MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • US Jobs For Indians: అమెరికాలో భారతీయులకు సిక్స్ ఫిగర్ జీతాలిచ్చే టాప్ హైపేయింగ్ ఉద్యోగాలు ఇవే

US Jobs For Indians: అమెరికాలో భారతీయులకు సిక్స్ ఫిగర్ జీతాలిచ్చే టాప్ హైపేయింగ్ ఉద్యోగాలు ఇవే

US High paying jobs for Indians: అమెరికాలో భారతీయులకు లక్ష డాలర్లకు పైగా జీతం అందించే టాప్ ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. అయితే, ఈ జాబ్స్ కోసం కావాల్సిన నైపుణ్యాలు, వీసా మార్గాలు వివరాలు, ఆ జాబ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 29 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమెరికాలో భారతీయులకు అత్యధిక జీతాలిచ్చే జాబ్స్
Image Credit : Chatgpt

అమెరికాలో భారతీయులకు అత్యధిక జీతాలిచ్చే జాబ్స్

అమెరికా అనగానే ప్రతీ భారతీయుడికి గుర్తొచ్చేది మంచి కెరీర్ ఆప్షన్స్, భారీ జీతాలు, ప్రపంచ స్థాయి పని అనుభవం. ప్రస్తుతం అమెరికాలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో స్కిల్డ్ వర్కర్లకు భారీగా డిమాండ్ ఉంది. వార్షిక జీతం $100,000 కంటే ఎక్కువ అందించే ఉద్యోగాలు అక్కడ చాలానే ఉన్నాయి. భారతీయ నిపుణులకు అమెరికాలో అత్యధిక జీతాలు అందించే టాప్ కెరీర్లు, అవసరమైన స్కిల్స్, కెరీర్ గ్రోత్ మార్గాల గురించి పూర్తి వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అత్యధిక జీతాలు ఇచ్చే టాప్ కెరీర్లు
Image Credit : Gemini AI

అత్యధిక జీతాలు ఇచ్చే టాప్ కెరీర్లు

అమెరికాలోని ప్రముఖ సంస్థల్లో లభించే అత్యధిక జీతాల వివరాలు ఇలా ఉన్నాయి..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మెటా వంటి బడా కంపెనీలు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులను నిరంతరం నియమించుకుంటాయి.

సగటు జీతం: ఏడాదికి రూ. 1.00 కోటి నుండి రూ. 1.50 కోట్లు.

కావాల్సిన స్కిల్స్: Java, Python, AI, Cloud Computing, DevOps.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్: ఏఐ విప్లవం వల్ల మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడింది.

సగటు జీతం: ఏడాదికి రూ. 1.17 కోట్లు నుండి రూ. 1.83 కోట్లు.

కావాల్సిన స్కిల్స్: Python, TensorFlow, Deep Learning, NLP, Data Science.

డేటా సైంటిస్ట్: డేటా ఆధారిత నిర్ణయాల కోసం కంపెనీలు వీరిపైనే ఆధారపడుతున్నాయి. అమెరికాలో వేగంగా పెరుగుతున్న కెరీర్లలో ఇది ఒకటి.

సగటు జీతం: ఏడాదికి రూ. 1.08 కోట్లు నుండి రూ. 1.58 కోట్లు.

కావాల్సిన స్కిల్స్: SQL, Python, Statistics, Machine Learning, Visualisation Tools.

ఫిజీషియన్, సర్జన్: హెల్త్‌కేర్ రంగంలో వీరికి అత్యధిక జీతాలు అందుతాయి. లైసెన్స్, రెసిడెన్సీ అవసరమైనప్పటికీ, ఆర్థికంగా అత్యుత్తమ రాబడి ఉంటుంది.

సగటు జీతం: ఏడాదికి రూ. 1.83 కోట్లు నుండి రూ. 3.34 కోట్లకు పైగా ఉంటుంది.

క్లౌడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్: కంపెనీలు క్లౌడ్‌కి మారుతుండటంతో వీరి విలువ పెరిగింది.

సగటు జీతం: ఏడాదికి . 1.25 కోట్లు నుండి రూ. 1.75 కోట్లు.

కావాల్సిన స్కిల్స్: AWS, Microsoft Azure, Google Cloud Platform, Security.

సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్: పెరుగుతున్న సైబర్ బెదిరింపుల కారణంగా కంపెనీలు ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

సగటు జీతం: ఏడాదికి . 1.08 కోట్లు నుండి రూ. 1.67 కోట్లకు పైగా.

కావాల్సిన స్కిల్స్: Network Security, Ethical Hacking, Risk Management.

ఫైనాన్షియల్ మేనేజర్: కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్‌లో నైపుణ్యం ఉన్నవారికి మంచి అవకాశాలున్నాయి.

సగటు జీతం: ఏడాదికి రూ. 1.17 కోట్లు నుండి రూ. 1.75 కోట్ల వరకు.

అర్హతలు: MBA, CPA, CFA.

Related Articles

Related image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Related image2
Most Expensive Snake: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాము.. ధర కోట్లలో.. ఎందుకంత స్పెషల్?
36
భారతీయులకు ఎందుకు ఇన్ని అవకాశాలు?
Image Credit : our own

భారతీయులకు ఎందుకు ఇన్ని అవకాశాలు?

స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలు, ఇతర ప్రధాన విభాగాల్లో భారతీయులకు మంచి పేరుంది. విదేశీ ప్రతిభను ప్రోత్సహించడానికి అక్కడి కంపెనీలు వీసా ప్రోగ్రామ్‌ల ద్వారా రిక్రూట్ చేసుకుంటాయి.

శాలరీ అడ్వాంటేజ్: అమెరికా డాలర్లలో సంపాదిస్తూ ఇండియాలో కుటుంబం లేదా పెట్టుబడులు ఉంటే ఆర్థికంగా త్వరగా ఎదుగొచ్చు. పన్నులు, ఖర్చులు పోగా ఏడాదికి 20,000 నుండి 50,000 డాలర్లు పొదుపు చేయడం సులువే.

నైపుణ్యానికే ప్రాధాన్యం: జాతీయత కంటే క్లౌడ్, ఏఐ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్ వంటి స్పెషలైజ్డ్ నైపుణ్యాలకే అమెరికా కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయి.

కెరీర్ బ్రాండింగ్: ఎఫ్ఏఏఎన్జీ లేదా ఫార్చ్యూన్ 500 కంపెనీలలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో ఇండియాకు తిరిగొచ్చినా లేదా సొంత బిజినెస్ పెట్టినా ఎంతో ఉపయోగపడుతుంది. బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఉండి 3 నుండి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారికి టెక్, అనలిటిక్స్ రోల్స్ చాలా వేగంగా వీసా మార్గాన్ని సుగమం చేస్తాయి.

46
వీసా దారులు, మెరికా మార్గాలు
Image Credit : Asianet News

వీసా దారులు, మెరికా మార్గాలు

అమెరికా చేరుకోవడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి..

1. స్టూడెంట్ టు వర్క్ మార్గం: యూఎస్‌లో స్టెమ్ మాస్టర్స్ పూర్తి చేసి, 2-3 ఏళ్ల ఓపీటీ వర్క్ రైట్స్, హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్ పొందడం.

2. డైరెక్ట్ H-1B లేదా L-1 వీసా: ఇండియాలోని టీసీఎస్, ఇన్ఫోసిస్, TCS, Infosys, యాక్సెంచర్ లేదా ఇతర ప్రొడక్ట్ కంపెనీలలో చేరి, ఆపై ఇంట్రా కంపెనీ లేదా హెచ్1బీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అమెరికా వెళ్లడం.

3. ఎక్సెప్షనల్ ప్రొఫైల్స్: సీనియర్ నిపుణులు, పరిశోధకులు లేదా వ్యాపారవేత్తలు ఏ1 లేదా ఈబీ1 కేటగిరీల కింద అర్హత సాధించవచ్చు.

56
సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన నైపుణ్యాలు
Image Credit : Asianet News

సెలెక్ట్ అవ్వడానికి కావాల్సిన నైపుణ్యాలు

అమెరికా జాబ్ మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి, ఎంపికయ్యే అవకాశాలను పెంచుకోవడానికి అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన అంశాలు గమనిస్తే..

• ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్.

• క్లౌడ్ కంప్యూటింగ్ (ఏడ్ల్యూఎస్, అజూర్, జీసీపీ).

• సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్.

• DevOps, ఆటోమేషన్.

• ప్రొజెక్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, లీడర్‌షిప్ స్కిల్స్.

66
పక్కా విజయం సాధించడానికి ఎలా సన్నద్ధమవ్వాలి?
Image Credit : Gemini AI

పక్కా విజయం సాధించడానికి ఎలా సన్నద్ధమవ్వాలి?

అమెరికాలో డాలర్ల డ్రీమ్ నెరవేరాలంటే సరైన ప్రణాళిక అవసరం. ముందుగా టెక్నికల్ డెప్త్ (డేటా స్ట్రక్చర్స్, సిస్టమ్ డిజైన్) సాధించాలి. అంతర్జాతీయ క్లయింట్లు, గ్లోబల్ సర్టిఫికేషన్లతో ఓ మంచి ప్రొఫెషనల్ రెజ్యూమ్‌ను రూపొందించుకోవాలి. 

అలాగే కోడింగ్ కోసం లీట్ కోడ్, ఇంటర్వ్యూల కోసం స్టార్ పద్ధతిని ప్రాక్టీస్ చేయాలి. న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ వంటి ఖరీదైన నగరాలే కాకుండా ఆస్టిన్, డల్లాస్, అట్లాంటా, సీటెల్ సబర్బ్స్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన హబ్‌లను ఎంచుకోవడం మంచిది. సరైన నైపుణ్యం, వ్యూహాత్మక ప్రణాళిక ఉంటే అమెరికా జాబ్ మార్కెట్ భారతీయులకు ఒక అద్భుతమైన అవకాశం అని విశ్లేషకులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Caps Tossing: డిగ్రీ అయ్యాక టోపీని గాల్లోకి ఎందుకు విసురుతారు? ఇది ఎప్పుడు మొదలైంది?
Recommended image2
Rice Business: TCS జాబ్‌ను వదిలేసిన యువకుడు.. బియ్యం వ్యాపారంతో ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం
Recommended image3
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Related Stories
Recommended image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Recommended image2
Most Expensive Snake: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాము.. ధర కోట్లలో.. ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved