పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. అవకాశం రావడం ఆలస్యం వెంటనే కళ్లు మూసుకుని ఒప్పేసుకుంటారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పవర్ స్టార్ తో సినిమా చేయడానికి నో చెప్పేసిందట. అద్భుతమైన అవకాశం రావడమే కష్టం, కాని ఆ అవకాశాన్ని మాత్రం చేతులారా వదిలేసుకుంది స్టార్ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎందుకు పవన్ కళ్యాన్ తో సినిమా చేయను అని చెప్పింది. కారణం ఏంటి?

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే హీరోయిన్లు లక్కీగా ఫీల్ అవుతుంటారు. ఛాన్స్ రావడమే ఆలస్యం పరిగెత్తుకుంటూ వెళ్ళి సినిమా చేస్తుంటారు. పవర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చినా. వదలకుండా చేసిన వారు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ఆమె పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లో ఫుల్ లెన్త్ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. వకీల్ సాబ్ లో చిన్న పాత్రలో కూడా నటించి మెప్పించింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయని చెప్పిందట కారణం ఏంటి?
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. ఆమె రిజెక్ట్ చేసిన సినిమా ఏదో కాదు వకీల్ సాబ్. అయితే ఈసినిమాను ఆమె రిజెక్ట్ చేయడనికి కారణం ఉంది. పవర్ స్టార్ తో సినిమా అంటే చేయడాని నయనతారకు కూడా ఇష్టమే కాని ఆ పాత్ర చాలా చిన్నది కావడంతో ఆమె ఆలోచించిందట. వకీల్ సాబ్ లో శృతీ హాసన్ చేసిన పాత్రలో నయన్ ను తీసుకోవాలి అనుకున్నాట మూవీటీమ్.
Actor Nayanthara Test charecter teaser out
కాని ఆ పాత్ర డ్యూరేషన్ చాలా తక్కువ కావడంతో నయన్ చేయడానికి ఒప్పుకోలేదట. నయన్ అప్పటికే స్టార్ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ తో బీజీగా ఉంది. దాంతో ఆమె చిన్న పాత్ర కోసం డేట్స్ ఇవ్వలేను అని చెప్పిందట. అలా పవన్ కళ్యాన్ తో సినిమా మిస్ అయ్యింది నయనతార. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పట్లో సినిమాలవైపు చూపేసేలా కనిపించడంలేదు పవన్ కళ్యాణ్. ఇక పవన్ నెక్ట్స్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్టే అంటున్నారు. మరి అభిమానుల కోసం ముందు ముందు సినిమాల్లో యాక్టీవ్ అవుతారా..? లేక తాను రిటైర్ అయ్యి, తన వారసుడు అకీరా ను రంగంలోకి దింపుతారా అనేది చూడాలి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఈ పాతవార్త వైరల్ అవుతోంది.