MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?

Did you know: రామాయణంలో పిడకల వేట అంటే ఏమిటి? మీకు తెలుసా?

Did you know: చాలాసార్లు రామాయణంలో పిడకల వేట అనే సామెత వినిపిస్తుంది. అసలు దానికి అర్థం ఏమిటి? రామాయణంలో పిడకల గురించి ఎలాంటి సందర్భం ఉంది? ఈ సామెత ఎలా పుట్టిందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 30 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రామాయణంలో పిడకల వేట అంటే?
Image Credit : Gemini AI

రామాయణంలో పిడకల వేట అంటే?

‘రామాయణంలో పిడకల వేట’ అనే సామెత మీరు చాలాసార్లు వినే ఉంటారు. అసలు దీనికి అర్థం ఏమిటి? రామాయణానికి, పిడకలకు ఏంటి సంబంధం? ఇలా మీకు కూడా సందేహం వచ్చే ఉంటుంది. దీని వెనుక ఎంతో ఆసక్తికరమైన గ్రామీణ నేపథ్యం దాగి ఉంది. పూర్వకాలంలో గ్రామాల్లో వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యిలను మాత్రమే ఉపయోగించేవారు. ఈ పొయ్యిలో పిడకలను వేసి వెలిగించేవారు. ఆ పిడకల కోసం పశువుల పేడ అవసరం పడేది. అయితే సొంతంగా పశువులు ఉన్నవారు తమ ఇంట్లోనే పిడకలు చేసుకునేవారు. కానీ పశువులు లేనివారు మాత్రం పిడకల కోసం గ్రామాల్లో ఎక్కుడైనా పశువులు పేడ వేశాయేమో అని వెతికేవారు. గ్రామంలోని పశువులన్నీ సాయంత్రం వేళ మేత మేసి తిరిగి వస్తునప్పుడు దారి పొడవునా పేడ వేస్తూ వెళ్లేవి. అలా నేలపై పడిన పేడను ‘పేడకళ్లు’ అని పిలిచేవారు. పశువులు లేని గ్రామస్థులు తమ ఇంటి అవసరాల కోసం దారిలో పడిన ఆ పేడకళ్లను ఏరుకుని తెచ్చుకుని పిడకలు చేసుకునేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రామాయణంతో ఏంటి సంబంధం?
Image Credit : Gemini AI

రామాయణంతో ఏంటి సంబంధం?

రామాయణంలో పిడకల వేటకు.. గ్రామాల్లో పెట్టే పిడకలకు చిన్న సంబంధం ఉంది. పూర్వం పండుగలు లేదా ప్రత్యేక రోజుల్లో ఊరి ఆలయంలో పండితులు రామాయణ ప్రవచనాలు చెప్పేవారు. ఊరి ప్రజలంతా అక్కడ చేరి ఎంతో ఆసక్తిగా ఆ శ్రీరాముని కథను వింటూ ఉండేవారు. సరిగ్గా అదే సమయంలో మేత మేసిన ఆవులు, బర్రెలు గుంపులుగా వీధుల గుండా ఇళ్లకు వెళ్తుండేవి. అలా వెళుతూ అవి దారిలో పేడ వేస్తూ వెళ్లేవి. వాటిని చూసిన కొందరు భక్తులు, పిడకల కోసం రామాయణ కథను వినడం మధ్యలోనే ఆపేసి, ఆ పశువులు వేసే పేడకళ్లు ఏరుకోవడానికి వెళ్ళిపోయేవారు.

Related Articles

Related image1
Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
Related image2
Google Earnings: గూగుల్ ఒక్కరోజులో ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
33
పండితుల బాధ నుంచి పుట్టిన సామెత
Image Credit : Gemini AI

పండితుల బాధ నుంచి పుట్టిన సామెత

రామాయణ కథను వినడం వదిలేసి పేడ ఏరుకోవడానికి వెళుతున్నారేంట్రా అని ఆ పండితుడు బాధ పడేవారు. అలా పండితులు రామాయణం మధ్యలో ఈ పేడకళ్ల పేడకళ్ల వేట ఏమిటిలో అనేవారు. ఆ మాటే కాలక్రమంలో ప్రజల వాడుకలో 'పిడకల వేట'గా మారింది. చివరికి అదే ‘రామాయణంలో పిడకల వేట’ అనే సామెతగా నిలిచిపోయింది. ముఖ్యమైన పనిని పక్కన పెట్టేసి, చిన్నచిన్న అవసరాల వెంటపడటాన్ని సూచించడానికి నేటికీ ఈ సామెతను వాడుతూ ఉంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Recommended image2
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Recommended image3
కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?
Related Stories
Recommended image1
Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
Recommended image2
Google Earnings: గూగుల్ ఒక్కరోజులో ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved