్ డివిజన్ పరిధిలో ఉంది. ఆరావళి పర్వత శ్రేణుల మధ్య సుమారు 3000 బీగాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ గ్రామానికి భగవాన్ దేవనారాయణ్ పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. ఈ గ్రామాన్ని మన దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ విలేజ్ గా పేర్కొంటారు.
ఈ దేవ మాలి గ్రామ ప్రత్యేకతలు...
ఈ ఊరిలో రూల్స్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. ఈ గ్రామంలో ఏ ఇంటికీ మనకు తాళాలు వేసి కనిపించవు. ఇక్కడి ప్రజల మధ్య ఐక్యత, నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే, వారు తమ ఇళ్లకు తాళాలు వేసుకోరు. అంతేకాదు, వీరు తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ గ్రామంలో ఎవరూ మాంసం, చేపలు, ఆల్కహాల్ ముట్టరు. అంతేకాకుండా వేప కట్టెలు కాల్చడం, కిరోసిన్ వాడకం కూడా ఇక్కడ నిషేధం.గ్రామంలో ఉన్న ప్రసిద్ధ భగవాన్ దేవనారాయణ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు.
అంతేకాదు, ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే... ఈ గ్రామం అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా మారి, అందరినీ ఆకర్షిస్తోంది.













