MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Snakes Acting : ఈ పాములు మహా ముదుర్లు గురూ.. నటించడం కాదు జీవిస్తాయి..!

Snakes Acting : ఈ పాములు మహా ముదుర్లు గురూ.. నటించడం కాదు జీవిస్తాయి..!

పాము అనగానే మనకు గుర్తొచ్చేది దాని విషం, భయం. కానీ అన్ని పాములు కేవలం విషంతోనే శత్రువులను ఎదుర్కోవు. కొన్ని చనిపోయినట్టు నటిస్తాయి, ఇంకొన్ని విషాన్ని చిమ్ముతాయి, మరికొన్ని రంగులు మార్చి శత్రువులను బోల్తా కొట్టిస్తాయి. 

1 Min read
Author : Arun Kumar P
Published : Apr 06 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
1. హోగ్నోస్ పాము (Hognose Snake)
Image Credit : AI Generated

1. హోగ్నోస్ పాము (Hognose Snake)

దీన్ని పాముల ప్రపంచంలో 'బెస్ట్ యాక్టర్' అంటారు. ఇది శత్రువులు దాడికి వస్తే వెల్లకిలా పడుకుని, నాలుక భయటపెట్టి చనిపోయినట్టు నటిస్తుంది. మరీ భయమేస్తే, నోటిలోని రక్తనాళాలు చిట్లేలా చేసుకుని రక్తం కారేలా చేస్తుంది. దీన్ని చూసి 'ఇది కుళ్లిపోయిన శవం' అనుకుని శత్రువులు వదిలేసి వెళ్లిపోతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2. రాటిల్ స్నేక్ (Rattlesnake)
Image Credit : AI Generated

2. రాటిల్ స్నేక్ (Rattlesnake)

ఈ పాము కళ్ల దగ్గర 'లోరియల్ పిట్' అనే ప్రత్యేక అవయవం ఉంటుంది. ఇది ఒకరకమైన 'నైట్ విజన్ కెమెరా' లాంటిది. దీని సాయంతో, చీకట్లో కూడా శత్రువు శరీరం నుంచి వెలువడే వేడిని (ఇన్‌ఫ్రారెడ్) పసిగడుతుంది. కంటికి కనిపించకముందే శత్రువు ఎక్కడుందో ఈ పాము కనిపెట్టేస్తుంది.
36
3. స్కార్లెట్ కింగ్‌స్నేక్ (Scarlet Kingsnake)
Image Credit : AI Generated

3. స్కార్లెట్ కింగ్‌స్నేక్ (Scarlet Kingsnake)

ఈ పాముకు అస్సలు విషం ఉండదు. కానీ చూడటానికి అచ్చం విషపూరితమైన 'కోరల్ స్నేక్' లాగే ఉంటుంది. దీన్ని చూసిన ఇతర జంతువులు, 'ఇది చాలా ప్రమాదకరమైన పాము' అని భయపడి పారిపోతాయి. ఇలా తన రూపంతోనే శత్రువులను మోసం చేస్తుంది.
46
4. బోవా కన్‌స్ట్రిక్టర్ (Boa Constrictor)
Image Credit : AI Generated

4. బోవా కన్‌స్ట్రిక్టర్ (Boa Constrictor)

ఈ పాములు వేటాడటంలో చాలా తెలివి చూపిస్తాయి. తమ ఎరను చుట్టేసినప్పుడు, ఆ జంతువు గుండె చప్పుడును గమనిస్తూ ఉంటాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోయేంత వరకు పట్టు బిగిస్తూనే ఉంటాయి. గుండె చప్పుడు పూర్తిగా ఆగి, జంతువు చనిపోయిందని నిర్ధారించుకున్నాకే పట్టు వదులుతాయి.
56
5. స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra)
Image Credit : AI Genertaed

5. స్పిట్టింగ్ కోబ్రా (Spitting Cobra)

ఈ నాగుపాము కోరలకు ప్రత్యేకమైన రంధ్రాలు ఉంటాయి. ఇవి శత్రువు కళ్ల కదలికలను గమనించి, గురి చూసి కళ్లల్లోకే విషాన్ని చిమ్ముతాయి. దీనివల్ల శత్రువుకు తీవ్రమైన నొప్పి కలిగి, కొద్దిసేపు చూపు మందగిస్తుంది. ఆ గ్యాప్‌లో ఈ పాము అక్కడి నుంచి తప్పించుకుంటుంది.
66
6. కింగ్ కోబ్రా (King Cobra)
Image Credit : stockPhoto

6. కింగ్ కోబ్రా (King Cobra)

ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాము. శత్రువు ఎదురైనప్పుడు, తన శరీరం ముందు భాగాన్ని సుమారు 5-6 అడుగుల ఎత్తు వరకు గాల్లోకి లేపి నిలబడగలదు. ఇది పడగ విప్పి బుస కొడితే, పెద్ద జంతువులు కూడా భయంతో వణికిపోతాయి. దీని విషం నేరుగా నాడీ మండలంపై దాడి చేస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Related Stories
Recommended image1
Snake Island: పాములు బాబోయ్ పాములు..! భూమ్మీద అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశం ఇదే
Recommended image2
Snake:పాము తలపై నిజంగా నాగమణి ఉందా? బిహార్ లో నిజంగా నాగమణి కనపడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved