MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Caps Tossing: డిగ్రీ అయ్యాక టోపీని గాల్లోకి ఎందుకు విసురుతారు? ఇది ఎప్పుడు మొదలైంది?

Caps Tossing: డిగ్రీ అయ్యాక టోపీని గాల్లోకి ఎందుకు విసురుతారు? ఇది ఎప్పుడు మొదలైంది?

Caps Tossing: డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు చేతికి రాగానే గాల్లోకి టోపీలు విసరడం చూసే ఉంటారు. ఇలా ఎందుకు విసురుతారు? దీని వెను 114 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒక సంప్రదాయం కూడా.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 29 2026, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టోపీలు విసరడం ఎందుకు?
Image Credit : Gemini AI

టోపీలు విసరడం ఎందుకు?

కాన్వొకేషన్ వేడుకలో డిగ్రీ అందుకున్న తర్వాత విద్యార్థులు ఒక్కసారిగా తమ టోపీలను గాల్లోకి విసరడం చూస్తూనే ఉంటారు. ఆనందంతో ఎగిరే ఆ టోపీల దృశ్యం చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది? దీని వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు. డిగ్రీ పూర్తి చేసిన ఆనందాన్ని చూపించేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు టోపీలను గాల్లోకి విసురుతున్నారు. అయితే ఈ అలవాటు వెనుక 114 ఏళ్లకు పైగా చరిత్ర దాగి ఉంది. ఈ సంప్రదాయం 1912లో అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో మొదలైనట్లు చెబుతారు. అక్కడ చదువు పూర్తి చేసిన విద్యార్థులు టోపీలను ధరించేవారు. కానీ 1912లో కొత్తగా అధికారులుగా మారబోయే వారికి ప్రత్యేకమైన టోపీలను ఇచ్చారు. దీంతో పాత టోపీల అవసరం లేకుండా పోయింది. తమ చదువు పూర్తయిందనే ఆనందంతో, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న ఉత్సాహంతో విద్యార్థులు పాత టోపీలను గాల్లోకి విసిరారు. ఆ దృశ్యం అందరికీ నచ్చడంతో క్రమంగా ప్రతి ఏడాది అదే పని చేయడం మొదలుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దుస్తులు, టోపీల వెనుక చరిత్ర
Image Credit : Getty

దుస్తులు, టోపీల వెనుక చరిత్ర

కాలం గడిచేకొద్దీ చదువు పూర్తవ్వగానే టోపీని గాల్లోకి విసరడం కేవలం ఒక సరదాగా, సంప్రదాయంగా మారింది. ఎన్నో సంవత్సరాల కష్టానికి, చదువుకు, పట్టుదలకు గుర్తుగా విద్యార్థులు ఈ క్షణాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు. టోపీ గాల్లోకి ఎగరడం అంటే ఒక విద్యా దశ ముగిసి, ఉద్యోగం, కొత్త అవకాశాలు, కొత్త లక్ష్యాలతో జీవితంలో మరో దశ ప్రారంభమవుతోందనే అర్థం. అందుకే కాన్వొకేషన్ వేడుకల్లో అలా గాల్లోకి టోపీలు విసరడం కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. డిగ్రీ వేడుకల్లో ధరించే నల్లటి గౌన్లు, చతురస్రాకార టోపీలకు కూడా చాలా పాత చరిత్ర ఉంది. యూరప్‌లోని పాత విశ్వవిద్యాలయాల కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు చలి నుంచి రక్షణ కోసం పొడవైన గౌన్లు, ప్రత్యేకమైన టోపీలు ధరించేవారు. తర్వాత ఇవి విద్య, జ్ఞానం, గౌరవానికి చిహ్నాలుగా మారాయి. ఆ తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో కాన్వొకేషన్ వేడుకల్లో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

Related Articles

Related image1
Rice Business: TCS జాబ్‌ను వదిలేసిన యువకుడు.. బియ్యం వ్యాపారంతో ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం
Related image2
Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?
33
అలా విసరడం ఒక ఆనందం
Image Credit : Getty

అలా విసరడం ఒక ఆనందం

చాలా మందికి టోపీని గాల్లోకి విసరడం ఒక సాధారణ పనిలా అనిపించవచ్చు. కానీ దాని వెనుక విద్యార్థుల కష్టం, విజయం, కొత్త భవిష్యత్తుపై ఆశ దాగి ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీ అందుకున్న తర్వాత ఆకాశంలోకి తమ టోపీలను విసిరి జీవితంలోని మధురమైన జ్ఞాపకంగా మార్చుకుంటారు. 114 ఏళ్ల క్రితం మొదలైన ఈ చిన్న సంప్రదాయం నేడు ప్రపంచవ్యాప్తంగా విద్యా విజయానికి గుర్తుగా నిలిచింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
Rice Business: TCS జాబ్‌ను వదిలేసిన యువకుడు.. బియ్యం వ్యాపారంతో ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం
Recommended image2
Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved