- Home
- International
- Snake Island: పాములు బాబోయ్ పాములు..! భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే
Snake Island: పాములు బాబోయ్ పాములు..! భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే
ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవు ఈ విశ్వం. ఇలాంటి రహస్యలను చేధించేందుకు మనిషి నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. అయితే భూమ్మీద కూడా మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీ ఐల్యాండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

దూరం నుంచి అందంగా కనిపించే ద్వీపంలో ఎన్నో వింతలు
బ్రెజిల్ తీరానికి దగ్గరలో ఉన్న చిన్న ద్వీపం. దీని పేరు స్నేక్ ఐలాండ్ (Snake Island). బయట నుంచి చూస్తే పచ్చటి చెట్లు, నీలి సముద్రం చూస్తుంటే ఇది ఒక సుందర ద్వీపంలా అనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశం.
ఈ ద్వీపంలో సుమారు 2,000 నుంచి 4,000 వరకూ ‘గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్స్’ అనే అత్యంత విషపూరిత పాములు ఉన్నాయి. అంటే ఈ ద్వీపంలో ప్రతి చదరపు మీటరుకు ఒక పాము ఉందన్నమాట. ఈ పాములు ఎంత ప్రమాదకరమంటే, బ్రెజిల్ నేవీ కూడా ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ద్వీపానికి వెళ్లుతుంది, అది కూడా డాక్టర్లు, యాంటీ వెనమ్‌తోపాటు వెళ్తారు.
ఈ పాముల వెనకాల ఉన్న అసలు మిస్టరీ ఏంటంటే.?
దాదాపు 11,000 సంవత్సరాల క్రితం, సముద్ర మట్టం పెరిగిపోవడంతో ఈ ద్వీపం భూభాగం నుంచి వేరుపడింది. అప్పటికి అక్కడ ఉన్న పాములు ఒంటరిగా మిగిలిపోయాయి. వీటికి ఆహారంగా ఎలుకలు కూడా లభించని పరిస్థితి వచ్చింది. దీంతో ఇవి పక్షులను వేటాడటం మొదలుపెట్టాయి. సాధారణ పాముల కంటే వీటి విషం ఐదు రెట్లు శక్తివంతంగా ఉంటుంది. ఇదే ఈ పాములను ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక పాములుగా నిలిపింది.
కానీ ఇప్పుడీ పాములు సైతం అంతరించిపోతున్న జాతిగా మారుతున్నాయి. ఈ పాములను అక్రమంగా పట్టుకోవడం, పక్షుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ఈ పాముల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
భారత్‌లో కూడా
ఇదిలా ఉంటే పాములను భారదేశాన్ని విడదీసి చూడలేని పరిస్థితి ఉంటుందని తెలిసిందే. పాములను పూజించే దేశం మనది. అందుకే మన చరిత్రలో పాములు కూడా ఒక భాగమని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద పాముశిలా భారత్‌లోనే లభించింది. ఈ పాము అత్యంత పొడవు, వందల కిలోల బరువుతో ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది పాముల పురాతన పరిణామ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక కీలక ఆధారంగా మారింది.
పురాణాల్లో కూడా పాముల ప్రస్తావన
భారతీయ సంస్కృతిలో శేషనాగ్, వాసుకి, నాగపంచమి లాంటి పాములకు సంబంధించిన కథలు బాగా ప్రసిద్ధి చెందాయి. పాములను శక్తికి గుర్తుగా, రక్షకుడిగా భావించడం మన భారతీయ సంస్కృతికి ప్రత్యేకత. అంతర్జాతీయంగా కూడా పాములు పలు మతాల్లో కనిపిస్తాయి. అయితే పాములు భయానకంగా భావించినా ఇవి ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయన్నది నిజం.
పాములు ప్రకృతిని రక్షిస్తాయి
భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 50,000 మందికి పైగా పాముకాట్ల వల్ల చనిపోతున్నారు. ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్య. కానీ ఇది పూర్తిగా పాములను నిర్మూలించాలని కాదు. దీనివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. పాములను చంపడం వల్ల సమస్య ఎలా పెరుగుతుందనేగా మీ సందేహం.
పాములు ఎలుకలను, పంటల మీద దాడి చేసే పురుగులను తింటూ, వ్యవసాయాన్ని రక్షిస్తాయి. ఇవి లేకుంటే మన పంటలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అంతేకాదు, కొన్ని పాముల విషం ఆధారంగా హై బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత వ్యాధులకు మందులు అభివృద్ధి చేస్తున్న పరిశోధనలు జరుగుతున్నాయి.