విజయ్ దేవరకొండతో డేటింగ్ పై రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్.. ఏమంది ?
విజయ్ దేవరకొండతో - రష్మిక మందన్న నిజంగా ప్రేమించుకుంటున్నారా.. ? డేట్స్ కు వెళ్తున్నారా..? చాలా కాలంగా వీరిపై రకరకాల రూమర్స్ వస్తున్న వేళ.. రష్మిక చేసిన ఓపెన్ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందన్న బాలీవుడ్ లో .. చాలా బిజీగా ఉంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో చావా అనే చారిత్రాత్మక నాటకంలో కనిపించనున్న రష్మిక మందన్న ఇటీవలి ఇంటర్వ్యూలో తన సంబంధాన్ని అంగీకరించారు. అయితే, ఆమె తన భాగస్వామి పేరును ప్రస్తావించలేదు. రష్మిక తన డియర్ కామ్రేడ్ సహనటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read: అఘోరా గా అల్లు అర్జున్, బాలయ్య తో బన్నీ అన్న మాట నిజం అవుతుందా..?
2018 బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ గీత గోవిందం సినిమాతో ఈ జంట కలిసింది. ఇక ఆతరువాత 2019 లో వచ్చిన రొమాంటిక్ మూవీ డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించినప్పటి నుండి విజయ్ మరియు రష్మిక డేటింగ్ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.
రష్మిక క్రమం తప్పకుండా విజయ్ ఇంటికి వెళ్ళడం. అతని కుటుంబంతో సమయం గడుపుతున్నట్లు కనిపించింది, ఇది సంవత్సరాలుగా ఆసక్తిని రెచ్చగొట్టింది. వారి సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా అందరి దృష్టి ని ఆకర్శించాయి. ఇద్దరు విదేశాల్లో తిరుగుతూ కనిపించకుండా మేనేజ్ చేయడం కొన్ని చోట్ల దొరికిపోతున్నారు. దాంతో వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటున్నారు జనాలు.
Also Read: ధనుష్ - ఐశ్వర్య పెళ్లి రజినీకాంత్ కు ఇష్టం లేదా..?
ది హాలీవుడ్ రిపోర్టర్‌తో ఇంటర్వ్యూలో, రష్మిక మాట్లాడుతూ, "ఇల్లు నా సంతోషకరమైన ప్రదేశం. ఇది నన్ను స్థిరంగా ఉంచేలా చేస్తుంది, నాకు బలాన్ని అందిస్తుంది, విజయం రావచ్చు, పోవచ్చు, కానీ అది శాశ్వతం కాదు అని నన్ను భావిస్తుంది. కానీ ఇల్లు శాశ్వతం.
కాబట్టి, నేను ఆ స్థలం నుండి పని చేస్తాను. నాకు లభించే ప్రేమ, కీర్తి, నేను పొందే స్టార్ డమ్ ఎంత ఉన్నా, నేను ఇప్పటికీ కేవలం ఒక కూతురుని, ఒక సోదరిని, ఒక భాగస్వామిని. నాకున్న ఆ జీవితాన్ని, ఆ వ్యక్తిగత జీవితాన్ని నేను నిజంగా గౌరవిస్తాను. అన్నారు.
Also Read: విజయ్ కంటే ఆయన భార్య సంగీత ఆస్తులు ఎక్కువా..? దళపతి భార్య సంపాదన ఎంత ..?
ఒక పురుషుడిలో తనను ఏ విషయం ఆకర్షిస్తుందో కూడా చెప్పింది రష్మిక. కళ్ళు ఒకరి ఆత్మకు కిటికీలు అని అంటారు, నేను దానిని నమ్ముతాను, నేను నవ్వుతూ ఉంటాను, కాబట్టి నవ్వుతున్న ముఖం ఉన్న వ్యక్తుల వైపు నేను ఆకర్షితురాలి. ఇక అటువంటి వ్యక్తి ఎవరైనా సరే, చుట్టూ ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తి. అవుతారు అని అన్నారు రష్మిక.
Also Read: సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు..
విజయ్ కూడా తన డేటింగ్ ను అంగీకరించాడు. కాని ఆమె ఎవరు అనేది అప్పుడు ఇప్పుడు వెల్లడించలేదు. అయితే, సరైన సమయం వచ్చినప్పుడు తాను తన తన ప్రేమ జీవితం గురించి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. అభిమానులు తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. కాని ఆ ఒత్తిడి వల్ల నేను అసలు విషయం వెల్లడించడం అనేది జరగదు అని అన్నారు విజయ్ దేవరకొండ.
Also Read: రజినీకాంత్ తో సినిమా అవకాశం వదులుకున్న హీరో.. కారణం ఏంటో తెలుసా..?
గత ఏడాది దీపావళిని రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి గడిపారు. ఆమె తన తాజా చిత్రం పుష్ప 2ని కూడా దేవరకొండ కుటుంబంతో కలిసి చూశారు.