MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Free Service : పెట్రోల్ బంక్ తో మీ ఖర్చు కంట్రోల్.. ఎలాగో తెలుసా..?

Free Service : పెట్రోల్ బంక్ తో మీ ఖర్చు కంట్రోల్.. ఎలాగో తెలుసా..?

పెట్రోల్ బంక్‌లలో ఇంధనం నింపుకోవడమే కాదు, మనకు తెలియని ఎన్నో ఉచిత సేవలు కూడా పొందవచ్చు. ఈ కస్టమర్ హక్కుల గురించి తెలుసుకుంటే మీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది… డబ్బులు కూడా ఆదా అవుతాయి. 

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్రోల్ బంక్ ను ఇలా కూడా వాడుకొండి...
Image Credit : Getty

పెట్రోల్ బంక్ ను ఇలా కూడా వాడుకొండి...

కొందరు రోజూ, మరికొందరు కనీసం వారానికి ఒకసారైనా పెట్రోల్ బంక్‌కు వెళతారు. వీరిలో 99 శాతం మంది పెట్రోల్ బంక్ కు వెళ్ళామా... బండిలో ఇందనం కొట్టించుకున్నామా... వెళ్ళిపోయామా అన్నట్లుంటారు. కానీ ఈ పెట్రోల్ బంకుల్లో వాహనదారుల కోసం చాలా ఉచిత సేవలు ఉన్నాయి... వీటిని ఉపయోగించుకోవడం కాదు చాలామందికి ఉంటాయని కూడా తెలియదు. ఈ ఉచిత సేవలను ఉపయోగించుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది... సౌకర్యవంతంగా ప్రయాణం సాగించవచ్చు.

భారతదేశంలోని పెట్రోల్ బంకులు కస్టమర్ల ప్రాథమిక అవసరాల కోసం కొన్ని సౌకర్యాలు కల్పించడం తప్పనిసరి. ఈ హక్కుల గురించి తెలుసుకుని వాడుకుంటే మీ ప్రయాణం మరింత సురక్షితంగా, సులభంగా మారుతుంది. ఇలా పెట్రోల్ బంకులు అందించే సేవలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్రోల్ బంక్ తో డబ్బులు సేవ్..
Image Credit : Gemini AI

పెట్రోల్ బంక్ తో డబ్బులు సేవ్..

ప్రయాణాల సమయంలో వెహికిల్ కండీషన్ బాగుండాలి. ఏవైనా సమస్యలుంటే రోడ్డుపై ఇబ్బందిపడాల్సి వస్తుంది. ముఖ్యంగా టైర్లలో గాలి సరిపడా ఉంటే వాహనం స్మూత్ గా దూసుకెళుతుంది. మీ వాహనం టైర్లలో గాలి తక్కువగా అనిపిస్తే వెంటనే పెట్రోల్ బంకును ఆశ్రయించండి. టైర్లలో గాలి నింపడం అన్ని పెట్రోల్ బంకుల్లో ఉచితంగా లభించే ప్రాథమిక సేవ. మీ వాహనంలో ఎలాంటి ఛార్జీ లేకుండానే గాలి నింపుకోవచ్చు.

బయట కారులోని నాలుగు టైర్లలో గాలి నింపాలంటే తక్కువలో తక్కువ రూ.40 తీసుకుంటారు... అదే బైక్ లో అయితే రూ.20 తీసుకుంటారు. వారానికి ఓసారి ఇలా వాహనంలో గాలి నింపించుకుంటే నెలకు రూ.80-160 ఖర్చు అవుతుంది. కానీ పెట్రోల్ కొట్టించుకోడానికి వెళ్లినపుడు బంకులో ఫ్రీగా గాలి నింపుకుంటే ఈ డబ్బులు ఆదా అవుతాయి. చాలా చోట్ల గాలి నింపేందుకు డిజిటల్ ఎయిర్ మెషీన్లు ఉంటాయి, కొన్నిచోట్ల సిబ్బంది కూడా సహాయం చేస్తారు. సురక్షితమైన ప్రయాణానికి సరైన టైర్ ప్రెజర్ చాలా అవసరం కాబట్టి, ఈ సేవను తప్పకుండా వాడుకోండి.

35
పెట్రోల్ బంక్ ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం..
Image Credit : ANI

పెట్రోల్ బంక్ ఉచిత ఫోన్ కాల్ సౌకర్యం..

సుదీర్ఘ ప్రయాణాల్లో దాహం వేయడం లేదా టాయిలెట్ అవసరం రావడం సహజం. రోడ్డుపక్కన టాయిలెట్లు ఉండవు కాబట్టి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు పెట్రోల్ బంకుల్లో వాష్‌రూమ్‌లను ఉచితంగా వాడుకోవచ్చు. శుభ్రమైన తాగునీటిని కూడా పొందవచ్చు. ముఖ్యంగా మీరు ఆ బంక్‌లో ఇంధనం నింపకపోయినా సరే ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. ఇది మీ హక్కు.

మరో ముఖ్యమైన సేవ ఎమర్జెన్సీ ఫోన్ కాల్. ప్రయాణంలో మీ మొబైల్ పనిచేయకపోయినా లేదా అత్యవసర సహాయం కావాలన్నా, పెట్రోల్ బంక్ నుండి ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకునేందుకు అనుమతి ఉంది. రోడ్డు భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమైన సహాయం.

45
ఈ ప్రమాదల సమయంలోనూ పెట్రోల్ బంక్ సేవలు వాడుకొండి...
Image Credit : stockPhoto

ఈ ప్రమాదల సమయంలోనూ పెట్రోల్ బంక్ సేవలు వాడుకొండి...

రోడ్లపై చిన్నచిన్న ప్రమాదాలు సర్వసాధారణం...ఇలా ప్రమాదం జరిగి స్వల్ప గాయాలపాలయితే హాస్పిటల్ వెళ్లాల్సిన పనిలేదు. దగ్గర్లోని పెట్రోల్ బంకుల్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను వాడుకోవచ్చు. ఇందులో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వంటి ప్రాథమిక వైద్య వస్తువులు ఉండాలి. అవి సరైన స్థితిలో ఉన్నాయో లేదో చూడటం బంక్ యాజమాన్యం బాధ్యత.

భద్రతకు సంబంధించి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ (అగ్నిమాపక పరికరం) సౌకర్యం కూడా తప్పనిసరి. ఇంధనం నింపే చోట అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువ కాబట్టి అత్యవసర సమయాల్లో ఈ పరికరాలను ఉపయోగించే హక్కు అందరికీ ఉంటుంది. ఇది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అంశం.

55
పెట్రోల్ కొట్టించుకుంటే రసీదు తప్పనిసరి... ఎందుకో తెలుసా?
Image Credit : Gemini AI

పెట్రోల్ కొట్టించుకుంటే రసీదు తప్పనిసరి... ఎందుకో తెలుసా?

మీరు ఎంత తక్కువ పెట్రోల్ కొట్టించుకున్నా రసీదు అడిగే హక్కు మీకు ఉంది. ఇంధనం పరిమాణం లేదా నాణ్యతపై ఏవైనా సమస్యలు వస్తే ఇది ఆధారంగా ఉపయోగపడుతుంది. రసీదు ఇవ్వడానికి నిరాకరించడం నిబంధనలకు విరుద్ధం. ప్రతి పెట్రోల్ బంక్‌లో యజమాని వివరాలు, పనివేళలు, ఫిర్యాదు నమోదు చేసే సౌకర్యం ఉండాలి. కస్టమర్లు తమ సమస్యలను తెలియజేయడానికి ఒక ఫిర్యాదుల పుస్తకాన్ని ఉంచడం తప్పనిసరి.

మొత్తం మీద పెట్రోల్ బంకులు కేవలం ఇంధనం నింపే ప్రదేశాలు మాత్రమే కాదు ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే సేవా కేంద్రాలు కూడా. ఈ హక్కుల గురించి తెలుసుకుని, వాటిని ఉపయోగించుకుంటే మీరు మాత్రమే కాదు, ఇతరులకు కూడా అవగాహన కల్పించవచ్చు. ఇకపై పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడు ఈ ఉచిత సౌకర్యాలను మర్చిపోకుండా వాడుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
చిట్కాలు మరియు ఉపాయాలు
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Petrol: భూమి కింద పెట్రోల్‌ ఎలా ఏర్పడుతుంది? కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు లభిస్తుంది?
Recommended image2
Petrol Price Hike : ఏమిటీ...! ఇండియాలో పెట్రోల్ రేటు రూ.28 పెరగడం ఖాయమా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved