MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?

Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?

Indian IT jobs Australia vs Switzerland: ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లకు వెళ్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో ఐటీ ఉద్యోగాలు, జీతాలు, పీఆర్ మార్గాలు, ఖర్చులు ఎలా ఉన్నాయి? భారతీయులకు ఏ దేశం బెస్ట్? అనే వివరాలు తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మనోళ్లు అక్కడికే ఎందుకు క్యూ కడుతున్నారు? ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ రియల్ కథ ఇదే
Image Credit : Chatgpt

మనోళ్లు అక్కడికే ఎందుకు క్యూ కడుతున్నారు? ఆస్ట్రేలియా - స్విట్జర్లాండ్ రియల్ కథ ఇదే

ఇటీవల విడుదలైన ‘గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2026’ జాబితా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత అనుకూలమైన టాప్ 7 నగరాల జాబితాలో ఆస్ట్రేలియా నుంచి మెల్‌బోర్న్ (3వ స్థానం), సిడ్నీ (4వ స్థానం) చోటు సాధించాయి. అలాగే స్విట్జర్లాండ్ నుంచి జూరిచ్ (5వ స్థానం), జెనీవా (6వ స్థానం) నిలిచాయి.

దీంతో మన భారతీయ ఐటీ ఉద్యోగులు, ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలలో ఒకటే ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. కెరీర్‌లో గ్రోత్ సాధించడానికి, మంచి జీవనశైలిని అనుభవించడానికి ఈ రెండింటిలో ఏ దేశం బెస్ట్? జీతాలు, వీసా రూల్స్, నెలకు అయ్యే ఖర్చులు, భాష వంటి ప్రతీ అంశాన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆఫర్లు ఓకే.. కానీ జాబ్స్ దొరకడం ఎక్కడ ఈజీ?
Image Credit : Gemini

ఆఫర్లు ఓకే.. కానీ జాబ్స్ దొరకడం ఎక్కడ ఈజీ?

స్విట్జర్లాండ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మైండ్ బ్లాక్ అయ్యే భారీ జీతాలు. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, రీసెర్చ్ రంగాల్లో ఉండే టాలెంటెడ్ ప్రొఫెషనల్స్‌కి ఇక్కడ లభించే పే-ప్యాకేజీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడో చిన్న చిక్కు ఉంది. స్విట్జర్లాండ్‌లో స్థానిక ఐరోపా సమాఖ్య పౌరులకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. నాన్-ఈయూ పౌరులైన భారతీయులకు కంపెనీ వర్క్ వీసా లేదా స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అనేది కాస్త కష్టమైన పని.

మరోవైపు ఆస్ట్రేలియా పరిస్థితి వేరు. ఇక్కడ ఐటీ, సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, హెల్త్‌కేర్, ఇంజినీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు స్కిల్డ్ మైగ్రేషన్ ప్రక్రియ ద్వారా సులభంగా ఉద్యోగాలు సాధించి అక్కడే స్థిరపడే వెసులుబాటు స్పష్టంగా లభిస్తుంది.

జీతం పరంగా చూస్తే స్విట్జర్లాండ్ టాప్. కానీ జాబ్ గ్యారెంటీ, ఈజీ స్పాన్సర్‌షిప్ కావాలంటే మాత్రం ఆస్ట్రేలియానే ముందుంటుంది.

Related Articles

Related image1
Udhayanidhi Stalin: తంజావూర్ సభలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
36
జీతాలు వర్సెస్ జీవన వ్యయం: సేవింగ్స్ ఎక్కడ ఎక్కువ?
Image Credit : Gemini

జీతాలు వర్సెస్ జీవన వ్యయం: సేవింగ్స్ ఎక్కడ ఎక్కువ?

స్విట్జర్లాండ్‌లో జీతాలు ఎంత భారీగా ఉంటాయో, అక్కడ రోజువారీ ఖర్చులు కూడా అంతే రేంజ్‌లో ఉంటాయి. ఇళ్ల అద్దెలు, హెల్త్ ఇన్సూరెన్స్, నిత్యావసరాల ధరలు చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ఇన్కమ్ టాక్స్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రతీ నెలా మంచి మొత్తాన్ని పొదుపు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. స్విట్జర్లాండ్‌తో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం సుమారు 25% నుంచి 30% వరకు తక్కువగా ఉంటుంది. గ్రోసరీస్, రెస్టారెంట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు నార్మల్‌గానే అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇక్కడ పన్నుల శాతం (కాస్త ఎక్కువగా ఉంటుంది.

ప్రతీ నెలా తక్కువ ఖర్చుతో ప్రశాంతంగా బతకాలంటే ఆస్ట్రేలియా బెటర్. భారీగా డబ్బు పొదుపు చేయడమే మీ టార్గెట్ అయితే స్విట్జర్లాండ్ అనుకూలం.

46
స్టూడెంట్స్ అండ్ పీఆర్: భవిష్యత్తు ఎక్కడ భరోసా?
Image Credit : Chatgpt

స్టూడెంట్స్ అండ్ పీఆర్: భవిష్యత్తు ఎక్కడ భరోసా?

భారతీయ విద్యార్థులకు ఎప్పటి నుంచో ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు పోస్ట్-స్టడీ వర్క్ వీసా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ పాయింట్ల ఆధారిత పీఆర్ సిస్టమ్ ఉండటం వల్ల చదువుకున్న దేశంలోనే పీఆర్ సాధించి స్థిరపడటం చాలా ఈజీ.

స్విట్జర్లాండ్‌లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వరల్డ్ క్లాస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాన్-ఈయూ విద్యార్థులకు జాబ్ పర్మిట్ లేదా పీఆర్ రావడం చాలా కష్టమైన ప్రాసెస్.

విదేశాల్లో చదువుకుని, అక్కడే పీఆర్ తెచ్చుకుని స్థిరపడాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఆస్ట్రేలియానే బెస్ట్ ఛాయిస్.

56
భాష, కల్చర్: మనోళ్లకు అడ్జస్ట్ అవ్వడం ఎక్కడ తేలిక?
Image Credit : Getty

భాష, కల్చర్: మనోళ్లకు అడ్జస్ట్ అవ్వడం ఎక్కడ తేలిక?

ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ ప్రధాన భాష కావడం వల్ల భారతీయులకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇబ్బందులు ఎదురవువు. పైగా అక్కడ ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో భారతీయ కమ్యూనిటీ ఉంది. ఇండియన్ రెస్టారెంట్లు, సాంస్కృతిక సంఘాలు, మన పండుగ వాతావరణం ప్రతీచోటా కనిపిస్తుంది.

స్విట్జర్లాండ్‌లో మాత్రం జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు మాట్లాడతారు. ఆఫీసుల్లో ఇంగ్లీష్ నడిచినా, బయట నిత్య జీవితంలో అక్కడ ఉండే స్థానిక భాషలు రాకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా, మన సంస్కృతికి దగ్గరగా ఉంటూ త్వరగా కలసిపోవడానికి ఆస్ట్రేలియానే చాలా అనుకూలం.

66
లైఫ్‌స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్: ఎవరి మార్క్ ఏంటి?
Image Credit : Getty

లైఫ్‌స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్: ఎవరి మార్క్ ఏంటి?

స్విట్జర్లాండ్‌లోని జూరిచ్, జెనీవా నగరాలు అద్భుతమైన ఆల్ప్స్ పర్వత అందాలు, ప్యూర్ ఎయిర్, అత్యంత తక్కువ నేరాల రేటు, డిసిప్లిన్ ఉన్న సమాజానికి ప్రసిద్ధి చెందాయి. రిచ్ అండ్ లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకునే వారికి ఇది డ్రీమ్ లొకేషన్.

ఇక ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలు బ్యూటిఫుల్ బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, నైట్ లైఫ్, స్పోర్ట్స్ కల్చర్, మల్టీ-కల్చరల్ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Udhayanidhi Stalin: తంజావూర్ సభలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved