- Home
- Entertainment
- సినిమాకు 300 కోట్లు, 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, మెగాస్టార్ కు కూడా సాధ్యం కానిది సాధించిన బన్నీ
సినిమాకు 300 కోట్లు, 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, మెగాస్టార్ కు కూడా సాధ్యం కానిది సాధించిన బన్నీ
Allu Arjun Birthday : 43 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు టాలీవుడ్ ఐకాస్ స్టార్ అల్లు అర్జున్. టాలీవుడ్ లో రెండు రేర్ రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు బన్నీ. ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి సాధ్యం కాని అవార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. ఇంతకీ బన్నీ సాధించిన ఘనత ఏంటి?

అల్లు అర్జున్ పుట్టినరోజు
మెగా, అల్లు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అల్లు అర్జున్. టాలీవుడ్లో మాస్ హీరో కొనసాగుతున్నారు. నిర్మాత అల్లు అరవింద్ వారసత్వంతో టాలీవుడ్ లోకి వచ్చిన బన్నీ... 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 2004లో సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు చేసిన ఐకాన్ స్టార్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.ః
Also Read: సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?
అల్లు అర్జున్ జీతం
అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్
పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.1800 కోట్లు వసూలు చేసింది. ఈ వసూళ్ళతో బాహుబలి రికార్డ్ ను కూడా క్రాస్ చేశాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ా మారాడు. దాంతో తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఒక సినిమాకి ఆయన శేర్ రూపంలో రూ.300 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డ్ సాధించాడు అల్లు అర్జున్.
Also Read: సమంత రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఏంటో తెలుసా? బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయిన స్టార్ హీరోయిన్?
అల్లు అర్జున్ అవార్డులు
జాతీయ అవార్డు గెలుచుకున్న మొదటి హీరో
అంతే కాదు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది. తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డ్ సాధించిన ఏకైక హీరోగా బన్నీ రికార్డ్ సాధించాడు. తెలుగులో స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్ లో ఒక్క సారి కూడా జాతీయావార్డ్ సాధించలేదు. కాని పుష్ప సినిమాతో ఆ అవార్డ్ ను కొట్టారు అల్లు అర్జున్. ఈరకంగా పుష్ప సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు అల్లు అర్జున్.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?
అల్లు అర్జున్ వ్యాపారం
వ్యాపారంలో బిజీగా ఐకాన్ స్టార్
సినిమాతో పాటు వ్యాపారంలో కూడా అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. సొంతంగా మల్టీప్లెక్స్ థియేటర్లు నడుపుతున్నాడు. ఆహా ఓటీటీ కూడా నడుపుతున్నాడు. ఇంకా చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు.
అల్లు అర్జున్ ఇల్లు
అల్లు అర్జున్ 100 కోట్ల ఇల్లు
అల్లు అర్జున్కు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇల్లు ఉంది. 8 వేల చదరపు అడుగుల్లో ఉన్న ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ ఇంటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. కొత్త గా మరో ఇల్లు కూడా ఆయన నిర్మించుకుంటున్నారు.
అల్లు అర్జున్ నికర విలువ
అల్లు అర్జున్ ఆస్తి విలువ
అల్లు అర్జున్కు 2011లో పెళ్లయింది. స్నేహారెడ్డిని ఓ పెళ్లి వేడుకుల్లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా, వ్యాపారం రెండింటిలోనూ దూసుకుపోతున్న అల్లు అర్జున్ సుమారు 500 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం.
అల్లు అర్జున్ దగ్గర సొంతంగా ప్రైవేట్ జెట్ విమానం ఉంది. రేంజ్ రోవర్, హమ్మర్, వోల్వో లాంటి కార్లు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ సొంతంగా స్టూడియో కూడా ఉంది. తన తాతగారి జ్ఞాపకార్థం 10 ఎకరాల్లో అల్లు స్టూడియో కట్టాడు.