MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం

Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి ఉత్తర భారతం అల్లకల్లోలమవుతోంది. ఎప్పుడు ఏ కొండచరియలు విరిగిపడతాయో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల క్రితం నేపాల్ లో జరిగిన ప్రమాదం మరవకముందే మరో ఘోరం జరిగింది. అసలు కొండ చరియలు ఎందుకు విరిగిపడుతున్నాయి?

2 Min read
Author : Nandini Arava
Published : Sep 28 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నేపాల్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం
Image Credit : gemini ai

నేపాల్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం

నేపాల్‌లో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాల వల్ల కాళి, గండకి, సున్ కోషి, మహాకాళి నదులు పొంగిపొర్లుతున్నాయి. ఓ చోట కొండచరియ విరిగిపడి అక్కడి గ్రామాలపైకి దూసుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. గత నెల జరిగిన ప్రమాదం మరువకముందే మరో ప్రకృతి విపత్తు ఎదురవడటంతో నేపాల్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత నెలలో వచ్చిన ఆకస్మిక వరదలతో ఇప్పటివరకూ దాదాపు 1500 వందలకుపైగా చనిపోయారు. 5 వేలకు పైగా గల్లంతయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హిమాలయాలే ప్రధాన కారణం
Image Credit : Gemini

హిమాలయాలే ప్రధాన కారణం

హిమాలయ ప్రాంతాల్లో తరచూ కొండచరియలు విరిగిపడటం చూస్తుంటాం. భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక్కసారిగా మట్టి, రాళ్లు కొండపై నుంచి కిందకు జారిపడుతుంటాయి. దీంతో రోడ్లు మూసుకుపోవడం, ఇళ్లు దెబ్బతినడం, రాకపోకలకు అంతరాయం కలగడం వంటి ఘటనలు జరుగుతాయి.

హిమాలయాలు భౌగోళికంగా పర్వత ప్రాంతం. భారత భూఫలకం ఉత్తర దిశగా కదులుతూ యూరేషియన్ భూఫలకంతో ఢీకొంటోంది. ఈ నిరంతర భౌగోళిక కదలికల కారణంగా హిమాలయ ప్రాంతంలోని అనేక కొండలు సహజంగానే బలహీనంగా, అస్థిరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ నేల కదలికలు, రాళ్లు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

36
భారీ వర్షాలతో పెరిగే ప్రమాదం
Image Credit : gemini ai

భారీ వర్షాలతో పెరిగే ప్రమాదం

వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలు కొండచరియలకు ప్రధాన ట్రిగ్గర్‌గా పనిచేస్తాయి. వర్షపు నీరు మట్టిలోకి వెళ్లి నేల బరువు పెరుగుతుంది. అదే సమయంలో మట్టి పొరల మధ్య ఉండే పట్టుదల తగ్గి కొండ వాలుపై ఉన్న మట్టి, రాళ్లు గురుత్వాకర్షణకు లోనై కిందకు జారిపడవచ్చు.

46
కొండల స్వరూపం, తగ్గుతున్న అడవులు
Image Credit : gemini ai

కొండల స్వరూపం, తగ్గుతున్న అడవులు

కొండ ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే మార్గాలు, సొరంగాలు, భవనాల నిర్మాణం కోసం కొండలను తవ్వడం జరుగుతుంది. ఇలా కొండ వాలును కోయడం వల్ల సహజమైన స్థిరత్వం దెబ్బతినవచ్చు. సరైన డ్రైనేజీ వ్యవస్థ, రక్షణ చర్యలు లేకపోతే వర్షాల సమయంలో ఈ ప్రాంతాలు ల్యాండ్‌స్లైడ్స్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతాల్లో చెట్లు, వృక్షాల వేర్లు మట్టిని పట్టి ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అడవులు తగ్గడం లేదా వృక్ష సంపద దెబ్బతినడం వల్ల మట్టి కోతకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. భారీ వర్షాలు పడినప్పుడు ఈ వదులైన మట్టి సులభంగా కొండపై నుంచి జారిపోవచ్చు.

56
భూకంపాల ప్రభావం కూడా ఉంటుంది
Image Credit : AP

భూకంపాల ప్రభావం కూడా ఉంటుంది

హిమాలయ ప్రాంతం భూకంపాలకు కూడా సున్నితమైన ప్రాంతం. భూకంపం సంభవించినప్పుడు కొండల్లోని రాళ్లు, మట్టి పొరలు కదిలిపోతాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న కొండ ప్రాంతాల్లో భూకంపం తర్వాత కొండచరియలు విరిగిపడే అవకాశం మరింత పెరుగుతుంది.

66
నదుల కోత కూడా ఒక కారణం
Image Credit : ANI

నదుల కోత కూడా ఒక కారణం

హిమాలయాల్లోని నదులు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఇవి కొండల అడుగు భాగాన్ని నిరంతరం కోస్తూ ఉంటాయి. అడుగు భాగం బలహీనపడితే పైభాగంలోని మట్టి, రాళ్లకు ఆధారం తగ్గుతుంది. దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఏర్పడుతుంది.

అందుకే ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటానికి ఒకే ఒక్క కారణం ఉండదు. పర్వతాల భౌగోళిక స్వభావం, భారీ వర్షాలు, భూకంపాలు, మంచు కరగడం, నదుల కోత, అడవుల తగ్గుదల, నిర్మాణ కార్యకలాపాలు వంటి అనేక అంశాలు కలిసి ల్యాండ్‌స్లైడ్ ప్రమాదాన్ని పెంచుతాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
వాతావరణం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
House Construction Tips : గోడలకు పగుళ్లు రాకూడదా? అయితే ఇళ్లు కట్టేటప్పుడే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి
Recommended image2
మనం ఏడ్చేటప్పుడు కళ్లలోంచే కాదు ముక్కులోంచి కూడా నీళ్లు కారతాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Butterfly Pea Flower: ముసలితనం రాకుండా చేసే పువ్వు.. ఈ మొక్కకు అంత పవర్ ఉందా? అసలు నిజం ఇదే
Related Stories
Recommended image1
October Travel: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేసే బెస్ట్ డెస్టినేషన్స్
Recommended image2
Soil Smell: వర్షం తర్వాత వచ్చే మట్టివాసనకు ప్రత్యేకమైన పేరు ఉందని తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved