- Home
- Entertainment
- సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు.. ఎన్టీఆర్ నుంచి మోహన్ బాబు వరకూ
సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు.. ఎన్టీఆర్ నుంచి మోహన్ బాబు వరకూ
టాలీవుడ్ లో స్టార్ హీరోలు చాలామంది తమ బంధువుల ఆడపిల్లలనే పెళ్ళాడారు. అందులోను సొంత మరదళ్ళను పెళ్ళాడిన హీరోలు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి మెహన్ బాబు వరకూ మేనరికం పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరంటే..?

అత్తకూతురినో.. మామ కూతురినో పెళ్ళాడిన హీరోలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. పెద్దాయన ఎన్టీఆర్ దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ చాలామంది తమ మరదళ్ళను పెళ్ళాడారు. నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇతరులకు సాధ్యం కావేమో.
తెలుగు సినిమాకు మకుటంలా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్ తన సొంత మరదలు బసవతారకంను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. బసవతారకం కూడా ఎన్టీఆర్ ను పట్టుపట్టి పెళ్ళి చేసుకున్నారట. ఇక ఆమె క్యాన్సర్ తో మరణించడంతో బసవతారకం క్యాన్సర్ ఇనుట్యూట్ ను స్థాపించారు ఎన్టీఆర్. ఈ హాస్పిటల్ ద్వారా పేదవారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక ఇండస్ట్రీకి రెండు కళ్లు లాంటి ఎన్టీఆర్ ఏఎన్నారు ఇద్దరు కూడా తమ మరదళ్ళను పెళ్ళాడిన వారే. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి. టాలీవుడ్ కు మొదటగా వెస్ట్రన్ స్టెప్పులు నేర్పిన అక్కినేని నాగేశ్వరరావు కూడా తన సొంత మరదలు అన్నపూర్ణమ్మను పెళ్ళి చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు తమభార్యలను ప్రాణంగా ప్రేమించారు. అక్కినేని నాగేశ్వరావు తన భార్య పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ ను స్టాపించారు.
అలనాటి మరో హీరో సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మేనమరదలినే పెళ్ళి చేసుకున్నారు. తన మేనమామ కూతురు ఇందిరాదేవిని పెళ్ళాడారు కృష్ణ. అప్పటికే సినిమాల్లో ఓ మోస్తరు హీరోగా ఎదుగుతున్నకృష్ణ. మరదలు ఇందిరా దేవిని పెళ్ళి చేసుకుని ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగసంతానం పొందారు. ఆ క్రమంలోనే సినిమాల్లో తన సహచర నటి విజయనిర్మలతో ప్రేమలో పడ్డ కృష్ణ.. ఆమెను రెండో పెళ్ళి చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కృష్ణ నట వారసత్వాన్ని నిలబెడుతున్నారు.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తన మరదలినే పెళ్ళాడారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఆయన పెళ్ళి చేసుకున్నది మేనమామ, మేనత్త కూతురిని కాదు. భార్య చెలెలిని పెళ్ళి చేసుకున్నారు. మోహన్ బాబు భార్య మరణించడంతో.. ఆమె చెల్లెలు నిర్మలను ఆయన రెండో పెళ్ళి చేసకున్నారు. మంచు లక్ష్మి, విష్ణు, మొదటి భార్య సంతానం కాగా.. మంచు మనోజ్ రెండో భార్య నిర్మాల సంతానం.
వీళ్లే కాదు మరికొంత మంది హీరోలు కూడా తమ సొంత మరదళ్లను పెళ్ళి చేసుకున్నారు. వారిలో యంగ్ హీరో.. సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ తన మరదలు అరుణను పెళ్ళి చేసుకోగా.. తమిళ స్టార్ హీరో కార్తి కూడా తన సొంత మరదలు రజినీని పెళ్ళి చేసుకున్నారు.