- Home
- Entertainment
- Surekha Vani: మీ అంతట మీరే ఆ వీడియోలు డిలీట్ చేస్తే మంచిది..ప్రైవేట్ వీడియోపై సురేఖ వాణి ఫస్ట్ రియాక్షన్
Surekha Vani: మీ అంతట మీరే ఆ వీడియోలు డిలీట్ చేస్తే మంచిది..ప్రైవేట్ వీడియోపై సురేఖ వాణి ఫస్ట్ రియాక్షన్
తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నారని సురేఖా వాణి వెల్లడించారు. వాటిని షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Surekha Vani
నటి సురేఖా వాణికి సంబంధించినదిగా చెబుతున్న ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు ఇలా పంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఘాటు ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా వీడియో ద్వారా కూడా తన ప్రైవేట్ కంటెంట్ సర్కులేట్ చేస్తున్న వారికీ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
వీడియోలు షేర్ చేయొద్దంటూ స్పష్టమైన విజ్ఞప్తి
తన ప్రకటనలో సురేఖా వాణి సోషల్ మీడియా వినియోగదారులతో పాటు మీడియా సంస్థలు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశించి మాట్లాడారు. తన వ్యక్తిగత కంటెంట్‌ను ఎలాంటి రూపంలోనూ షేర్ చేయడం, మళ్లీ పోస్టు చేయడం, అప్లోడ్ చేయడం, ఇతరులకు పంపించడం వెంటనే ఆపాలని కోరారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయని స్పష్టం చేశారు.
షేర్ చేసే ఖాతాలపై చట్టపరమైన చర్యలు
సురేఖ వాణి దీనిపై సైబర్ కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం వీడియో పోస్ట్ చేసి వార్నింగ్ ఇచ్చారు. నిన్న రాత్రి నుంచి నాకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనివల్ల నేను తీవ్రంగా బాధపడుతున్నాను, ఎఫెక్ట్ అయ్యాను. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వాళ్ళు, మీమ్ పేజెస్, ఇతర సోషల్ లలో తనకి తనకి సంబంధించిన కంటెంట్ షేర్ చేసిన వాళ్ళు.. వాళ్ళంతట వాళ్లే ఆ వీడియోలు డిలీట్ చేస్తే మంచిది. లేదంటే క్రిమినల్ అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని సురేఖ వాణి హెచ్చరించారు.
2005లో సినీ రంగ ప్రవేశం చేసిన సురేఖా వాణి
సురేఖా వాణి 2005లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. భద్ర, బొమ్మరిల్లు, శ్రీమంతుడు, నాయక్, దుబాయ్ శీను లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.













