- Home
- Entertainment
- ఎరుపెక్కిన అందాలతో గుండెల్ని పిండేస్తున్న ఐశ్వర్య రాజేశ్.. రెడ్ డ్రెస్ లో మతిపోయేలా పోజులిచ్చిన డస్కీ బ్యూటీ..
ఎరుపెక్కిన అందాలతో గుండెల్ని పిండేస్తున్న ఐశ్వర్య రాజేశ్.. రెడ్ డ్రెస్ లో మతిపోయేలా పోజులిచ్చిన డస్కీ బ్యూటీ..
ట్రెడిషనల్ లుక్ కు పెట్టింది పేరు ఐశ్వర్య రాజేశ్. ఎప్పుడూ ట్రెడిషనల్ గా కనిపించే తమిళ బ్యూటీ ఈ మధ్య కాస్తా ట్రెండీగా మారుతోంది. గ్లామర్ డోస్ ను పెంచుతూ పోతోంది. తాజాగా రెడ్ అవుట్ ఫిట్ లో చేసిన ఫొటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులతో పాటు నెటజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మతిపోయే పోజులతో టెంప్ట్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
కోలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య రాజేశ్ ఒకరు. ఈ బ్యూటీకి తమిళంతో పాటు ఇటు తెలుగు మరియు మలయాళ ప్రేక్షకులతోనూ మంచి పరిచయమే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాల్లోనే ఐశ్వర్య నటించినప్పటికీ తన నటన, గ్లామర్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
మరోవైపు తను గత కొద్ది కాలంగా పలు ఈవెంట్స్, అవార్డ్స్ ఫంక్షన్స్ కు హాజరవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రెండీ వేర్స్ లోనూ మరియు ట్రెడిషనల్ వేర్స్ లోనూ దర్శనమిస్తూ అందరి చూపును ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో ఐశ్వర్య రాజేష్ రెడ్ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. డస్కీ అందానికి, ఫిట్ నెస్ కు తగ్గట్టుగా అవుట్ ఫిట్ ఉండటంతో మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. దానికి తోడు మతిపోయేలా స్టిల్స్ ఇవ్వడంతో అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుంతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే తమిళ చిత్రం ‘సుజ్హల్’ మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హాజరైన ఐశ్వర్యా రాజేశ్ ఇలా ట్రెండీ అవుట్ ఫిట్ లో అందరి చూపును తనవైపు తిప్పుకునేలా చేసింది. బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న ఐశ్వర్య పిక్స్ కు నెటిజన్స్ లైక్స్, కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక గతేడాది ఏకంగా రెండు చిత్రాల్లో మెరిసి అభిమానులను ఫిదా చేసింది ఐశ్వర్య. నేచురల్ స్టార్ నాని సరసన ‘టక్ జగదీష్’ చిత్రంలో నటించి ఆడియెన్స్ తో సూపర్ అనిపించుకుంది. ఆ వెంటనే రిలీజ్ అయిన ‘రిపబ్లిక్’ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సరసన నటించింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తమిళంలోనే నటిస్తోందీ బ్యూటీ.