- Home
- Entertainment
- 10 ఏళ్లకే ఇండస్ట్రీలొకి ఎంట్రీ, 36 ఏళ్లకే మరణం, 70 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
10 ఏళ్లకే ఇండస్ట్రీలొకి ఎంట్రీ, 36 ఏళ్లకే మరణం, 70 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
చాలా చిన్న వయన్సులో మరణించిన స్టార్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారి మరణాలకు రకరకాల కారణాలు ఉండవచ్చు. కాని పాపులర్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే అకాల మరణం పొందిన ఈ హీరోయిన్ విషాద గాధ మీకు తెలుసా..?

ఆమె స్టార్ హీరోయిన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. 10 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలసరసన మెరిసింది. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చింది. చాలా చిన్నవయస్సులోనే స్టార్ డమ్ ను చూసింది. బాల్యంలో అనుభవించిన కష్టాలకు.. స్టార్ హీరోయిన్ గా ఆమె ఉపశమనం పొందింది. అయితే అంతలెనే ఆమెను మరణం కబలించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..?
ఆమెఎవరో కాదు మధుబాల. బాలీవుడ్ కు ఆమె ఒక ఐకాన్. తరాలు మారినా గుర్తు పెట్టుకోగలిగే తార. మధుబాల అంటే ఇప్పటికీ చెమర్చే కళ్ళు చాలా ఉన్నాయి. ఆమెను తలుచుకుని మనసు బరువయ్యే అభిమానులు ఉన్నారు.
ఆమె జీవితం ఒడిదుడుకులకు, ఎత్తు పల్లాలకు, చేదుతీపికి ఉదాహరణ. మధుబాల 1950ల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. దాదాపు 20 ఏళ్ల పాటు బాలీవుడ్‌ను ఏలింది. 70 సినిమాల్లో నటించి మెప్పించింది. అన్ని రకాల పాత్రలతో అద్భుతం చేసింది.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టిన మధుబాల అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె పేదరికంతో ఇబ్బందిపడింది. పదకొండు మంది పిల్లల్లో ఈమె ఐదో సంతానం. తండ్రి ఉద్యోగం పోవడంతో బ్రతుకుతెరువుకు ముంబయ్ వచ్చారు. అదే టైమ్ లో మధుబాలను బాలనటిగా పరిచయం చేశారు.
10 ఏటనే ఆమె సినిమాల్లో అడుగు పెట్టారు. మొదటి సినిమాకు మధుబాల రెమ్యునరేషన్ 150 రూపాలయలు. అయితే ముంతాజ్ పేరు స్క్రీన్ కు బాలేదని.. నటి దేవికా రాణి ఆమె పేరును మధుబాలగా మార్చారు. ఇంతకీ మధుబాల అంటే ఏమిటో తెలుసా.. తేనె పువ్వు’ అని అర్థం.
Also Read:ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?
బాలీవుడ్ లో చాలా ప్రేమాయణాలు నడిపింది మధుబాల. ఆమెకు ధైర్యం చాలా ఎక్కువ. నటుడు ప్రేమ్ నాథ్ కు ప్రేమలేక రాసిన మధుబాల.. ఆతరువాత హీరో దిలీప్ కుమార్ తో ప్రేమల్ పడింది. కాని మధుబాల తండ్రి వల్ల వీరు విడిపోవల్సి వచ్చింది. మధుబాల తండ్రికి, దిలీప్ కుమార్ కు గోడవలు జరిగాయి. ఆ గోడవల్లో మధుబాల తన తండ్రివైపే నిలబడింది. దాంతో దిలీప్ మధుబాలకు బ్రేకప్ చేప్పారు.
madhubala kishorekumar
ఇక ఆతరువాత బాలీవుడ్ స్టార్ సింగర్ కిషోర్ కుమార్ ను పెళ్ళి చేసుకుంది మధుబాల. కాని అప్పటికే ఇండస్ట్రీలతో స్టార్ గా ఉన్న ఆమో ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు పుట్టుకతోనే గుండె సమస్య ఉంది. అది అతనికి తెలియదు. విషయం తెలిసిన తరువాత ఇద్దరిమధ్య మనస్పర్ధలు వచ్చాయట. కొన్నిరోజులకే మధుబాల మంచానపడింది. 1969 ఫిబ్రవరి 23న కేవలం 36 ఏళ్ల వయసులోనే మధువాల తుది శ్వాస విడిచింది. ఆమె మరణించినా.. చరిత్రలో నిలిచపోయింది. బాలీవుడ్ లో ప్రేమ దేవతగానిలిచింది.