Snake:పాము తలపై నిజంగా నాగమణి ఉందా? బిహార్ లో నిజంగా నాగమణి కనపడిందా?
ఇటీవల, బిహార్ లో పాము తల నుంచి ఒక రాయి పడిపోయిందని, ఆ రాయి నాగమణి వార్తలు వచ్చాయి. మరి, వాటిలో నిజం ఎంత? శాస్త్రవేత్తలు ఏం కనుగున్నారో చూద్దాం..

బిహార్ లో నాగమణి..
కొద్ది రోజుల క్రితం, బిహార్ లోని ముజాహుర్ జిల్లాలోని సాహెబ్ గంజ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఒక పాము ప్రవేశించింది. ఆ పామును పట్టుకున్నప్పుడు అది ఒక స్పటికలాంటి వస్తువును వదిలి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. చూడటానికి అదొక ప్లాస్టిక్ వస్తువులా కనిపించినప్పటికీ, ప్రజలు దానిని నాగమణి అని నమ్ముతున్నారు. ఇక.. దానిని చూడటానికి, పూజలు చేయడానికి ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో నిజంగా నాగమణి ఉందా లేదా అనే సందేహం చాలా మందిలో మొదలైంది. ఇప్పటి వరకు మనం చూసిన చాలా సినిమాలు, సీరియల్స్ లో నాగుపాము దగ్గర నాగమణి ఉంటుందని, దానికి చాలా శక్తులు ఉంటాయి అని చూపించారు. వాటిని చూసి అది నిజం అని నమ్మిన వారు కూడా ఉన్నారు. అయితే.. ఈ విషయంపై తాజాగా.. నిపుణులు చేసిన పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం...
KNOW
నాగమణి గురించి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..
మనం చదివిన చాలా కథల్లో పాములు స్వయంగా తమ వద్ద ఉన్న నాగమణిని కొందరు వ్యక్తులకు అందిస్తాయని చెబుతుంటారు. కానీ, శాస్త్రీయంగా చెప్పాలంటే, పాముల తలపై నాగమణి రాయి ఉందని లేదా అది మెరిసే రాయి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.జీవశాస్త్రవేత్తలు, హెర్పెటాలజిస్టులు శాస్త్రవేత్తలు అందరూ నాగమణి గురించిన సమాచారాన్ని పూర్తిగా తిరస్కరించారు. పాములు తమ తలపై రాయి లాంటి వస్తువును కలిగి ఉండటం లేదా ఆ రాయిని విడుదల చేసే లక్షణాలు ఉండవు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాముల శరీరం పొలుసులు, ఎముకలు, కండరాలు వంటి అవయవాలను కలిగి ఉంటాయి. వాటి తలలపై రత్నాలు ఏర్పడే అవకాశం లేదని జీవశాస్త్రవేత్తలు అంటున్నారు.
శాస్త్రీయంగా, నాగమణి నిజం కాదు.
కొన్నిసార్లు పాములు తమ ఆవాసాలలో కొన్ని మెరిసే రాళ్లను లేదా గాజు ముక్కలను మోసుకెళ్లి ఉండవచ్చు. అవి కింద పడినప్పుడు, వాటిని నాగమణిగా పొరపాటున పరిగణించవచ్చని చెబుతారు. ప్రకాశించే లక్షణాలతో కూడిన కొన్ని ఖనిజాలు లేదా రాళ్ళు రాత్రిపూట కాంతిని ప్రతిబింబిస్తాయి. అటువంటి ప్రదేశాలలో దాక్కున్న పాములకు ఆ ఖనిజాలు అంటుకున్నప్పుడు, అవి నాగమణిగా తప్పుగా భావించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన దేశంలో నాగమణి ఉనికిని చెబుతూ అనేక మోసాలు జరిగాయి. రసాయనికంగా పూత పూసిన రాళ్ళు లేదా కృత్రిమంగా సృష్టించిన ప్రకాశవంతమైన లక్షణాలతో కూడిన రాళ్ళు నాగమణి అని చెప్పుకుంటూ చాలా మంది ప్రజలను మోసం చేసి డబ్బులు గుంజుతున్నారు. కానీ శాస్త్రీయంగా, నాగమణి అంటే నిజం కాదు.
నాగమణి అనేది కల్పిత విషయం.
బీహార్‌లో జరిగిన సంఘటన కూడా నిజం కాదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలలో పాముల పట్ల లోతుగా పాతుకుపోయిన భయం, నాగమణిపై నమ్మకం అలాంటి సంఘటనలను నిజమనిపించాయి. పాము కదిలినప్పుడు సమీపంలోని మెరిసే వస్తువు ప్రమాదవశాత్తు పడి ఉండవచ్చు, అది పాము తల నుండి పడిపోయినట్లు అనిపించవచ్చు లేదా భూమిలో పాతుకుపోయిన ఒక సాధారణ రాయి లేదా ఖనిజం పాము కదలిక ద్వారా బయటపడి ఉండవచ్చు. కొన్నిసార్లు, సంచలనం సృష్టించే లక్ష్యంతో ప్రజలు ఇటువంటి అపోహలను వ్యాప్తి చేసి ఉండవచ్చు. వారు ఇతరులను మోసం చేసే ఉద్దేశ్యం కూడా కలిగి ఉండవచ్చు. కానీ శాస్త్రీయంగా, నాగమణి అనేది ఒక కల్పిత విషయం. పాముల తలలపై రాళ్ళు ఉన్నాయని లేదా అవి ప్రకాశించే రాళ్ళు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.