Reels Competition : రీల్స్ చేయండి... కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తుంది.. ఎంతో తెలుసా?
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం "A Decade of Digital India" పేరిట రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది. మీరు కూడా రీల్స్ చేసి ఈ పోటీలో పాల్గొనవచ్చు.. డబ్బులు గెలుచుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ రీల్స్ కాంపిటీషన్
Digital India : మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారా? సరదాగా వీడియోలు తీసుకోవడం, రీల్స్ చేయడం చేస్తుంటారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు గెలుచుకునే అద్భుత అవకాశం వచ్చింది. మీ రీల్ కు కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు రావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
A Decade of Digital India - Reel Content
నరేంద్ర మోదీ సర్కార్ డిజిటల్ పేమెంట్స్ ను బాగా ప్రోత్సహిస్తోంది... ఇందుకోసం సరిగ్గా పదేళ్లక్రితం 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎంతలా సక్సెస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై దశాబ్దం పూర్తవుతోంది... ఈ క్రమంలోనే సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసమే ''A Decade of Digital India'' పేరిట రీల్స్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది.
రీల్స్ చేయాల్సిన అంశాలివే
ఈ నెల ఆరంభంతోనే అంటే జులై 1, 2025 నుండే ఈ రీల్స్ కాంపిటీషన్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే పలువురు రీల్స్ చేసి పంపించారు. ఆగస్ట్ 1, 2025 వరకు రీల్స్ పంపించవచ్చు. కింద పేర్కొన్న అంశాలపైనే రీల్స్ చేయాల్సి ఉంటుంది.
1. UPI Payment (ఆన్ లైన్ పేమెంట్స్)
2. ఆన్ లైన్ సేవలు
3. డిజిటల్ ఎడ్యుకేషన్
4. హెల్త్ ఆండ్ టెక్నాలజీ
రీల్స్ ఎలా ఉండాలంటే..
మీరు చేసే రీల్ కనీసం 1 నిమిషం నిడివి ఉండాలి... అదికూడా హైక్వాలిటి MP4 ఫార్మాట్ లో ఉండాలి. ఇప్పటికే ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్ట్ చేసి ఉండకూడదు. ఇతరుల రీల్స్ కాఫీచేసి పంపకూడదు... ఇది మీ సొంత కంటెంట్ అయివుండాలి. భారతదేశంలోని ఏ భాషలోనైనా డిజిటల్ ఇండియా కాంపిటేషన్ కోసం రీల్ చేయవచ్చు.
డిజిటల్ ఇండియా రీల్ కాంపిటీషన్ లో ఇలా పాల్గొనండి..
ముందుగా కేంద్ర ప్రభుత్వ 'MyGov' వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
అందులో ''A Decade of Digital India - Reel Content'' పై క్లిక్ చేయండి. ఇందులో లాగిన్ అయి మీ రీల్ ను పంపించవచ్చు.
మీరు సబ్మిట్ చేసినతర్వాత కన్ఫర్మెషన్ మెసేజ్ మీ ఈమెయిల్ లేదా ఫోన్ కు మెసేజ్ రూపంలో వస్తుంది.
ఉత్తమ రీల్స్ కు నగదు బహుమతి... ఎంత ఇస్తారు?
టాప్ 10 రీల్స్ కి రూ.15,000 చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.
తర్వాత 25 రీల్స్ కి రూ.10,000 చొప్పున లభిస్తుంది.
తర్వాతి మరో 50 రీల్స్ కి రూ.5,000 చొప్పున లభిస్తుంది.
ఇలా మొత్తం 85 రీల్స్ కు నగదు బహుమతి లభిస్తుంది. అలాగే ఈ ఉత్తమ రీల్స్ ను గవర్నమెంట్ ప్లాట్ ఫామ్స్ లో ప్రదర్శిస్తారు.