MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఇది 'డిజిటల్ జంక్ ఫుడ్'.. రీల్స్ చూస్తుంటే మెదడులో ఇంత తతంగం జరుగుతుందా..!!

ఇది 'డిజిటల్ జంక్ ఫుడ్'.. రీల్స్ చూస్తుంటే మెదడులో ఇంత తతంగం జరుగుతుందా..!!

జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం చెడిపోతుంది… ఈ డిజిటల్ జంక్ ఫుడ్ తో మెదడు చెడిపోతుంది. అసలు పిల్లలు, పెద్దలు ఎగబడి చూసే రీల్స్ వల్ల మన మెదడులో ఇంత తతంగం జరుగుతుందా..?

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Apr 10 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రీల్స్ చూసే సమయంలో మన మెదడులో ఇంత జరుగుతుందా..!
Image Credit : Gemini

రీల్స్ చూసే సమయంలో మన మెదడులో ఇంత జరుగుతుందా..!

మనం ఫోన్ వాడుతున్నామా లేక అది మనల్ని వాడేస్తోందా? ఈ మాట వింటే కఠినంగా ఉన్నా, ఇదే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న వాస్తవం..!

“ఫ్రీ” అని మనం ఆసక్తిగా స్వైప్ చేస్తున్న రీల్స్, యాప్స్ వెనుక ఒక పెద్ద ఆట దాగి ఉంది... అదే 'అటెన్షన్ ఎకానమీ'!

మీ కళ్ళు స్క్రీన్‌కు మాత్రమే అతుక్కుపోయి, మెదడు మత్తులో మునిగిపోవడమనేది పెద్ద ఇంటర్నేషనల్ మల్టీ క్రోర్ బిజినెస్.

ఫ్రీ అనే ఎరకి చిక్కిన చేపలు మనం..!

ఫ్రీ యాప్ అంటే... మీ టైం, మీ ఫోకస్, మీ ప్రతీ లైక్ అమ్మకానికి పెట్టడమే..!

టెక్ జెయంట్స్ మన మెదళ్లని హుక్ చేయడానికి కోట్లు పెడుతున్నాయి.

లైక్ వచ్చినా, కొత్త పోస్ట్ కనిపించినా, మన బ్రెయిన్‌ లో డోపమైన్ అనే కెమికల్ విడుదల అవుతుంది.

అది ఒక చిన్న హై ఇస్తుంది.

లైక్స్, కామెంట్స్ లేక నోటిఫికేషన్ రింగ్ మోగినప్పుడు బ్రెయిన్‌కు కిక్ వచ్చి, అది స్లాట్ మెషీన్ అయిపోతుంది.

“ఇంకో రీల్ లాస్ట్” అని అనుకుంటాం, కానీ అది ఎప్పుడూ ఆగదు.

23
ఇది డిజిటల్ జంక్‌ఫుడ్..!
Image Credit : stockPhoto

ఇది డిజిటల్ జంక్‌ఫుడ్..!

మనం ఈ వలయంలో చిక్కుకుని, ఫోకస్ పోగొట్టుకుని, ఒంటరితనంలో మగ్గుతున్నాం..!

గతంలో గంటలు గంటలు పుస్తకాలు చదవేవాళ్లం, ఇప్పుడు 2 నిమిషాల వీడియోకి కూడా పేషెన్స్ లేదు.

పిల్లల్లో..

మెమరీ వీక్ అవుతోంది

దేనిపైనా ఫోకస్ చేయలేరు

చిన్న విషయాలకు చిరాకు, అసహనం

పెద్దలమాటలకు లెక్కచేయరు... ఎదురు సమాధానం చెప్తారు

ఇదంతా ఫోన్ వల్లే!

కుటుంబంతో మాట్లాడకుండా, డిజిటల్ ప్రపంచ ఊబిలో మునిగిపోతున్నాం, మన పిల్లల్ని కూడా లాగేస్తున్నాం.

ఈ డిజిటల్ భూతాలను కనిపెట్టిన స్టీవ్ జాబ్స్, బిల్గేట్స్ లాంటి వారే తమ పిల్లల్ని వీటికి దూరంగా పెంచారు.

మరి మనం మన పిల్లలను ఈ డిజిటల్ మత్తుకు ఎందుకు బానిసల్ని చేస్తున్నాం..?

ఆలోచించండి..!

Related Articles

Related image1
Reels Competition : రీల్స్ చేయండి... కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తుంది.. ఎంతో తెలుసా?
Related image2
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు
33
పోన్ చూడకండి...
Image Credit : stockPhoto

పోన్ చూడకండి...

బోర్ కొట్టినా పర్వాలేదు... ఫోన్ చూడకండి.

వాకింగ్ కి వెళ్ళండి

పుస్తకాలు చదవండి

కుటుంబంతో సమయం గడపండి

పిల్లలతో కలిసి ఆటలు ఆడండి

వాళ్ళకి కథలు చెప్పండి

వారి బంగరు భవితకు బాటకు వేయండి.

చివరిగా ఒక మాట : టెక్నాలజీ మనకు బానిస కావాలని కానీ మనమీద సవారీ చేయకూడదు..!

స్క్రీన్ టైం కన్నా ఫ్యామిలీ టైం మిన్న!

By Archana.

Dean.

Slate.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational story: ఆ నలుగురు ఏమన్న అనుకోని.. జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే కథ.
Recommended image2
Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ
Recommended image3
GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు
Related Stories
Recommended image1
Reels Competition : రీల్స్ చేయండి... కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తుంది.. ఎంతో తెలుసా?
Recommended image2
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved