MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Udhayanidhi Stalin: తంజావూర్ సభలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

Udhayanidhi Stalin: తంజావూర్ సభలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

Udhayanidhi Stalin: నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. తంజావూర్ సభలో ఏం జరిగింది? ఎందుకు అరెస్టు చేశారు? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
త్రిష పై కామెంట్స్ రచ్చ.. ఉదయనిధి అరెస్ట్‌తో తమిళనాడు పొలిటికల్ హీట్
Image Credit : ANI

త్రిష పై కామెంట్స్ రచ్చ.. ఉదయనిధి అరెస్ట్‌తో తమిళనాడు పొలిటికల్ హీట్

తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చెన్నై నీలాంగరై ఇంటి వద్ద ఉద్రిక్తత
Image Credit : ANI

చెన్నై నీలాంగరై ఇంటి వద్ద ఉద్రిక్తత

చెన్నైలోని నీలాంగరై ప్రాంతంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ నివాసానికి మంగళవారం ఉదయాన్నే తంజావూరు ఈస్ట్ పోలీస్ బృందం, చెన్నై పోలీసులతో కలిసి చేరుకుంది. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకునే సమయంలో అక్కడికి పెద్ద సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయనిధి భార్య కిృతిక ఉదయనిధి, సీనియర్ డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు ఉదయనిధిని పోలీస్ వాహనంలోకి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆయన నవ్వుతూ కనిపిస్తూ, ఈ అరెస్ట్ ఒక జొక్ అని, దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటానని మీడియాకు చెప్పారు.

Related Articles

Related image1
Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
36
తంజావూరు సభలో అసలు ఏం జరిగింది?
Image Credit : Asianet News

తంజావూరు సభలో అసలు ఏం జరిగింది?

కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో డీఎంకే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కావేరీ నీటి బొట్టు కూడా తమిళనాడుకు రాకపోయినా సీఎం స్పందించడం లేదని మండిపడ్డారు. ఆ సమయంలో జనాలు 'త్రిష.. త్రిష' అని నినాదాలు చేశారు. దానికి స్పందించిన ఉదయనిధి, డబుల్ మీనింగ్ వచ్చేలా కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి నటి త్రిషను అవమానించేలా ఉన్నాయని టీవీకే (TVK) పార్టీ, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

46
ఉదయనిధి స్టాలిన్ పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు?
Image Credit : ANI

ఉదయనిధి స్టాలిన్ పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు?

ఈ వ్యవహారంలో టీవీకే మహిళా విభాగం నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంజావూరు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయనిధిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 196, 192, 352, 79, 296(b), 61, 351(2)లతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ 4, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు బుక్ చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని టీవీకే డిమాండ్ చేసింది.

56
ఇది రాజకీయ కక్షతోనే.. డీఎంకే వర్గాల ఫైర్
Image Credit : Trish/ Instagram

ఇది రాజకీయ కక్షతోనే.. డీఎంకే వర్గాల ఫైర్

ఉదయనిధి అరెస్ట్‌ను డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం కక్షసాధింపు రాజకీయాల్లో భాగమేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. సభలో ఉదయనిధి కేవలం విజయ్ వైఫల్యాలను ఎత్తిచూపారని, త్రిష పేరును ఆయన అసలు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రిని విమర్శించినందుకు కాదు, ఒక మహిళను బహిరంగంగా అవమానించినందుకే అరెస్ట్ చేశారని టీవీకే నేత అమెరికై నారాయణన్ అన్నారు.

At what was projected as a farmers protest, Udhayanidhi Stalin made an unnecessary, vulgar and double meaning comment about actress Trisha in front of thousands of men. pic.twitter.com/EvqkGrHKie

— Actor Vijay Team (@ActorVijayTeam) August 3, 2026

66
ఉదయనిధికి రిమాండ్.. హైకోర్టులో పిటిషన్
Image Credit : Asianet News

ఉదయనిధికి రిమాండ్.. హైకోర్టులో పిటిషన్

అరెస్ట్ అనంతరం ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు తంజావూరుకు తరలిస్తున్నారు. ఇంకోవైపు, ఈ చట్టవిరుద్ధ అరెస్ట్‌ను సవాలు చేస్తూ, తక్షణ ఉపశమనం కోసం ఉదయనిధి తరఫు లాయర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం విచారణ జరపనుంది.

#WATCH | DMK leader and LoP Udhayanidhi Stalin detained by Police from his Chennai residence, following an FIR against him over his alleged defamatory remarks against actor Trisha and CM Vijay. Slogans directed at actor Trisha were raised at his rally yesterday. pic.twitter.com/JUk7cpaTdG

— ANI (@ANI) August 4, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాజకీయాలు
త్రిష
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Liquor Ban: ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ మందు బ్రాండ్లపై బ్యాన్.. అసలు కారణం ఇదే
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved