MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ

Dharmendra Pradhan: ఢిల్లీలో నిరసన జ్వాలలను చల్లబరిచేలా నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఎట్టకేలకు జంతర్ మంతర్ వద్ద చేసిన విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం దిగొచ్చింది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 25 2026, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Image Credit : X

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ పేపర్ లీకేజీ వివాదం దాదాపు చల్లారింది. విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం దిగొచ్చింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రధాన డిమాండ్‌ను అంగీకరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విద్యార్థుల ఆందోళనకు ఫలితం
Image Credit : ANI

విద్యార్థుల ఆందోళనకు ఫలితం

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు, పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టగా, ఈ ఉద్యమానికి సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు కూడా సంఘీభావం తెలిపారు.

Related Articles

Related image1
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Related image2
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
35
ఆమోదించిన కేంద్రం!
Image Credit : ANI

ఆమోదించిన కేంద్రం!

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థుల ప్రధాన డిమాండ్ నెరవేరినట్లైంది. ఆయన రాజీనామాను కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది.

45
విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని డిమాండ్
Image Credit : ANI

విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలని డిమాండ్

రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నీట్ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థి ఉద్యమం కీలక మలుపు తిరిగింది. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం రాజీనామాతోనే సమస్య ముగిసిపోలేదని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

55
రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే...
Image Credit : stockPhoto

రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే...

అయితే రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందన్నారు. యువత ఆకాంక్షలను, కలల్ని గౌరవిస్తానని తెలిపారు. 10 రోజులుగా జరుగుతున్న సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలో తల్జేర్ లో పుట్టారు. ఆయన తండ్రి దేవంద్ర ప్రధాన్ వాజ్ పేయి హయాంలో కేంద్రసహాయమంత్రిగా పనిచేశారు. 2000లో ధర్మేంద్రప్రధాన్ MLAగా గెలిచారు. 2004లో లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2021లో విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Recommended image2
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Recommended image3
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
Car Driver Salary: అమెరికాలో కారు నడిపితే నెలకు ఎంత వస్తుందో తెలుసా? దెబ్బకు లైఫ్ సెటిల్
Recommended image2
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved