MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • బ్రాయిల‌ర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వ‌ర‌గా మెచ్యూర్ అవుతారా.? కోళ్ల‌కు నిజంగానే హార్మోన్స్ ఇస్తారా?

బ్రాయిల‌ర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వ‌ర‌గా మెచ్యూర్ అవుతారా.? కోళ్ల‌కు నిజంగానే హార్మోన్స్ ఇస్తారా?

Broiler chicken: బ్రాయిలర్ చికెన్ తింటే అమ్మాయిలు చిన్న వయసులోనే యుక్తవయసుకు వస్తారని, కోళ్లకు హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారని చాలామంది భావిస్తుంటారు. ఇంత‌కీ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 13 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్రాయిలర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతారా.?
Image Credit : Gemini AI

బ్రాయిలర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతారా.?

బ్రాయిల‌ర్ చికెన్‌కు సంబంధించి జ‌రిగే ప్ర‌చారంపై ప్రముఖ వైద్యుడు విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను సులభంగా వివరించే ఆయన, ఈసారి నేరుగా కోళ్ల ఫామ్‌కు వెళ్లి పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల అమ్మాయిలు చిన్న వయసులోనే యుక్తవయసుకు వస్తారని కొంద‌రిలో ఒక అభిప్రాయం ఉంది. కోళ్ల పెరుగుదల కోసం వాటికి హార్మోన్లు ఇస్తారని, ఆ చికెన్ తినడం వల్ల పిల్లల్లో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడంలో భాగంగా డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్‌సింగ్ బాయాస్‌తో మాట్లాడి కోళ్ల పెంపకం, వాటి ఎదుగుదల, హార్మోన్ల వినియోగం వంటి అంశాలపై వివరాలు సేకరించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోళ్లకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం నిజంగా సాధ్యమేనా.?
Image Credit : Gemini AI

కోళ్లకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం నిజంగా సాధ్యమేనా.?

కోళ్లు త్వరగా బరువు పెరగడానికి వాటికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారనే ప్రచారంపై ఉదయ్‌సింగ్ బాయాస్ స్పందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి కోడికి ఇంజెక్షన్ ఇవ్వడం ఆచరణలో చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క ఇంజెక్షన్‌కు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చవుతుందని, ఒక పౌల్ట్రీ ఫామ్‌లో వేల సంఖ్యలో కోళ్లు ఉంటాయని ఆయన వివరించారు. ఇన్ని కోళ్లకు ఇంజెక్షన్లు ఇవ్వాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది పౌల్ట్రీ వ్యాపారానికి లాభదాయకమైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల బ్రాయిలర్ కోళ్లన్నింటికీ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మకూడదని వివరించారు.

35
మరి బ్రాయిలర్ కోళ్లు ఇంత వేగంగా బరువు ఎలా పెరుగుతాయి.?
Image Credit : Gemini AI

మరి బ్రాయిలర్ కోళ్లు ఇంత వేగంగా బరువు ఎలా పెరుగుతాయి.?

బ్రాయిలర్ కోళ్లు తక్కువ సమయంలోనే పెద్దవిగా మారడానికి ప్రధాన కారణం వాటి జన్యుపరమైన అభివృద్ధి అని ఉదయ్‌సింగ్ బాయాస్ తెలిపారు. మంచి లక్షణాలున్న మగ, ఆడ కోళ్ల నుంచి ఎంపిక చేసిన జన్యు లక్షణాలను అభివృద్ధి చేయడం ద్వారా వేగంగా పెరిగే కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. దీనికి తోడు వాటి ఎదుగుదలకు అనుగుణంగా సరైన పోషకాలు కలిగిన ఫీడ్‌ను అందిస్తారు. జన్యుపరమైన లక్షణాలు, సమతుల్యమైన ఆహారం వంటి అంశాలు కోళ్లు వేగంగా బరువు పెరగడానికి దోహదపడతాయి. కాబట్టి కోళ్లు త్వరగా పెద్దవుతున్నాయంటే వాటికి తప్పనిసరిగా హార్మోన్లు లేదా స్టెరాయిడ్లు ఇస్తున్నారని అర్థం కాదని ఆయన వివరించారు.

45
కోళ్లకు యాంటీబయాటిక్స్ ఇస్తారా.? వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు.?
Image Credit : Gemini AI

కోళ్లకు యాంటీబయాటిక్స్ ఇస్తారా.? వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు.?

బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వినియోగంపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. దీనిపై ఉదయ్‌సింగ్ బాయాస్ మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్‌లను పశుసంవర్ధక శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. అధికారులు అవసరాన్ని బట్టి కోళ్లు, వాటికి అందించే ఫీడ్, నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ వంటి పదార్థాల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, ప్రభుత్వ అనుమతుల అంశాలు ఈ పర్యవేక్షణలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ వివరాల ఆధారంగా ప్రతి ఫామ్‌లోనూ ఎలాంటి ఉల్లంఘనలు జరగవని నిర్ధారించలేం. కోళ్ల పెంపకంలో నిబంధనలు పాటించడం, అవసరమైన పరీక్షలు నిర్వహించడం, ఆహార భద్రతా ప్రమాణాలను అనుసరించడం ఎంతో ముఖ్యం.

55
బ్రాయిలర్ చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా.?
Image Credit : Gemini AI

బ్రాయిలర్ చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమా.?

బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని జరిగే ప్రచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని భయపడాల్సిన అవసరం లేదని ఈ చర్చ ద్వారా వివరించారు. అయితే చికెన్ నాణ్యత, పెంపకంలో పాటించే పద్ధతులు, నిల్వ, వంట చేసే విధానం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చికెన్‌ను చర్మంతో తినడం, ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయడం, అధికంగా మసాలాలు ఉపయోగించడం వంటి అలవాట్లు ఆహారాన్ని తక్కువ ఆరోగ్యకరంగా మార్చవచ్చు.

మరోవైపు చికెన్ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందించే మంచి ఆహార వనరు. అందువల్ల శుభ్రమైన, సురక్షితమైన చికెన్‌ను ఎంచుకొని, తగిన విధంగా ఉడికించి, సమతుల్యమైన ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతారని లేదా క్యాన్సర్ వస్తుందని ఈ వివరాల ఆధారంగా నిర్ధారించలేం. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిరాధారమైన ప్రచారాన్ని నమ్మకుండా, సరైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.

డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్, పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్‌సింగ్ బాయాస్‌ ల మధ్య జరిగిన పూర్తి సంభాషణకు సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Beautiful Villages In India : దేశంలోనే అత్యంత అందమైన 5 గ్రామాలు ఇవే
Recommended image2
Jeans: జీన్స్ ప్యాంటుకు జేబుల దగ్గర ఈ చిన్న బటన్స్ ఎందుకుంటాయో తెలుసా?
Recommended image3
సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఎందుకు అవమానించారు? ఆనాడు బేగంపేట ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
Related Stories
Recommended image1
ఐర‌న్ చేసేప్పుడు దుస్తుల‌పై నీళ్లు ఎందుకు చ‌ల్లుతారు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Recommended image2
Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved