MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Coconut : కొబ్బరికాయను ఎలా కొట్టాలి..? ఈజీగా పగలాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

Coconut : కొబ్బరికాయను ఎలా కొట్టాలి..? ఈజీగా పగలాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి

కొందరు కొబ్బరికాయ కొట్టాలంటే నానా తంటాలు పడుతుంటారు? అయితే ఇకపై ఆ కష్టం అవసరం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా కొబ్బరికాయను పగలగొట్టొచ్చు, పర్ఫెక్ట్‌గా రెండు ముక్కలు చేయొచ్చు.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 29 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి?
Image Credit : Gemini AI

కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి?

కొబ్బరికాయ... మన రోజువారీ జీవితంలో ఎంతో సాధారణంగా కనిపించే పదార్థం. పూజా కార్యక్రమాల్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టడం ఒక సంప్రదాయంగా కొనసాగుతుంటే.. వంటల్లోనూ కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, ఇతర రూపాల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. అయితే కొబ్బరికాయను ఉపయోగించే ముందు ఎదురయ్యే అసలు సమస్య దాని గట్టి పెంకును పగలగొట్టడమే. కొబ్బరికాయను సులభంగా పగలకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు... మరీముఖ్యంగా మహిళలు నానా తంటాలు పడుతుంటారు.

అయితే కొబ్బరికాయను పగలగొట్టడానికి ప్రతిసారీ పెద్ద రాయి లేదా సుత్తి వంటి వస్తువులు అవసరం లేదు. కాయ సహజ ఆకృతిని, దానిపై ఉండే గీతలను సరిగ్గా గుర్తించి.. సరైన స్థానంలో ఒత్తిడి పెడితే చాలా సులభంగా రెండు భాగాలుగా విడగొట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కొబ్బరికాయను ఈజీగా పగలగొట్టే టిప్స్...
Image Credit : AI Image

కొబ్బరికాయను ఈజీగా పగలగొట్టే టిప్స్...

కొబ్బరికాయను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే దాని పెంకుపై మూడు సహజమైన గీతలు కనిపిస్తాయి. ఈ గీతలు కాయను మూడు భాగాలుగా విభజించినట్లుగా కనిపిస్తాయి. వాటిలో ఒక భాగం కొద్దిగా వెడల్పుగా ఉండగా.. మిగిలిన రెండు భాగాలు పోల్చితే చిన్నగా ఉంటాయి. కొబ్బరికాయను సులభంగా పగలగొట్టాలంటే ముందుగా ఈ సహజ నిర్మాణాన్ని గుర్తించడం ముఖ్యం.

కాయను చేతిలో పట్టుకునేటప్పుడు నిలువుగా ఉంచకుండా అడ్డంగా పట్టుకోవాలి. చిన్నగా కనిపించే రెండు భాగాలు కిందివైపు, కొద్దిగా పెద్దగా ఉన్న భాగం పైవైపు ఉండేలా అమర్చుకుంటే కొట్టాల్సిన ప్రాంతాన్ని గుర్తించడం సులభమవుతుంది.

కొబ్బరికాయను పగలగొట్టేందుకు కాస్త బరువున్న, గట్టిగా పట్టుకోగల వస్తువును ఉపయోగించడం సులభంగా ఉంటుంది. అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు చేతులకు గాయం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాయను ఒక చేతిలో అడ్డంగా పట్టుకుని, మరో చేతిలో బరువైన వస్తువును తీసుకోవాలి.

ఇప్పుడు కొబ్బరికాయ మధ్యలో కనిపించే సహజ గీతను గుర్తించి.. అదే ప్రాంతంలో నియంత్రితంగా రెండు సార్లు బలంగా కొట్టాలి. గీతపై సరిగ్గా దెబ్బ పడితే పెంకుపై పగులు ఏర్పడుతుంది. ఈ సమయంలో లోపల ఉన్న కొబ్బరి నీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ముందుగానే ఒక గిన్నెను సిద్ధంగా ఉంచుకుని నీటిని అందులోకి తీసుకోవచ్చు.

33
పగులు వచ్చిన తర్వాత ఇలా చేయండి
Image Credit : Gemini

పగులు వచ్చిన తర్వాత ఇలా చేయండి

కొబ్బరికాయకు పగులు వచ్చిన వెంటనే బలంగా కొట్టడం కొనసాగించకూడదు. ముందుగా కొబ్బరి నీటిని పూర్తిగా తీసేసి, ఆ తర్వాత ఏర్పడిన పగులు ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా మరోసారి కొడితే కాయ రెండు భాగాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది.

ఇలా కొబ్బరికాయ సహజ ఆకృతిని గమనించి, దాని మధ్య గీతను లక్ష్యంగా చేసుకుని కొట్టడం ద్వారా పెద్దగా శ్రమించకుండానే కాయను పగలగొట్టవచ్చు. అయితే చేతిలో పట్టుకుని కొట్టే పద్ధతుల్లో జారిపోవడం లేదా గాయం అయ్యే ప్రమాదం ఉంటుంది.. అందుకే వీలైనంత జాగ్రత్తగా, స్థిరమైన ప్రదేశంలో ఈ పని చేయడం మంచిది. పిల్లలు స్వయంగా ప్రయత్నించకుండా పెద్దల పర్యవేక్షణలోనే చేయడం సురక్షితం.

కొబ్బరికాయను పగలగొట్టడం కష్టమైన పని అనుకునేవారికి.. దాని సహజ నిర్మాణాన్ని అర్థం చేసుకుని సరైన ప్రాంతంలో దెబ్బ కొట్టడం ఒక సులభమైన పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఇళ్ళలో ఇలా ఈజీగా కొబ్బరికాయ కొట్టవచ్చు. దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అవసరం ఉండదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
US High Paying Jobs: అమెరికాలో ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతం వస్తుంది? భారతీయులకు టాప్ 7 ఆప్షన్స్ ఇవే
Recommended image2
Gold Loan : గోల్డ్ లోన్ మొత్తం కట్టేశారా? అయినా బ్యాంక్ మీ నగలు ఇవ్వకపోతే ఏం చేయాాలో తెలుసా?
Recommended image3
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Related Stories
Recommended image1
Coconut: పూజలో కొబ్బరికాయ కుళ్లిపోతే దాని అర్థం ఏంటి? అశుభానికి సంకేతమా?
Recommended image2
Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved