MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?

సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?

Allu Arjun Multi Million Dollar Businesses and  Net Worth:  పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. పుష్ప2 తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మెగా,అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఐకాన్ స్టార్.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. సినిమాల కోసం ప్రాణం పెట్టి పనిచేసే అల్లు అర్జున్.. తన కష్టంతో ప్రస్తుతం టాప్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇక సినిమాలతో పాటు పలు వ్యాపారాలు కూడా చేస్తున్న బన్నీ.. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా? ఆయన సంపాదన ఎంత ఉంటుంది? ఏం బిజినెస్ లు చేస్తున్నారు? అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 08 2025, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పుష్ప రెండు సినిమాలతో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ కు ఇమేజ్ భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అల్లు అర్జున్ లెక్క మారిపోయింది. ఇక అల్లు అర్జున్ సినిమాలతో పాటు బిజినెస్ లు,బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా  భారీగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నికర ఆస్తి విలువ 500 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. మూవీస్ తో పాటు  ప్రొడక్షన్, హాస్పిటాలిటీ, రకరకాల రంగాల్లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నారట బన్నీ. అంతే కాదు  పలు సంస్థలకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు చేస్తూ సోషల్ మీడియా నుండి కూడా సంపాదిస్తున్నారు  స్టార్ హీరో.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయన్ ? కారణం ఏంటి?
 

26

అల్లు అర్జున్‌కు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఆయనకు  ప్రైవేట్ జెట్ కూడా ఉంది. అంతే కాదు కొత్తగా భారీ బంగ్లా కూడా కట్టిస్తున్నారు. ఇక లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేసే వస్తువులకు కొదవవే లేదు. అల్లు అర్జున్ కార్ల జాబితాలో రేంజ్ రోవర్ తో పాటు  తన స్వంత లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది. అంతే కాదు బన్నీ గ్యారేజీలో హమ్మర్ హెచ్2 ఎస్‌యూవీ చాలా ప్రత్యేకం.

ఇండియన్ సినిమాలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఐకాన్ స్టార్ కూడా ఒకరు.  బన్నీ రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయింది. ఇక మరో వాదన ఏంటంటే సినిమా లాభాల్లో ఆయన శేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కడన 200 కోట్లకు పైగా బన్నీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.  
 

36
<p><br />Allu studio</p>

<p><br />Allu studio</p>

అల్లు అర్జున్ ఫ్యామిలీ నిర్మాణ రంగం లో ఉన్నారని అందరికి తెలుసు.  దాదాపు 50 ఏళ్లుగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. రీసెంట్ గా అల్లు స్టూడియోస్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ స్టూడియోస్ లో అల్లు అర్జున్ తన తండ్రి, బ్రదర్స్ తో కలసి ముఖ్య భాగస్వామి గా ఉన్నాడు. అంతే కాదు అల్లు ఫ్యామిలీ మై హోమ్స్ తో కలిసి ఆహా ఓటీటీ ని స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇందులో కూడా అల్లు అర్జున్ పార్ట్నర్ గా ఉన్నాడు. 

46

అల్లు అర్జున్ బిజినెస్ ల సంగతి చూస్తే.. బఫెలో వైల్డ్ వింగ్స్అమెరికా కు చెందిన ఈ బార్ అండ్ రెస్టారెంట్ యొక్క ఫ్రాంచిజీ ని అల్లు అర్జున్ కొనుగోలు చేసాడు. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అల్లు అర్జున్ ఈ రెస్టారెంట్ వ్యాపారం లోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని కాస్ట్లీ ఏరియాల్లో ఈ రెస్టారెంట్ కి బ్రాంచెస్ ఉన్నాయి.
 

56

ఇక ఈమధ్య స్టార్ హీరోలు తమ సొంత బ్రాండ్స్ తో థియేటర్ల బిజినెస్ లోకి దిగుతున్న సంగతి  తెలిసిందే. ఈక్రమంలోనే అల్లు అర్జున్ కూడా  AAA  బ్రాండ్ నేమ్ తో సినిమాస్ఏషియన్ తో కలిసి.. సొంత మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేశారు. అమీర్ పేట్ లో  సత్యం థియేటర్ ప్లేస్ లో.. ఏషియన్ అల్లు అర్జున్ అనే పేరుతో 5 స్క్రీన్ల మల్టీపెక్స్ అండ్ మాల్ ని అల్లు అర్జున్ ప్రారంభించారు. ఇందులో మూవీ థియేటర్స్ తో పాటు ఫుడ్ కోర్ట్,గేమ్స్ జోన్ కూడా ఉన్నాయి.

66

ఇవే కాదు ఫుడ్ డెలివరీ యాప్స్ తో పాటు మరికొన్ని బ్రాండ్స్ ను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. వాటి కోసం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను బన్నీ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా రకరకాల మార్గాల ద్వారా ఐకాన్ స్టార్ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో బన్నీ కొత్త ఇంటికి కూడా షిప్ట్ అవుతారట. ఇక ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న అల్లు అర్జున్.. త్వరలో అట్లీ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం. ఆతరువాత త్రివిక్రమ్ సినిమా చేసి.. అప్పుడు పుష్ప3 పై ఫోకస్ పెడతారని తెలుస్తోంది.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved