రోజా ఫుల్ టైమ్ రీ ఎంట్రీ, బుల్లితెరపై జబర్థస్త్ ను మించిన షోతో మాజీ హీరోయిన్ సందడి
Roja Full Time TV Comeback : మాజీ మినిస్టర్ రోజా మళ్ళీ బుల్లితెరపై ఫుల్ టైమ్ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత పెద్దగా కనిపించడంలేదు రోజా. ఇండస్ట్రీలోకి వెళ్ళాలని గత ఏడాదిగా ఆమె ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఆమెకు, మరోసారి జడ్జిగా గోల్డెన్ ఆఫర్ వచ్చింది. రోజా జడ్జిగా స్టార్ట్ కాబోతున్న కొత్త ప్రోగ్రాం ఏంటి..? రోజా జబర్థస్త్ కు ఎందుకు వెళ్ళలేదు?

Roja
వైసీపీలో ఉంటూ.. ఎమ్మెల్యేగా కొనసాగిన రోజా.. అటు పాలిటిక్స్ చేస్తూనే, ఇటు టీవీషోస్ లో జడ్జిగా కూడా లో కంటీన్యూ అయ్యింది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షోకు 10ఏళ్ల కుపైనే జడ్జిగా కొనసాగింది రోజా. నాగబాబు వెళ్ళిపోయినా కాని.. రోజా మరో నాలుగైదేళ్ళు కంటీన్యూ అయ్యింది. ఆతరువాత వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ గా ప్రమోషన్ రావడంతో.. రూల్స్ ప్రకారం జబర్థస్త్ ను వీడాల్సి వచ్చింది. మినిస్టర్ గా ఉన్నన్నాళ్ళు ఇండస్ట్రీ వైపు చూడలేదు రోజా.
Also Read: కమల్ హాసన్ లేడీ వాయిస్‌తో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో తెలుసా? అందులో హిట్ సాంగ్స్ ఇవే?
ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, రోజా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. పార్టీ పనుల్లో కూడా పెద్దగా చురుగ్గా పాల్గొనడంలేదు రోజా. అంతే కాదు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అటు తమిళ్, ఇటు తెలుగులో కూడా రోజా ఛాన్స్ ల కోసం చూసిందట. కాని మినిస్టర్ గా ఉన్నప్పుడు రజినీకాంత్ ను, టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు తిట్టింది రోజా. ఆ ఎఫెక్ట్ తో ఆమెకు తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో సినిమా ఛాన్స్ లు రాలేదని సమాచారం.
Also Read: భర్త కోసం లవర్ ను సెట్ చేసిన భార్య, ఓటీటీలో రచ్చరచ్చ చేస్తున్న వెబ్ మూవీ, ఎక్కడ చూడొచ్చంటే?
ఇక గతంలో మాదిరి బుల్లితెరపై అయినా బిజీ అవ్వాలని ప్రయత్నించిందట రోజా. జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తే.. అక్కడ కూడా నో ఛాన్స్ బోర్డ్ పెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక ఏడాది ప్రయత్నాల తరువాత ఆమెకు తాజాగా ఫుల్ లెన్త్ రీ ఎంట్రీ ఛాన్స్ దక్కింది. జీ తెలుగులో ఓ షోకి జడ్జిగా చేసే అవకాశం దక్కింది. రీసెంట్ గా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా వచ్చి అలరించింది. ఇక అప్పుడు రోజా ఫ్యాన్స్ రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ అడగటం మొదలెట్టారు.
Also Read: సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?
Ex Minister Roja
తాజాగా తన అభిమానులను దిల్ ఖుష్ చేస్తూ.. రోజా ఫుల్ లెన్త్ బుల్లితెర రీ ఎంట్రీ ఇచ్చేసింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కానుంది. తాజాగా ఈ సీజన్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రోజా జడ్జిగా ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఈషోకి రోజాతో పాటు ఆమనీ, అనిల్ రావిపూడి కూడా జడ్జ్ లు గా కనిపించారు. అయితే రోజా మాత్రం సీజన్ మొత్తం కనిపిస్తారట. మిగతా వారు కొన్ని ఎపిసోడ్స్ కు మారతారని తెలుస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?
ఇక ఈ షో ఓపెనింగ్ ఎపిసోడ్ కి జగపతి బాబు రాగా ఆయనతో కలిసి రోజా, ఆమని డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. రోజా మరోసారి బుల్లితెరపై బిజీ కాబోతోంది. ఛాన్స్ లు వస్తే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా ఆమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో గోలీమార్, మొగుడు సినిమాల్లో హీరోయిన్ తల్లి పాత్రలో కనిపించింది రోజా.