MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఈవారం థియేటర్ లో అబ్బాయి రామ్ చరణ్.. ఓటీటీలో బాబాయి పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చే..

ఈవారం థియేటర్ లో అబ్బాయి రామ్ చరణ్.. ఓటీటీలో బాబాయి పవన్ కళ్యాణ్.. రచ్చ రచ్చే..

 ఈ వారం సినిమా థియేటర్లు, ఓటీటీలు మోత మోగనున్నాయి. రెండు భారీ  సినిమాలు అటు థియేటర్లను.. ఇటు ఓటీటీని దడదడలాడించబోతున్నాయి.  ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్.. భీమ్లా నాయక్ తో పవర్ స్టార్ రెడీ అవుతున్నారు..

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 21 2022, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

అబ్బాయి రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో థియేటర్లను టార్గెట్ చేస్తే.. ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భీమ్లానాయక్ సందడి చేయబోతున్నారు. అంతే కాదు.. పవర్ స్టార్ తో కలిసి ఓటీటీలో అజిత్ కూడా సై అంటున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈవారం థియేటర్ రిలీజ్ కోసం ఏ సినిమాలు సాహసం చేయలేక పోయాయి. డ్రాగన్ లా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వబోతుండటంతో.. కొండను ఢీకొట్టడానికి ఏ సినిమా సాహసం చేయలేకపోయింది. దాంతో థియేటర్లన్నీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో నిండిపోబోతున్నాయి. సింహం సింగిల్ గా వస్తుంది అన్న మాదిరిగా ట్రిపుల్ ఆర్.. సోలోగా రాజ్యం ఏలబోతుంది. 

39

యావత్ దేశం తో పాటు ప్రపంచ సినిమా ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఈవారమే రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ శుక్రవారం 25 మార్చ్ ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ శేర్ చేసుకుని తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీని టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించారు. 

49

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా బట్ నటించగా అజయ్ దేవగణ్, శ్రీయా శరన్, హాలీవుడ్ స్టార్ ఓలివియో లీడ్ రోల్స్ చేశారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటించారీ సినిమాలో.  కీరవాణి  సంగీతం అందించిన ఈ సినిమా లోనుంచి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. 

59

కరోనా వల్ల డిలే అవుతూ వస్తోన్న ఈసినిమా మూడు సార్లు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆతరువాత ఏపీలో  టికెట్ ధరల విషయం కూడా ట్రిపుల్ ఆర్ ను ఇబ్బంది పెట్టింది. ఇక అన్ని ఇబ్బందులు దాటుకుని రిలీజ్ కు రెడీ అయ్యంది సినిమా. అటు  ఏపీ, తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు వెసులుబాటును కల్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్. 

69

ఇక థియేటర్ లో ట్రిపుల్ ఆర్ కింగ్ లా మారబోతుండగా.. ఓటీటీలో పవర్ స్టార్ కింగ్ అంవ్వబోతున్నారు. పిబ్రవరి 25న రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ భారీ కలెక్షన్స్ తో రచ్చ రచ్చ చేసింది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మాటలు,స్క్రీన్ ప్లే ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమాలో రానా పవర్ స్టార్ తో స్క్రీన్ శేర్ చేసుకున్నారు. 

79

నిత్యా మేనన్.. సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిచిన ఈసినిమా మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈసినిమాను ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతున్న రోజే.. అంటే మార్చ్ 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 

89

ఇక భీమ్లా నాయక్ తో పాటు మరో పెద్ద సినిమా కూడా డిజిటల్ గుమ్మం తొక్కబోతోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై మూవీ కూడా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది. వినోడ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో అజిత్ తో పాటు తెలుగు యంగ్ స్టార్ కార్తికేయ  మెయిన్ విలన్ క్యారెక్టర్ లో నటించారు.  

99

అయితే తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. తెలుగులో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేక పోయింది. ఇప్పుడు ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యింది. పిబ్రవరి 24న థియేటర్ లో రిలీజ్ అవ్వగా.. మార్చ్ 25న జీ5 లో స్ట్రీమింగ్ కాబోతోంది  వాలిమై మూవీ. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved