- Home
- Feature
- Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
Gold Market: మనదేశంలో బంగారం తక్కువ ధరకు దొరికేది ఈ మార్కెట్లలోనే.. డిజైన్లు కూడా అదిరిపోతాయి
Gold Market: అన్ని వస్తువులకు హోల్ సేల్ మార్కెట్లు ఉంటాయి. మరి బంగారానికి లేవా? ఎందుకు లేవు... మనదేశంలో కొన్ని గోల్డ్ హోల్ సేల్ మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ మిగతా చోట్ల కన్నా కొంచెం తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది.

అతి తక్కువ ధరకే బంగారం
మనదేశంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా జరుగుతాయి. బంగారమంటే మన సంప్రదాయంలో ఒక భాగం. కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తుకు పెట్టుబడిగా కూడా బంగారాన్ని కొని దాచుకుంటారు ఎంతో మంది. మన దేశంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. బంగారు వ్యాపారులు, రిటైల్ జ్యువెలరీ షాపుల యజమానులు ఎక్కడ బంగారాన్ని కొంటారో తెలుసా? అధిక మొత్తంలో పసిడి కొనుగోలు చేసేవారి కోసం కొన్ని హోల్‌సేల్ మార్కెట్లు ఉన్నాయి. ఈ మార్కెట్లు బంగారు వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్లు మనదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ముంబైలోని జవేరీ బజార్ చాలా ప్రసిద్ధి చెందినది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద పసిడి వ్యాపార కేంద్రంగా చెప్పుకోవచ్చు. దేశంలో జరిగే బంగారం, వెండి వర్తకంలో అత్యధిక శాతం ఇక్కడి నుంచే సాగుతుంది. ఇక్కడ బులియన్ ట్రేడింగ్ నుంచి భారీ వెడ్డింగ్ జ్యువెలరీ,రోజువారీ వాడే డిజైన్ల వరకు అన్ని రకాల ఆభరణాలు హోల్‌సేల్ ధరకు లభిస్తాయి.
ఢిల్లీలోని మార్కెట్
ముంబైలో మాత్రమే కాదు ఢిల్లీలోని పురాతన ప్రాంతమైన చాందినీ చౌక్‌లో 'కూచా మహాజనీ' అనే మార్కెట్ ఉంది. ఇది ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద బంగారం మార్కెట్‌గా నిలిచింది. ఇక్కడ భారీ సైజు బ్రైడల్ జ్యువెలరీ, కుందన్ వర్క్, బంగారు బిస్కట్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే కోల్‌కతాలోని 'బో బజార్', 'బుర్రా బజార్'లలో కూడా ఎన్నో రకాల బంగారు ఆభరణాలు లభిస్తాయి. తేలికపాటి బరువు ఉండే హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఆభరణాలకు బాగా ఈ రెండు మార్కెట్లు చాలా పాపులర్. ఇక్కడ చేతివృత్తి కళాకారులు చేసే అత్యంత అరుదైన, ఆకర్షణీయమైన బెంగాలీ ఫిలిగ్రీ పనితనానికి మంచి డిమాండ్ ఉంది. వీటితో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ 'జోహరీ బజార్' కూడా బంగారం కొంచెం తక్కువ ధరకే దొరికే మార్కెట్. సంప్రదాయ రాజస్థానీ కుందన్, మీనాకారి, పోల్కీ జ్యువెలరీ ఇక్కడ లభిస్తుంది.
చెన్నైలో ఉన్న మార్కెట్
దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలకు చాలా క్రేజ్ ఎక్కువ. చెన్నైలోని జార్జ్ టౌన్లో సాంప్రదాయ దక్షిణ భారత టెంపుల్ జ్యువెలరీ, ఆంటిక్ జ్యువెలరీ హోల్‌సేల్ వ్యాపారం బాగా జరుగుతుంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలో ఉన్న 'పాట్ మార్కెట్', 'బేగం బజార్' ప్రాంతాలతో బంగారు ఆభరణాలు కొంచెం తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంది. తమిళనాడులోని కోయంబత్తూర్ మిషన్ మేడ్ చైన్లు, లైట్ వెయిట్ జ్యువెలరీ తయారీ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. కేరళలోని త్రిస్సూర్ పట్టణంలో దక్షిణ భారత సాంప్రదాయ ఆభరణాలను హోల్‌సేల్ గా సప్లై చేస్తుంది.

