MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Rice Business: TCS జాబ్‌ను వదిలేసిన యువకుడు.. బియ్యం వ్యాపారంతో ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం

Rice Business: TCS జాబ్‌ను వదిలేసిన యువకుడు.. బియ్యం వ్యాపారంతో ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం

Rice Business: టీసీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి తానే యజమానిగా వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయ్యాడు ఓ యువకుడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వద్దని బియ్యం వ్యాపారం మొదలుపెట్టి ఏడాదికి పాతిక లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 29 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టీసీఎస్ ఉద్యోగం వద్దని
Image Credit : Gemini AI

టీసీఎస్ ఉద్యోగం వద్దని

ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం రావాలని ప్రతి యువకుడు కోరుకుంటాడు. కానీ ఓ యువకుడు మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రముఖ ఐటీ సంస్థ TCSలో ఉద్యోగం వచ్చినా దాన్ని అంగీకరించలేదు. ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో బియ్యం వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట అతని నిర్ణయాన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తిట్టుకున్నారు. మంచి ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం చేయడం సరైన నిర్ణయం కాదని చాలామంది చెప్పారు. అయినా అతడు తన నిర్ణయం మార్చుకోలేదు. రైతుల దగ్గర నుంచి నేరుగా నాణ్యమైన బియ్యం కొనుగోలు చేసి, దాన్ని శుభ్రం చేయించి, ప్యాకింగ్ చేసి తన సొంత బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. మధ్యవర్తులు లేకుండా నేరుగా దుకాణాలకు సరఫరా చేయడంతో రైతులకు మంచి ధర దక్కగా, వినియోగదారులకు కూడా మంచి నాణ్యత గల బియ్యం అందుతోంది. ప్రస్తుతం ఈ యువకుడి విజయగాథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బియ్యం వ్యాపారం ఎలా చేయాలి?
Image Credit : Getty

బియ్యం వ్యాపారం ఎలా చేయాలి?

వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత అతడు ఒక్కో అడుగు జాగ్రత్తగా వేశాడు. రైతులతో నేరుగా సంబంధాలు పెంచుకొని, మంచి నాణ్యత ఉన్న బియ్యాన్నే కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బియ్యాన్ని శుభ్రం చేయించడం, ప్యాకింగ్ చేయించడం, రవాణా చేయించడం వంటి పనులను సక్రమంగా నిర్వహించాడు. కిలో బియ్యాన్ని సుమారు రూ.35కు కొనుగోలు చేసి, ప్యాకింగ్, రవాణా వంటి ఖర్చులతో కలిపి మొత్తం రూ.40 వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత అదే బియ్యాన్ని రిటైల్ దుకాణాలకు కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు సమాచారం. దుకాణాలు వినియోగదారులకు రూ.55 నుంచి రూ.57 మధ్య అమ్ముతున్నాయి. ఇలా ప్రతి కిలోపై సుమారు రూ.10 వరకు లాభం వస్తోందని వైరల్ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం దాదాపు 200 దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నట్లు, నెలకు సుమారు 20 వేల కిలోల బియ్యం అమ్ముతున్నట్లు ఆ పోస్టులో వెల్లడించారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.25 లక్షల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.

Related Articles

Related image1
Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?
Related image2
Indian Currency: చిరగని, నలగని, నీటిలో నానిపోని ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వచ్చే ఏడాదికల్లా మనచేతిలో
33
వైరల్ అవుతున్న స్టోరీ
Image Credit : Getty

వైరల్ అవుతున్న స్టోరీ

అతడి గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఆధారంగా వెలుగులోకి వచ్చాయి. ఈ కథ చాలామందికి స్ఫూర్తినిస్తోంది. ఉద్యోగమే విజయానికి ఒక్కటే మార్గం కాదని, సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, కొత్త ఆలోచన ఉంటే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ ఉదాహరణ చెబుతోంది. ముఖ్యంగా యువత తమకు ఉన్న ఆసక్తి, మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తే కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి విజయగాథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Recommended image3
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Related Stories
Recommended image1
Eye Care: మీ కళ్లకు కళ్లజోడు పెట్టుకుంటే మంచిదా? లేక కాంటాక్ట్ లెన్స్ వాడితే మంచిదా?
Recommended image2
Indian Currency: చిరగని, నలగని, నీటిలో నానిపోని ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వచ్చే ఏడాదికల్లా మనచేతిలో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved