- Home
- Entertainment
- వర్జిన్ వైఫ్ కావాలని కోరుకోకండి, మగవారికి మహేష్ బాబు హీరోయిన్ సంచలన సలహాలు, ఏమంటుందంటే?
వర్జిన్ వైఫ్ కావాలని కోరుకోకండి, మగవారికి మహేష్ బాబు హీరోయిన్ సంచలన సలహాలు, ఏమంటుందంటే?
వర్జిన్ భార్యలు కావాలని మగవారు కోరుకోవద్దు అంటోంది ఓ హీరోయిన్. అలా కోరుకునే కంటే మరోలా ఆలోచిస్తే జీవితాలు బాగుపడతాయి అంటోంది. ఇంతకీ మగజాతికి మహేష్ బాబు హీరోయిన్ ఇచ్చిన సలహా ఏంటోతెలుసా..?

Priyanka Chopra, mahesh babu, rajamouli,
ప్రస్తుతం మహేష్ బాబు జోడీగా రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా కోసం హాలీవుడ్, టాలీవుడ్‌ల మధ్య పరుగులు తీస్తున్న ప్రియాంకా చోప్రా కన్యత్వం గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. సంచలనంగామారాయి. భార్య కన్య కావాలని భర్తలు కోరుకోకూడదని ప్రియాంక చెప్పిన మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రియాంకా ఈ మాట చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆమె మాటతో ఏకీభవిస్తారేమో.
Also Read: రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్
ప్రియాంకా చోప్రా ఎప్పుడూ ఖరాఖండిగా మాట్లాడుతుంది. టెడ్ టాక్ వంటి వేదికల నుంచి అనేక పాడ్‌కాస్ట్‌ల వరకు ప్రియాంకా తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూనే ఉంటారు. చాలా వేదికలపై ఆమె ప్రేరణాత్మక ప్రసంగాలు కూడా చేశారు. అంతేకాదు, స్టైల్ విషయంలోనూ ఆమె ఎవరికీ తీసిపోరు. పది రోజుల క్రితం ఆమె తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహంలో ఈ నటి మెరిసిపోయారు. ఆమె ధరించిన 70 కోట్ల విలువైన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన నెక్లెస్ అందరినీ ఆకర్షించింది.
Also Read:50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
200 క్యారెట్ల పచ్చలు, వజ్రాలతో తయారు చేసిన బల్గరి హారమట. మెడిటరేనియన్ సముద్రపు మొక్క క్యాపెల్వెనెరಯ మోడల్ ను ఆధారంగా చేసుకుని మనీష్ అండ్ టీమ్ దీన్ని తయారు చేసింది. 71.24 క్యారెట్ల వజ్రాలు, 130.77 క్యారెట్ల పచ్చలతో తయారైన ఈ నెక్లెస్‌కు 'ది ఎమరాల్డ్ వీనస్' అని పేరు పెట్టారు. దీన్ని తయారు చేయడానికి 1600 గంటలు పట్టిందని సమాచారం.
Also Read:బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా.. చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సంబంధాల గురించి మాట్లాడిన ప్రియాంకా, 'నా గత అనుభవాల వల్ల నేను డేటింగ్ చేయడానికి సంకోచించేదాన్ని. కుటుంబ వాతావరణం ఇష్టపడే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని నా కోరిక. గత సంబంధాలలో నాతో ఉన్నవారి నుంచి నేను చాలా బాధను అనుభవించాను. అందుకే మొదట్లో నిక్‌తో డేట్ చేయడానికీ సంకోచించాను' అని చెప్పారు.
తన జీవిత భాగస్వామిగా ఎంచుకునే వ్యక్తి నిజాయితీపరుడు కావాలని ఆమెకు చాలా ముఖ్యమట. దీనికీ గత చేదు అనుభవాలే కారణమంటోంది ప్రియాంక. తనకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఇలా ఉండాలని ప్రియాంకా ఒక క్వాలిటీ లిస్ట్ రాసుకున్నారట. అవన్నీ నిక్‌లో ఉండటం వల్లే పెళ్లి చేసుకున్నారట. లేదంటే అతడిని పెళ్లి చేసుకునేది కాదంటోంది ప్రియాంక. .
Also Read:10 ఏళ్లకే ఇండస్ట్రీలొకి ఎంట్రీ, 36 ఏళ్లకే మరణం, 70 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
మరి అప్పుడు అలా ఉన్న ప్రియాంక.. ఇప్పుడు మాత్రం భర్తలందరూ తమ భార్య కన్య కావాలని కోరుకోకూడదని, మంచి గుణం ఉన్న అమ్మాయి కావాలని కోరుకోవాలని అంటున్నారు. ఎందుకంటే కన్యత్వం ఒక్క రాత్రిలో పోతుంది. మంచి గుణం జీవితాంతం ఉంటుందని ఆమె అన్నారు. అయితే దీన్ని అబ్బాయిలకూ వర్తింపజేయాలని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి ప్రియాంక కామెంట్స్ సంచలనం అవుతున్నారు. దీనిపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.
Also Read: ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?