MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో

Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో

Kitchen Gadgets: కుక్కర్లు, కళాయిలు, ప్యాన్లు వంటి పాత్రలకు హ్యాండిల్స్ ఉంటాయి. లేని వాటి కోసం ప‌ట్క‌ర్ల‌ను ఉప‌యోగిస్తుంటాం. అయితే మారి కాలంతో పాటు ఇవి కూడా స్మార్ట్‌గా మారాయి. ఇలాంటి ఒక స్మార్ట్ ప్రొడ‌క్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Oct 11 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అవసరమైనప్పుడు హ్యాండిల్ అమర్చుకోవచ్చు
Image Credit : Amazon.in

అవసరమైనప్పుడు హ్యాండిల్ అమర్చుకోవచ్చు

ఈకామ‌ర్స్ సైట్ అమెజాన్‌లో FEBZONA డిటాచబుల్ పాట్ హ్యాండిల్ పేరుతో ఈ ప్రొడ‌క్ట్ అందుబాటులో ఉంది. దీని అస‌లు ధ‌ర రూ. 1799 కాగా ప్ర‌స్తుతం 65 శాతం డిస్కౌంట్‌తో రూ. 629కి ల‌భిస్తోంది. ఈ ప్రొడ‌క్ట్‌ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని పాత్రకు అవసరమైనప్పుడు మాత్రమే అమర్చుకోవచ్చు. వంట చేసేటప్పుడు లేదా పాత్రను ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చేటప్పుడు హ్యాండిల్ ఉపయోగపడుతుంది. పని పూర్తయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. దీనివల్ల ప్రతి పాత్రకు ప్రత్యేకంగా హ్యాండిల్ ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే ఈ హ్యాండిల్‌ను ఉపయోగించే ముందు పాత్ర అంచులకు సరిగ్గా సరిపోతుందో లేదో పరిశీలించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంటగదిలో స్థలం ఆదా
Image Credit : Amazon.in

వంటగదిలో స్థలం ఆదా

చిన్న వంటగదుల్లో పాత్రలను సర్దుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. హ్యాండిల్స్ కారణంగా పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టడానికి ఇబ్బంది కలగవచ్చు. ఈ డిటాచబుల్ హ్యాండిల్‌ను తొలగించిన తర్వాత పాత్రలను సులభంగా పేర్చుకోవచ్చు. హ్యాండిల్స్ తొలగించి సర్దుకోవడం ద్వారా 70 శాతం వరకు ఎక్కువ స్థలాన్ని ఆదా చేయవచ్చ‌ని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: మ‌నిషి కంటే వేగంగా ప‌రిగెత్తే పాము.. దీని విషం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా.?

35
గట్టి పట్టుతో సౌకర్యవంతమైన ఉపయోగం
Image Credit : Amazon.in

గట్టి పట్టుతో సౌకర్యవంతమైన ఉపయోగం

ఈ హ్యాండిల్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్ పదార్థాలను ఉపయోగించారు. చేతికి సౌకర్యంగా ఉండేలా వంపుతో కూడిన ఆకృతిని రూపొందించారు. హ్యాండిల్‌పై ఉన్న గీతలతో కూడిన భాగం చేతికి పట్టును అందించడంలో సహాయపడుతుంది. అలాగే పాత్రకు అమర్చినప్పుడు గట్టిగా బిగుసుకునేలా లాకింగ్ వ్యవస్థను అందించారు. అయితే ఉప‌యోగించే ముందు పాత్ర బరువుకు ఈ హ్యాండిల్ సరిపోతుందో కూడా నిర్ధారించుకోవాలి.

45
శుభ్రం చేయడం, భద్రపరచడం సులభం
Image Credit : Amazon.in

శుభ్రం చేయడం, భద్రపరచడం సులభం

వంట పూర్తయిన తర్వాత హ్యాండిల్‌ను తొలగించి విడిగా భద్రపరచుకోవచ్చు. దీనివల్ల పాత్రలను అల్మారాల్లో, క్యాబినెట్లలో సర్దుకోవడం సులభమవుతుంది. హ్యాండిల్ తొలగించగలిగే విధంగా ఉండటంతో శుభ్రం చేసుకోవడం కూడా సౌకర్యంగా ఉంటుంది. దీని పొడవు 18.2 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు. చిన్న ఇళ్లలో నివసించేవారికి, తక్కువ స్థలంలో ఎక్కువ పాత్రలను సర్దుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై క‌నిపించే రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండ‌వో తెలుసా.?

55
అన్ని పాత్రలకు సరిపోతుందా?
Image Credit : Amazon.in

అన్ని పాత్రలకు సరిపోతుందా?

ఈ హ్యాండిల్‌ను నిలువుగా ఉండే అంచులు కలిగిన కొన్ని వంట పాత్రలకు అమర్చుకునేలా రూపొందించారు. అయితే ప్రతి కుక్కర్, పాన్ లేదా కడాయికి ఇది సరిపోతుందని చెప్పలేం. కొనుగోలు చేసే ముందు పాత్ర అంచుల ఆకృతి, మందం, బరువు వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే వేడి పాత్ర‌ల‌ను ఎత్తేప్పుడు జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
Recommended image2
Jio AI Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో UPI పేమెంట్స్ చేయొచ్చు.. జియో నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్
Recommended image3
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Related Stories
Recommended image1
Snake: మ‌నిషి కంటే వేగంగా ప‌రిగెత్తే పాము.. దీని విషం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా.?
Recommended image2
Indian Railway: రైలు పట్టాలపై క‌నిపించే రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండ‌వో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved