MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • Coconut: పూజలో కొబ్బరికాయ కుళ్లిపోతే దాని అర్థం ఏంటి? అశుభానికి సంకేతమా?

Coconut: పూజలో కొబ్బరికాయ కుళ్లిపోతే దాని అర్థం ఏంటి? అశుభానికి సంకేతమా?

Coconut:  దేవుడి పూజలో కొబ్బరికాయలు కొట్టడం చాలా సహజం. అయితే.. ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్లిపోతూ ఉంటుంది. అలా కాయ కుళ్లిపోతే అశుభం అని భయపడుతూ ఉంటారు. దీని గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 25 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Coconut
Image Credit : our own

Coconut

హిందూ మతంలో కొబ్బరికాయలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా శుభకార్యంలో, పూజలో కొబ్బరి కాయను పగలకొడుతూ ఉంటారు. దేవుడికి ఈ కాయను సమర్పించడం వల్ల కోరికలు నెరవేరతాయి అని భావిస్తారు. పూజలో కొబ్బరికాయను కొట్టి.. దానిని ప్రసాదంలా తీసుకుంటూ ఉంటారు. అయితే.. కొబ్బరికాయను కొట్టిన ప్రతిసారీ.. అది ఒకేలా పగలదు. రెండు ముక్కలు ఒకే పరిమాణంలో ఉండవు. అంతేకాదు.. కొబ్బరికాయలో పువ్వు వస్తే ఒక అర్థం. కుళ్లిపోతే మరో అర్థం.. సగానికి పగులితే ఒక అర్థం.. ఇలా ఉంటుంది. మరి, దేని అర్థం ఏంటో తెలుసుకుందామా.....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొబ్బరికాయ సరిగ్గా సగానికి పగిలితే....
Image Credit : our own

కొబ్బరికాయ సరిగ్గా సగానికి పగిలితే....

మీరు దేవుడిని పూజించి కొబ్బరికాయ సరిగ్గా.. మధ్యలోకి రెండు ముక్కలు అయితే.. దానిని శుభ సంకేతంగా భావిస్తారు. దీని అర్థం.. దేవుని ఆశీస్సులు మీకు పూర్తిగా ఉన్నాయని అర్థం. కొబ్బరికాయ మధ్యలో పగిలితే.. దానిని మీరు ఒక్కరే తినకూడదు. ప్రసాదంగా అందరికీ పంచాలి. అలా చేయడం వల్ల.. దీని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.

34
సమానంగా పగలకపోతే
Image Credit : stockPhoto

సమానంగా పగలకపోతే

 కొన్నిసార్లు కొబ్బరికాయ సరిగ్గా పగలదు. ఒక వైపు ఎక్కువగా, మరోవైపు తక్కువగా పగిలిపోతుంది. చిన్న ముక్కలు మాత్రమే విరిగిపోతాయి. శాస్త్రాల ప్రకారం, దీనిలో చెడు ఏమీ లేదు. ఇది అశుభ సంకేతం కాదు. మీరు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచిది కావచ్చు.

3. ఊయల కొబ్బరి: చాలా అరుదుగా, కొబ్బరికాయ ఊయల కొబ్బరిగా మారుతుంది. అంటే, విరిగిన భాగం ఊయలలా కనిపిస్తుంది. శాస్త్రాల ప్రకారం, కొబ్బరి ఇలా పగిలితే... ఇంట్లో ఊయల కడతారని అర్థం. అంటే... ఇంట్లో కి చిన్న పిల్లలు రాబోతున్నారని దీని సంకేతం.

44
 కొబ్బరికాయలో పువ్వు..
Image Credit : Pinterest

కొబ్బరికాయలో పువ్వు..

 కొన్నిసార్లు కొబ్బరికాయ పగలకొట్టినప్పుడు పువ్వు కనిపిస్తుంది. ఒక పువ్వు కనిపిస్తే, దీనిని శాస్త్రాలలో శుభప్రదంగా భావిస్తారు. మీరు మీ అన్ని పనులలో విజయం సాధిస్తారని , అది శుభప్రదంగా ఉంటుందని దీని అర్థం.

5. చెడ్డ కొబ్బరికాయ: కొన్నిసార్లు పూజకు సమర్పించిన కొబ్బరి చెడిపోతుంది. అది కుళ్ళిపోతుంది. ప్రజలు దానిని చెడు శకునంగా భావిస్తారు. ఇలాంటి కొబ్బరికాయ కొట్టినప్పుడు తమకు ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందుతారు. కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం ప్రకారం, పూజలో ఉపయోగించే కొబ్బరికాయ చెడిపోతే, దానిని శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరిని తల్లి లక్ష్మీదేవితో పోల్చారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చెడిపోతే, దేవుడు నైవేద్యాన్ని అంగీకరించాడని ఇది సూచిస్తుంది. అందుకే.. కొబ్బరి కుళ్లిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు.

6. ఎండిన కొబ్బరి: పూజకు నీటితో కూడిన కొబ్బరిని మాత్రమే ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కొబ్బరి ఎండిపోతుంది. దీనిని కూడా అశుభంగా భావించాల్సిన అవసరం లేదు. శుభం గానే పరిగణించాలి. కొబ్బరి ఎండిపోతే, మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Navratri 2025: నవరాత్రుల్లో ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభించినట్లే..!
Recommended image2
Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే..లక్ష్మీదేవి అనుగ్రహం లభించినట్లే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved