MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational Folk Song : బిజీబిజీగా గడిపే ఓ ఉద్యోగి, వ్యాపారి.. ఈ జానపదం విన్నారో జీవితం అంటే ఏంటో తెలుస్తుంది..!

Motivational Folk Song : బిజీబిజీగా గడిపే ఓ ఉద్యోగి, వ్యాపారి.. ఈ జానపదం విన్నారో జీవితం అంటే ఏంటో తెలుస్తుంది..!

ఈ బిజీ లైఫ్ స్టైల్ తో మనిషి ఏం కోల్పోతున్నాడో తెలియజేసేలా ఓ అద్భుతమైన జానపద పాట రాశారు ప్రముఖ తెలంగాణ కవి గోరేటి వెంకన్న. ఓ పిట్ట బ్రతుకును వివరిస్తూ ‘’ఓ పుల్లా.. ఓ పుడకా'' అంటూ సాగే ఈ పాట జీవితసత్యాన్ని తెలియజేస్తుంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 04 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇదికదా అసలుసిసలైన జానపదం..
Image Credit : Gemini AI

ఇదికదా అసలుసిసలైన జానపదం..

Goreti Venkanna Folk Song : ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ కోసం, డబ్బుల కోసం డబుల్ మీనింగ్ జానపద పాటలు వస్తున్నాయిగానీ ఒకప్పుడు జీవితాన్ని కళ్లముందు ఉంచే పాటలు ఉండేవి. ఇందుకు ఉదాహరణ తెలంగాణ బతుకమ్మ పాటలు... పల్లె బ్రతుకులను కళ్లకుగడుతూ, కుటుంబ బంధాలు బాంధవ్యాలను తెలియజేసేలా ఈ జానపదాలు ఉండేవి. ఇలా మనిషి జీవితానికి అర్థం, పరమార్థం తెలిపే అనేక పాటలు ఉన్నాయి... వాటిలో ప్రసిద్ద కవి గోరేటి వెంకన్న రాసిన ''ఓ పుల్లా.. ఓ పుడకా'' అంటూ సాగే సాంగ్ టాప్ లో ఉంటుంది.

'గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది'' అంటూ మంచి ఊపున్న సాంగ్స్ రాసిన వెంకన్నే పిట్ట జీవితం ఎంత హాయిగా ఉంటుందో వివరిస్తూ తత్వగీతం కూడా రాశారు. ఈ పాట ద్వారా మనిషి డబ్బుల మాయలో పడి జీవితంలో ఏం కోల్పోతున్నాడో వివరించారు. ఎలాంటి ఆశలు, తాపత్రయాలు లేకుండా స్వేచ్ఛగా బతికే పిట్టల జీవన విధానం గురించి ఈ జానపదం తెలియజేస్తుంది. ఇలా మనిషి కూడా పిట్టలా ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోవాలని గోరెటి వెంకన్న ఈ పాట ద్వారా జీవిత సత్యం చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
''ఓ పుల్లా... ఓ పుడకా..'' పాటలో ఇంత అర్థం దాగుందా?
Image Credit : AI Image

''ఓ పుల్లా... ఓ పుడకా..'' పాటలో ఇంత అర్థం దాగుందా?

పల్లవి 

ఓ పుల్లా... ఓ పుడకా…

ఎండు గడ్డి… సిన్న కొమ్మా.. సిట్టి గూడు..

పిట్ట బతుకే ఎంతో హాయి.. ''ఓ పుల్లా.. ఓ పుడకా''

సిగురుటాకు... వగరుపూత..

లేత పిందా.. తీపి పండు..

నోటికంది సింతా లేక కునుకుదీసే పక్షి బతుకే సౌఖ్యమోయి...

అర్థం  

ఈ ప్రకృతిలో లభించే పుల్లలు, పుడకలు ఏరుకునివచ్చి చిన్న చెట్టుకొమ్మపై పిట్ట గూడు కట్టుకుంటుంది. అలాగే చెట్టు ఆకులు, పూత, లేత తియ్యని పండ్లు తింటూ అది జీవిస్తుంది. ఇలా ఏ చీకూచింతా లేకుండా హాయిగా నిద్రపోయే ఆ పిట్ట బ్రతుకు ఎంతో గొప్పది. అంటే మనిషి బిజీ లైఫ్ లో ఇలాంటి జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు... కాబట్టి పిట్టలా ఉన్నదాంట్లో హాయిగా జీవించడం నేర్చుకోవాలని అని ఈ పల్లవి ద్వారా గోరేటి వెంకన్న చెప్పదల్చుకున్నారు.

Related Articles

Related image1
Folk Song : నాగదుర్గ కంటే ముందే ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్‌ ను షేక్ చేసిందిగా, మూడు పాటలతో 35 కోట్ల వ్యూసా.! ఎవరీ శిరీష?
Related image2
Bonalu Folk Song : మంగ్లీలోని మాస్ యాంగిల్ బైటపెట్టింది ఈ బోనాల సాంగే.. 92 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ కే పూనకాలు
35
మనిషిలా ఈర్ష్యా ద్వేషాలు లేనిజీవి పిట్ట
Image Credit : chat GPT

మనిషిలా ఈర్ష్యా ద్వేషాలు లేనిజీవి పిట్ట

చరణం

పూటకుంటే అంతె చాలు..

రేపు ఎట్లనే ధ్యాస లేదు..

దాసుకునెటీ గుణము లేదు..

లోభితనమే ఎరుకలేదు..

ఈ లోకమెల్లా తరచి చూసినా…

నరులకున్న ఈర్ష్య అనువంత సైతం పిట్టకు లేదు... '' ఓ పుల్ల ఓ పుడకా''

అర్థం 

పిట్టలకు ఈ పూటకు తినడానికి ఉంటే చాలు... రేపు ఎలా అనే ఆలోచన ఉండదు. మనిషిలా తాను, తన పిల్లలు జీవితాంతం కూర్చుని తినేందుకు దాచుకునే గుణం పిట్టలకు ఉండదు... పిసినారితనం అస్సలు ఉండదు. ఈ లోకం మొత్తంలో చూసినా మనిషిలా ఈర్ష్యా, ద్వేషాలు పిట్టల్లో అస్సలు కనిపించవు. మనిషి కూడా ఇలాగే బ్రతకడం నేర్చుకోవాలి... ఈర్ష్యా, ద్వేషాన్ని వీడి పిట్టలా బ్రతకాలని గోరేటి వెంకన్న ఈ చరణం ద్వారా చెప్పారు.

45
ఆస్తిపాస్తులపై మోజు వద్దు..
Image Credit : Getty

ఆస్తిపాస్తులపై మోజు వద్దు..

చరణం

చీకటైతే ఒదిగిపోయి...

వేకువానే నిదురలేచి..

గాలిలోన ఈదుకుంటా..

గగనమంచున తేలుకుంటా...

కొండకోనల దాటుకుంటా...

కొమ్మరెమ్మన వాలుకుంటా..

ఎల్లవింతలూ కళ్లజూసినా..

ఏది తనకూ సొంతమనదే...

తానల్లుకున్నా గూటిలకొచ్చి

పున్నమీ వెన్నెలనే గాంచును..

తానల్లిన ఆ గూటిని కూడా పిల్లలెదినంకా తాను..

వల్లనాని ఎల్లిపోతది... ''ఓ పుల్లా ఓ పుడకా''

అర్థం 

చీకటి కాగానే పిట్ట గూటికి చేరుకుంటుంది... తెల్లవారుజామునే నిద్ర లేస్తుంది. గాలిలో ఎగురుకుంటూ ఆకాశాన్ని తాకుతుంది... కొండకోనలను దాటుకుంటూ కొమ్మరెమ్మలపై వాలుతుంది. ఇలా ఈ లోకంలో ఉండే వింతలన్నీ చూసినా ఏదీ తనకు సొంతం అనదు. తాను అల్లుకున్న గూటిలో వెన్నెలను చూసుకుంటూ ఆనందిస్తుంది. చివరకు పిల్లల కోసమే తాను అల్లుకున్న గూటిలో ఉంటుంది... వాళ్లు ఎదిగాక ఆ గూటిని కూడా వదిలేస్తుంది.

మనిషి ఇలా కాదు.. ఇళ్లూ, భూమి, డబ్బులు, ఆస్తులు అంటూ జీవితాంతం ఏదో ఒకదానికోసం తాపత్రయపడుతూనే ఉంటాడు. ఇది కాదు జీవితమంటే... ఉన్నదాంతో హాయిగా జీవించడం. అవసరం లేదనుకుంటనే దేన్నయినా వదిలేయగలడం. అప్పుడే పిట్టలా ప్రశాంతంగా జీవించగలం అని వెంకన్న చెబుతున్నారు.

55
మనిషి ఊరూ పేరు కోసం ఆరాటం వదలాలి
Image Credit : AI

మనిషి ఊరూ పేరు కోసం ఆరాటం వదలాలి

చరణం

రామసిలకా.. గోరువంకా..

పాలపిట్టా... తీతువమ్మా..

పావురాయి.. తెల్లకొంగా..

నరులు పెట్టిన పేర్లు తప్పా... తమకు ఊరుపేరే లేదు…

ఆ పేరు కోసం ఉనికి కోసము...

ఈసమంత ఆరాటం లేదు..

సదువు నేర్పే సాలె లేదు..

బోధ చేసే గురువు లేడు..

వణుకు పుడితే ఉడుకు లేదు...

రోగమొస్తే మందూ లేదు..

అన్నీ ఉన్నాయన్నా నరుడు..

ఆశ లోభం వెంటాడంగా..

ఏమిలేని పిట్ట చెంతకు..

చేరి జాతకమడుగూతుండు…

అర్థం

 అసలు పక్షులకు ఊరూ పేరు ఉండదు... ఇందుకోసం అవి తాపత్రయ పడవు. రామచిలక, గోరువంక, పావురం, తెల్లకొంగ, తీతువు... ఇవన్నీ పక్షులకు మనిషి పెట్టిన పేర్లే. వాటికి పాఠశాల ఉండదు... గురువు ఉండడు. వర్షంలో తడిసి వణుకుతుంది... రోగం వస్తే మందులు ఉండవు. కానీ ఇవన్ని ఉన్న మనిషి అత్యాశతో ఏమీలేని పిట్టవద్దకు జాతకం చెప్పమని వెళతాడు అంటూ అద్భుతమైన మాటలతో పాటను ముగించాడు కవి గోరేటి వెంకన్న.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery of Hanging Pillar: సైన్స్‌కే సవాల్.. లేపాక్షి ఆలయంలో గాలిలో వేలాడే ఈ స్తంభం సీక్రెట్ ఇదే
Recommended image2
Liquor Safety Check: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలి? FSSAI చెప్పిన ఈ 5 సింపుల్ ట్రిక్స్ మీకోసం
Recommended image3
Home Loan : హోమ్ లోన్ కు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా?
Related Stories
Recommended image1
Folk Song : నాగదుర్గ కంటే ముందే ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్‌ ను షేక్ చేసిందిగా, మూడు పాటలతో 35 కోట్ల వ్యూసా.! ఎవరీ శిరీష?
Recommended image2
Bonalu Folk Song : మంగ్లీలోని మాస్ యాంగిల్ బైటపెట్టింది ఈ బోనాల సాంగే.. 92 మిలియన్స్ వ్యూస్ తో యూట్యూబ్ కే పూనకాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved