MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కన్ఫ్యూజన్ పెంచేలా విజయ్ దేవరకొండ కామెంట్స్.. వాళ్ళని చూసి నేర్చుకో అంటూ ట్రోలింగ్

కన్ఫ్యూజన్ పెంచేలా విజయ్ దేవరకొండ కామెంట్స్.. వాళ్ళని చూసి నేర్చుకో అంటూ ట్రోలింగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 13 2022, 07:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ గా మారిపోయింది. ఈ సినిమా పరిస్థితి ఇంత ఘోరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. విజయ్ దేవరకొండకి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని మూవీ అవుతుందని అంతా భావించారు. ఇక రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ, చిత్ర యూనిట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

26

సినిమా విడుదలై అందరిని ఆశ్చర్యంలో ముంచుతూ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం కోసమా వీళ్లు ఇంత హడావిడి చేశారు అంటూ ప్రేక్షకులు ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ పై కూడా విమర్శలు వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. 

36

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ అదిరిపోయే బ్లాక్ డ్రెస్ లో మెరిశాడు. ఆ పిక్ ని పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో విజయ్ ' సింగిల్ ప్లేయర్' అంటూ కామెంట్ పెట్టాడు. అసలు దీని అర్థం ఏంటి అంటూ నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విజయ్ ట్వీట్ పై జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. 

46

విజయ్ ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. లైగర్ 2 , జనగణమన నెక్స్ట్ షెడ్యూల్స్ ఎప్పుడు బ్రో అంటూ నెటిజన్లు విజయ్ దేవరకొండని వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలోనే జనగణమన చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ లైగర్ రిజల్ట్ తో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. 

56

ఇకపై తన ఆట తానే ఆడుకోవాలి.. ఎవరి మీద ఆధారపడకూడదు.. అన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాలి అని పరోక్షంగా విజయ్ ఇలా ట్వీట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ.. యష్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలని చూసి నేర్చుకోవాలని చురకలు అంటిస్తునారు. పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ వాళ్ళు మాట్లాడే విధానం, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటుంది. 

66

విజయ్ అభిమానులు మాత్రం అతడికి సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ ఎంత కష్టపడినప్పటికీ లైగర్ చిత్రంతో ఫలితం లేకుండా పోయింది. ఈసారి గట్టిగా కొట్టాలి అని, మంచి సినిమాతో రావాలి అని సూచిస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. సమంత ఈ మూవీలో హీరోయిన్. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Recommended image2
Vijay Divorce: రూ.250 కోట్లు అడిగిన సంగీత.. విజయ్ ఇచ్చేది రూ.35 కోట్లేనా? అసలు నిజమెంత?
Recommended image3
Tollywood Editor: తీవ్ర విషాదం..గుండెపోటుతో టాలీవుడ్ ఎడిటర్ మృతి.. పవన్, రామ్ పోతినేని సినిమాలకు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved