MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Petrol Price Hike : ఏమిటీ...! ఇండియాలో పెట్రోల్ రేటు రూ.28 పెరగడం ఖాయమా..?

Petrol Price Hike : ఏమిటీ...! ఇండియాలో పెట్రోల్ రేటు రూ.28 పెరగడం ఖాయమా..?

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చుట్టుపక్కల దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇండియాలో కూడా పెట్రోల్ ధరలు పెరగనున్నాయట. ఎప్పట్నుంచో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 23 2026, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్నికల తర్వాత ధరల బాదుడేనా..?
Image Credit : Getty

ఎన్నికల తర్వాత ధరల బాదుడేనా..?

దేశంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని 'కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్' (KIE) నివేదించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఇంధన ధరలు పెరుగుతాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినందున, లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.25 నుంచి రూ.28 వరకు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు, ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు కొటక్ రిపోర్ట్ చెబుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎందుకు ధరల పెంపు..?
Image Credit : Getty

ఎందుకు ధరల పెంపు..?

పశ్చిమ ఆసియాలో ఇంకా యుద్దవాతావరణమే నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సముద్ర రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' మూతపడింది. అందువల్లే మిడిల్ ఈస్ట్ దేశాల నుండి జరిగే చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల ముడిచమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. స్పాట్ ధరలు, ఫ్యూచర్స్ ధరల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇది చమురు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడి ఉందని సూచిస్తోంది.

35
దిగుమతి ఖర్చులభారం...
Image Credit : ChaGPT

దిగుమతి ఖర్చులభారం...

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ దిగుమతి ఖర్చు గణనీయంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్ 'క్రూడ్ బాస్కెట్' ధర బాగా పెరిగింది. దిగుమతుల పరిమాణం 13-15% తగ్గినా, దిగుమతి ఖర్చు పెరగడంతో రోజుకు 190 నుంచి 210 మిలియన్ డాలర్ల మేర అదనపు భారం పడుతోంది. అందువల్లే ఆయిల్ కంపెనీలు ధరల పెంపుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి... అందుకే కేంద్రం తాత్కాలికంగా పెంపును అడ్డుకుంది. ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఖాయమని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది.

45
చమురు కంపెనీలకు భారీ నష్టాలు
Image Credit : stockPhoto

చమురు కంపెనీలకు భారీ నష్టాలు

ప్రస్తుత పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగినా, భారత్‌లో ఇంధన ధరలను సవరించలేదు. ఇది చమురు శుద్ధి కర్మాగారాలకు (రిఫైనరీలకు) భారీ ఆర్థిక భారంగా మారింది. కంపెనీలకు ప్రతినెలా సుమారు రూ.27,000 కోట్ల అదనపు నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకంలో రూ.10 మినహాయింపు ఇచ్చినా, అది కంపెనీల భారీ నష్టాలను పూడ్చడానికి సరిపోవడం లేదు. అందుకే ధరలు పెంపు తప్పేలా లేదంటున్నారు మార్కెట్ నిపుణులు.

55
ఏప్రిల్ 29 తర్వాత ధరల సవరణ..?
Image Credit : ANI

ఏప్రిల్ 29 తర్వాత ధరల సవరణ..?

రాజకీయ కారణాల వల్లే ప్రస్తుతం ధరల పెంపును నిలిపివేశారని కోటక్ ఈక్విటీస్ విశ్లేషించింది. ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలను సవరించే అవకాశం ఉంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 120 డాలర్లకు చేరడంతో, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని, చిన్న మొత్తాల్లో ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. దీన్నిబట్టి వచ్చేనెల మే లో ఎప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉంటుందన్నమాట.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Petrol: భూమి కింద పెట్రోల్‌ ఎలా ఏర్పడుతుంది? కొన్ని ప్రాంతాల్లోనే ఎందుకు లభిస్తుంది?
Recommended image2
Petrol Saving Tips : పెట్రోల్ ఆదాచేసే టాప్ 10 దేశీ ట్రిక్స్.. నెలకి రూ.3000 వరకు సేవ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved