MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • US High Paying Jobs: అమెరికాలో ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతం వస్తుంది? భారతీయులకు టాప్ 7 ఆప్షన్స్ ఇవే

US High Paying Jobs: అమెరికాలో ఏ ఉద్యోగాలకు అత్యధిక జీతం వస్తుంది? భారతీయులకు టాప్ 7 ఆప్షన్స్ ఇవే

US High Paying Jobs: అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన లేదా నైపుణ్యం కలిగిన భారతీయ ఐటీ, మెడికల్ ప్రొఫెషనల్స్ అత్యధిక జీతాలు అందించే ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతారు. మరి అమెరికాలో ఏ ఉద్యోగాలకు ఎక్కువ జీతం వస్తుంది? ఇండియన్స్‌కు బెస్ట్ ఆప్షన్స్ ఏంటి?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 29 2026, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమెరికా ఏ కోర్సులు, ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసా?
Image Credit : chatgpt

అమెరికా ఏ కోర్సులు, ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసా?

అమెరికాలో ఉద్యోగం చేయాలి, భారీగా సంపాదించాలి అనేది చాలా మంది భారతీయుల కల. అయితే యూఎస్‌లో అన్ని రకాల ఉద్యోగాలకు ఒకేలాంటి వేతనాలు ఉండవు. కొన్ని రంగాల్లో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో శాలరీలు ఇస్తుంటారు. ముఖ్యంగా మెడిసిన్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, లా రంగాల్లో ఉన్నవారికి అమెరికాలో భారీగా డిమాండ్‌తో పాటు అత్యధిక జీతాలు అందుతున్నాయి.

వాస్తవానికి భారతీయులకు ఇది మాత్రమే బెస్ట్ అని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఏ ర్యాంకింగ్స్ ఇవ్వదు. కానీ, హెచ్-1బి వీసా, స్టెమ్ కోర్సులు, ఐటీ, హెల్త్‌కేర్ డేటాను పరిశీలిస్తే.. మనవాళ్లు ఏ రంగాల్లో ఎక్కువగా రాణిస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది. యూఎస్‌సీఐఎస్ గణాంకాల ప్రకారం, అమెరికాలో ఆమోదం పొందుతున్న హెచ్-1బి వీసాలలో ఏకంగా 71 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. వీటిలో కంప్యూటర్, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలదే హవా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డాక్టర్లు, సర్జన్లు
Image Credit : chatgpt

డాక్టర్లు, సర్జన్లు

అమెరికాలో అత్యంత ఎక్కువ జీతం లభించే రంగం మెడిసిన్. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) డేటా ప్రకారం, ఫిజిషియన్లు, సర్జన్ల సగటు వార్షిక వేతనం సుమారు రూ. 2.3 కోట్లు కంటే ఎక్కువే ఉంటుంది.

• పిడియాట్రిక్ సర్జన్స్: సుమారు ₹4.66 కోట్లు

• కార్డియాలజిస్ట్స్: సుమారు ₹4.14 కోట్లు

• రేడియాలజిస్ట్స్: సుమారు ₹3.51 కోట్లు

• సర్జన్లు: సుమారు ₹3.45 కోట్లు

• అనస్థీషియాలజిస్ట్స్: సుమారు ₹3.26 కోట్లు

అయితే భారతదేశంలో ఎంబీబీఎస్ లేదా పీజీ పూర్తి చేసినంత మాత్రాన అక్కడ నేరుగా ప్రాక్టీస్ చేయలేరు. యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్, క్లినికల్ ట్రైనింగ్, రెసిడెన్సీ వంటి దశలను దాటాల్సి ఉంటుంది.

36
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఏఐ నిపుణులు
Image Credit : Chatgpt

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఏఐ నిపుణులు

భారతీయులకు అత్యంత సులువైన, ప్రాచుర్యం పొందిన మార్గం సాఫ్ట్‌వేర్ రంగం. 2025 BLS లెక్కల ప్రకారం సాఫ్ట్‌వేర్ డెవలపర్ల సగటు జీతం సుమారు ₹1.13 కోట్లు కాగా, పెద్ద సాఫ్ట్‌వేర్ పబ్లిషింగ్ కంపెనీల్లో ఇది సుమారు ₹1.37 కోట్ల వరకు ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు ఉన్న సీనియర్ నిపుణులకు దాదాపు రూ. 1.3 కోట్ల నుండి రూ. 2.9 కోట్లకు పైగా వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నాయి.

