Google Earnings: గూగుల్ ఒక్కరోజులో ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
Google Earnings: గూగుల్ లేనిదే ఇప్పుడు రోజు గడవడమే కష్టం. ఏ సందేహం వచ్చినా మొదట అడిగేది గూగులమ్మనే. ప్రపంచంలో ఉన్న కోట్ల మంది వాడమే గూగుల్ కు రోజుకు ఎంత సంపాదన వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

గూగుల్ అంటే ఏమిటి?
ఇప్పుడు ప్రతి ఒక్కరూ గూగుల్ వాడుతున్నారు. అన్ని రంగాల్లో గూగుల్ ఉపయోగిస్తున్నారు. ఏ సందేహం వచ్చినా వెంటనే గూగుల్ నే అడుగుతారు. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. యూట్యూబ్, జీమెయిల్ వాడాలంటే గూగుల్ ఉండాల్సిందే. ప్రపంచమంతా వాడే గూగుల్ ఒక్కరోజు సంపాదన ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా?
గూగుల్ మాతృసంస్థ పేరు ఆల్ఫాబెట్. ఆ కంపెనీ నివేదిక ప్రకారం 2025లో ఆల్ఫాబెట్ ఏడాదికి సుమారు రూ.34 లక్షల కోట్లు సంపాదిస్తోందని తెలుస్తోంది. ఇంత సంపాదన ఉంది కాబట్టే గూగుల్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
గంటకు ఎంత సంపాదన?
షేర్ మార్కెట్‌లో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ షేర్ల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. 2026లో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. గూగుల్ ఏడాదికి సుమారు రూ.25 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ లెక్కన గంటకు రూ.285 కోట్లు గూగుల్ సంపాదిస్తోంది. అంటే రూ.1 కోటి సంపాదించడానికి గూగుల్‌కు కేవలం 12 నుంచి 13 సెకన్లు మాత్రమే పడుతుంది. ఇక ఒకరోజులో గూగుల్ సంపాదన 2,85,00,00,000X24=68,40,00,00,000.
ఎక్కడ నుంచి సంపాదన?
గూగుల్ కు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఎక్కడ నుంచి వస్తోందో తెలుసా? ఎక్కువగా యాడ్స్ ద్వారానే. దీనితో పాటు యూట్యూబ్, గూగుల్ క్లౌడ్, ప్లే స్టోర్, ఇతర సేవల నుంచి కూడా గూగుల్‌కు ఆదాయం వస్తుంది. ఈ మధ్య కాలంలో AIకి సంబంధించిన వాటి ద్వారా కూడా గూగుల్‌కు భారీగా డబ్బు వస్తోంది.

