Indian Railways: రైల్వే స్టేషన్, జంక్షన్, టెర్మినల్ ...వీటి మధ్య తేడా ఏంటి?
Indian Railways: చాలా మందికి రైల్వే స్టేషన్, జంక్షన్, టెర్మినల్ ఒకటే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇవి వేర్వేరు. వీటి మధ్య అర్థాలు, సాంకేతిక తేడాలు ఉన్నాయి. రైల్వే టికెట్‍పై కనిపించే ఈ పదాల అసలు అర్థం ఏమిటి? తేడా ఏంటో తెలుసుకుందాం.

ఈ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
రైల్వే స్టేషన్ల పేర్ల చివర కనిపించే టెర్మినల్, జంక్షన్ వంటి పదాలు యాదృచ్ఛికంగా పెట్టలేదు. ఆ స్టేషన్‍కు ఉన్న రైల్వే మార్గాల అనుసంధానం, ట్రాక్‍ల ఏర్పాటు, రైళ్ల రాకపోకల విధానం వంటి సాంకేతిక అంశాల ఆధారంగానే ఈ పేర్లను నిర్ణయిస్తారు.
రైల్వే టెర్మినల్
టెర్మినల్ అంటే రైలు మార్గం అక్కడితో ముగిసిపోయిందని అర్థం. అక్కడికి వచ్చే ట్రాక్‌లు స్టేషన్ చివర్లో ఆగిపోతాయి. రైళ్లు ముందుకు వెళ్లడానికి దారి ఉండదు. రైలు ఏ దారిలో అయితే స్టేషన్‌లోకి వస్తుందో, అదే దారిలో వెనక్కి వెళ్లాలి. దీనికి చెన్నై ఎగ్మోర్, తాంబరం స్టేషన్లు ఉదాహరణలు.
రైల్వే జంక్షన్
సెంట్రల్ స్టేషన్
సాధారణ రైల్వే స్టేషన్
రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఒక దారిలో వచ్చి, మరో దారిలో నేరుగా వెళ్లిపోతాయి. ఇక్కడ కేవలం రెండు ట్రాక్‌లు మాత్రమే ఉంటాయి. ఒకటి వెళ్లడానికి, మరొకటి రావడానికి. ఇక్కడ ట్రాక్‌లు విడిపోవడం గానీ, అక్కడే ఆగిపోవడం గానీ జరగదు. చాలా చిన్న, మధ్య తరహా పట్టణాల్లోని స్టేషన్లు ఇలాగే ఉంటాయి.

