MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Hanging Pillar Temple: సైన్స్‌కే సవాల్.. ఈ ఆలయంలో గాలిలో వేలాడే ఈ స్తంభం సీక్రెట్ ఏంటో తెలుసా?

Hanging Pillar Temple: సైన్స్‌కే సవాల్.. ఈ ఆలయంలో గాలిలో వేలాడే ఈ స్తంభం సీక్రెట్ ఏంటో తెలుసా?

Hanging Pillar Temple: పునాది లేకుండా గాల్లో తేలుతున్న స్తంభం ఉన్న ఆలయం ఉందని మీకు తెలుసా? లేపాక్షి వీరభద్రాలయంలో గాలిలో వేలాడే స్తంభం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? విజయనగర రాజుల కాలం అద్భుత శిల్పకళా రహస్యాలు, స్థల పురాణం విశేషాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2026, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సైన్స్‌కు అందని సాంకేతికత.. ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుత శైవక్షేత్రం
Image Credit : Chatgpt

సైన్స్‌కు అందని సాంకేతికత.. ఆంధ్రప్రదేశ్‌లోని అద్భుత శైవక్షేత్రం

మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ కొన్ని కట్టడాలు చూస్తే 'అసలు ఆ కాలంలోనే ఇలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యమైంది?' అనే ప్రశ్నలు వస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ కట్టడమే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. శిల్పుల అద్భుత సృష్టికి, విజయనగర రాజుల శిల్పకళా వైభవానికి ఈ గుడి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా మన భారతీయుల పురాతన సంస్కృతి, అరుదైన ఫ్రెస్కో వర్ణచిత్రాలు, రామాయణ, మహాభారత ఘట్టాలు కనిపిస్తాయి. ఈ అసాధారణమైన శిల్పకళా నైపుణ్యాల వల్లే లేపాక్షి ఆలయం యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో స్థానం సంపాదించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గాలిలో వేలాడే ఆ స్తంభం వెనుక ఉన్న రహస్యమేంటి?
Image Credit : our own

గాలిలో వేలాడే ఆ స్తంభం వెనుక ఉన్న రహస్యమేంటి?

లేపాక్షి ఆలయంలో ముఖ్యంగా నాట్యమండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. కానీ అందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఆగ్నేయ దిశలో ఉండే ఒకే ఒక్క స్తంభం అసలు నేలకు ఆనదు.. అవును, మీరు చదివింది నిజమే. ఈ స్తంభానికి, నేలకు మధ్య సుమారు పావు అంగుళం ఖాళీ ఉంటుంది.

అంటే ఈ భారీ రాతి స్తంభం గాలిలో తేలుతూ, పైకప్పు నుంచి కిందకు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే భక్తులు, టూరిస్టులు ఈ వింతను స్వయంగా పరీక్షించడానికి స్తంభం కింద నుంచి ఒక పలుచని గుడ్డను లేదా క్లాత్‌ను ఒకవైపు నుంచి ఇంకోవైపుకు సులువుగా తీస్తారు. గురుత్వాకర్షణ సిద్ధాంతానికే సవాల్ విసురుతున్న ఈ పిల్లర్ నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి.

Related Articles

Related image1
Snake Facts: నాగుపాము vs తాచుపాము.. అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
బ్రిటీష్ ఇంజనీర్‌కు చుక్కలు చూపించిన విజయనగర శిల్పకళ
Image Credit : Pinterest

బ్రిటీష్ ఇంజనీర్‌కు చుక్కలు చూపించిన విజయనగర శిల్పకళ

స్వాతంత్య్రానికి పూర్వం, అంటే 1903 ప్రాంతంలో హామిల్టన్ అనే ఒక బ్రిటీష్ ఇంజనీర్ ఈ స్తంభం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని అనుకున్నాడు. అసలు ఆధారమే లేకుండా ఒక స్తంభం పైకప్పును ఎలా మోస్తుందో చూద్దామని, దాన్ని బలవంతంగా పక్కకు జరిపి నేలకు ఆనించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఆ స్తంభాన్ని కొద్దిగా కదిలించగానే ఊహించని షాక్ తగిలింది.. ఆ ఒక్క స్తంభం కదలగానే నాట్యమండపంలోని మిగతా 69 స్తంభాల పైభాగాలు కూడా కదిలిపోయాయి.

మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు, భిక్షాటన మూర్తి శిల్పాలున్న స్తంభాలు పైభాగంలో బాగా దగ్గరకు వచ్చేసాయి. మొత్తం మండపమే కూలిపోతుందేమోనన్న భయంతో ఆ ఇంజనీర్ తన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి తగ్గాడు. నాట్యమండప భారాన్ని మొత్తం బ్యాలెన్స్ చేసే కీలకమైన పిల్లర్ అదేనని ఆయన గ్రహించాడు. ఇప్పటికీ ఆ ఇంజనీర్ జరిపిన గుర్తును, కదిలిన స్తంభాల దిశను మనం అక్కడికి వెళ్తే గమనించవచ్చు.

45
భూకంపాలు వచ్చినా తట్టుకునే ప్రాచీన బ్యాలెన్సింగ్ పిల్లర్ టెక్నాలజీ
Image Credit : Getty

భూకంపాలు వచ్చినా తట్టుకునే ప్రాచీన బ్యాలెన్సింగ్ పిల్లర్ టెక్నాలజీ

అసలు నాటి శిల్పులు ఈ స్తంభాన్ని నేలకు ఆనకుండా గాలిలో ఎందుకు ఉంచారు? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? అనే దానికి సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు నిర్మాణంలో ఏర్పడే ప్రకంపనల వల్ల నాట్యమండపం దెబ్బతినకుండా ఉండేందుకు దీన్ని ఒక షాక్ అబ్జార్బర్ లేదా బ్యాలెన్సింగ్ పిల్లర్ లాగా డిజైన్ చేశారు.

ప్రమాదం జరిగినప్పుడు ఈ వేలాడే స్తంభం బరువును సమానంగా పంచుకుని, కిందకు ఆని, మొత్తం కట్టడం కూలిపోకుండా రక్షణ గోడలా నిలబడుతుంది. నాటి కట్టడాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడటం ఎంతటి ఇంజనీరింగ్ అద్భుతమో, లేపాక్షిలోని ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ కూడా అంతే గొప్ప సాంకేతిక విజ్ఞానానికి నిదర్శనం.

55
జటాయువు మోక్షం పొందిన స్థలం: లేపాక్షి స్థల పురాణం.. ఏకశిలా నంది
Image Credit : our own

జటాయువు మోక్షం పొందిన స్థలం: లేపాక్షి స్థల పురాణం.. ఏకశిలా నంది

లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే స్థల పురాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించి ఆకాశ మార్గాన లంకకు తీసుకువెళ్తుండగా, జటాయువు అనే పక్షి రాజు రావణుడిని అడ్డుకుని భీకరంగా పోరాడుతుంది. ఆ పోరాటంలో రెక్కలు తెగి తీవ్రంగా గాయపడిన జటాయువు ఈ ప్రదేశంలోనే కింద పడిపోతుంది. సీతాన్వేషణలో అక్కడకు వచ్చిన శ్రీరాముడు, గాయపడిన జటాయువును చూసి జాలితో "లే.. పక్షి" అని సంబోధించి మోక్షం ప్రసాదించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలా 'లే పక్షి' అనే పదమే కాలక్రమేణా 'లేపాక్షి'గా మారింది.

16వ శతాబ్దంలో విజయనగర రాజుల దగ్గర పనిచేసిన విరుపన్న, వీరన్న అనే సోదరులు ఈ వీరభద్రాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అగస్త్య మహర్షి ఇక్కడ పాపనాశేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని, ఆయనకు ఎదురుగా రఘునాథమూర్తి ఉంటారని ప్రతీతి. ఇక ఆలయానికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఒక చిన్న గుట్టపై చెక్కిన అతిపెద్ద 'ఏకశిలా నంది' విగ్రహం ఠీవీగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉండే ఈ బసవయ్య విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందులలో ఒకటిగా పేరుగాంచింది. అలాగే ఆలయంలో ఉండే ఏడు పడగల భారీ నాగేంద్రుడి శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆధ్యాత్మిక విషయాలు
ప్రయాణం
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Recommended image2
కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?
Recommended image3
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Related Stories
Recommended image1
Snake Facts: నాగుపాము vs తాచుపాము.. అసలు తేడా ఏంటి? ఈ విషయాలు తెలిస్తే ప్రాణాలు దక్కినట్టే !
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved