అఘోరా గా అల్లు అర్జున్, బాలయ్య తో బన్నీ అన్న మాట నిజం అవుతుందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణతో అన్న మాట నిజం అయ్యేలా కనిపిస్తోంది. అఖండాలో బాలయ్య చేసిన పాత్ర బన్నీకి చేయాలని ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అఘోరాగా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. ఇంతకీ డైరెక్ట్ ఎవరో తెలుసా..?

అల్లు అర్జున్ ఏంటి.. అఘోరా పాత్రలో ఏంటి అని ఆశ్చర్చపోకండి. ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేయగల హీరోగా అల్లు అర్జున్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. పుష్ప రెండు సినిమాలతో ఆయన ఏంటో దేశం మొత్తం అర్ధమైంది. బాలీవుడ్ లో బన్నీ క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఇక పుష్పలో ఆయన నటనకు ఫిదా అయ్యారు ఆడియన్స్.
Also Read: సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు..
Allu Arjun, K
ఇక ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోయారు. ఈక్రమంలో అల్లు అర్జున్ పాత్ర కోసం ప్రాణాలు పెట్టేస్తాడు. ఎంత పెద్ద రిస్క్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా చేసేయడం బన్నీకి అలవాటుగా మారింది. సో ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నాడట. పుష్పరాజ్ గా ఎంత కష్టపడ్డాడో అందరికి తెలిసు. ఇకఇప్పుడు అఘోరా పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడట.
ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుసా.. త్రివిక్రమ్ శ్రీనివాస్. అవును మాటల మాత్రికుడితో త్వరలో చేయబోయే సినిమాలో అఘోరా పాత్రను చేయబోతున్నాడట అల్లు అర్జున్. ఇప్పటిే లుక్ టెస్ట్ కూడా అయిపోయినట్టు సమాచారం.
అంతే కాదు ఇప్పటికే అల్లు అర్జున్ అఘోరా పాత్రకు సబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా నెట్లో దర్శనం ఇస్తున్నాయి అఘోరాను అద్భుతంగా హ్యాండ్సమ్ గా చూపిస్తూ..పోస్టర్లు వేస్తున్నారు కుర్రాళ్ళు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే. తాను ఈ పాత్రపై ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు ఇండైరెక్ట్ గా బాలయ్యతో గతంలోనే అన్నాడు బన్నీ.
Also Read: 50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
photo credit-aha unstoppable4 promo
అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడిన ఐకాన్ స్టార్.. నేను అఖండ 3 చేస్తాను..మీరు పుష్ప3 చేయండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చాడు బాలయ్యకు. ఇలా అఘోరా పాత్రపై ఇంట్రెస్ట్ గా ఉన్న బన్నీ.. అందుకు ప్రిపేర్ అవుతున్నరని సమాచారం. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది.
Also Read:ధనుష్ - ఐశ్వర్య పెళ్లి రజినీకాంత్ కు ఇష్టం లేదా..? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది ద్వితీయార్థం లో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి, వచ్చే ఏడాది సమ్మర్ లోపు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనిరుధ్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకుోవాలి అని అనుకుంటున్నాడట త్రివిక్రమ్. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారట.
ఇటువంటి ప్రయోగాలు చేయడంలో అల్లు అర్జున్ తరువాతే ఎవరైనా..రీసెంట్ గానే పుష్ప 2 సినిమాలో గంగంమ్మ జాతరలో బన్నీ చీరకట్టుకుని అమ్మవారి గెటప్ లో ఎంత హడావిడి చేసింది అందరికి తెలిసిందే. ఈ పాత్రలో లీనమై.. పూనకం నిజంగానే వచ్చిందేమో అన్నట్టుగా పెర్ఫామెన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక అఘోరాపాత్రలో అంటే ఇంకెంత పెర్ఫామెన్స్ ఇస్తాడా అని ఫ్యాన్స్ఎదురు చూస్తున్నారు. ఇక మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.