46
ఐటీ అండ్ ఇంజనీరింగ్ మేనేజర్లు
Image Credit : AI-Generated (ChatGPT)

ఐటీ అండ్ ఇంజనీరింగ్ మేనేజర్లు

టెక్ రంగానికి అనుభవం తోడైతే మేనేజ్‌మెంట్ వైపు అడుగులు వేయవచ్చు. ఇక్కడ జీతాలు ఇంకా భారీగా ఉంటాయి.

• కంప్యూటర్ & ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు: సగటు జీతం సుమారు ₹1.60 కోట్ల వరకు ఉంటుంది.

• ఇంజనీరింగ్ విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సెమికండక్టర్, ఏరోస్పేస్ రంగాలు H-1B వీసా ఆమోదాల్లో దాదాపు 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక్కడ అనుభవాన్ని బట్టి సుమారు ₹70.9 లక్షల నుండి ₹1.00 కోట్లకు పైగా అందుకోవచ్చు.

56
ఫైనాన్షియల్ మేనేజర్లు, బ్యాంకింగ్
Image Credit : Chatgpt

ఫైనాన్షియల్ మేనేజర్లు, బ్యాంకింగ్

కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ రంగాల్లో కూడా వేతనాలు అద్భుతంగా ఉంటాయి. సగటు వార్షిక వేతనం సుమారు ₹1.56 కోట్లుగా నమోదు కాగా, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో పనిచేసే వారికి ప్రాథమిక జీతంతో పాటు భారీ బోనస్‌లు లభిస్తాయి. ఇది మొత్తం ప్యాకేజీని సుమారు ₹1.25 కోట్ల నుండి ₹3.34 కోట్ల కంటే పైగా ఉంటుంది.

66
వీసా నిబంధనలు, గమనించాల్సిన విషయాలు ఇవే
Image Credit : ChatGPT

వీసా నిబంధనలు, గమనించాల్సిన విషయాలు ఇవే

కేవలం జీతం మాత్రమే చూసి అమెరికా వెళ్లడం కుదరదు. అక్కడ ఉద్యోగం చేయడానికి వీసా ప్రాసెస్, ట్యాక్స్ సిస్టమ్ అర్థం చేసుకోవడం ముఖ్యం.

• H-1B వీసా: నిపుణులైన ఉద్యోగుల కోసం దీనిని ఉపయోగిస్తారు. FY2024లో ఆమోదం పొందిన H-1B పిటిషన్లలో భారత్‌లో జన్మించిన లబ్ధిదారులు 2,83,397 (71%) మంది ఉన్నారు.

• L-1, O-1 వీసాలు: ఇంటర్నెట్ లేదా ఎంఎన్‌సీ కంపెనీల అంతర్గత బదిలీలకు L-1 వీసా, అసాధారణ నైపుణ్యం ఉన్న పరిశోధకులకు O-1 వీసాలు ఉపయోగిస్తారు.

• STEM OPT: యూఎస్‌లో STEM కోర్సులు చేసిన భారతీయ విద్యార్థులకు హెచ్-1బి రాకపోయినా, మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం దక్కుతుంది.

అమెరికాలో అత్యధిక జీతం పొందాలంటే డాక్టర్, సర్జన్ వంటి వృత్తులు మొదటి స్థానంలో ఉంటాయి. కానీ భారతీయులకు వేగంగా, సులువుగా అవకాశాలు దక్కేది మాత్రం ఏఐ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫైనాన్స్ రంగాల్లోనే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Loan : గోల్డ్ లోన్ మొత్తం కట్టేశారా? అయినా బ్యాంక్ మీ నగలు ఇవ్వకపోతే ఏం చేయాాలో తెలుసా?
Recommended image2
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Recommended image3
House Construction Tips : గోడలకు పగుళ్లు రాకూడదా? అయితే ఇళ్లు కట్టేటప్పుడే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి
Related Stories
Recommended image1
Butterfly Pea Flower: ముసలితనం రాకుండా చేసే పువ్వు.. ఈ మొక్కకు అంత పవర్ ఉందా? అసలు నిజం ఇదే
Recommended image2
Top Selling Cars: ఇండియాలో ఎక్కువగా నడిచే కార్లు ఏవి? ఎందుకు ఈ కార్లను ఎక్కువగా కొంటున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved