- Home
- Entertainment
- రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్
రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్
రమ్యకృష్ణకు సబంధించిన ఓ టాప్ సీక్రేట్ ను వెల్లడించారు సౌత్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్. తాను డైరెక్ట్ చేసిన నరసింహ సినిమాలో నీలాంభరి పాత్రకు సబంధించిన విషయన్ని ఆయన రివిల్ చేశారు.

Ramyakrishna
తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది రమ్యకృష్ణ. హీరోయిన్ గా గ్లామర్ పాత్రలతో పాటు, పెర్ఫామెన్స్ ఓరిెంటెడ్ క్యారెక్టర్స్ ను కూడా ట్రై చేసింది సీనియర్ హీరోయిన్. ఇక ఇప్పటికీ తమిళ, తెలుగు భాషలంలో ఎన్నో పాత్రల్లో మెరుస్తున్నాు రమ్యకృష్ణ. అయితే తాజాగా సౌత్ సీనియర్ దర్శకుడు రమ్యకృష్ణ నీలాంభరి పాత్రకు, మాజీ ముఖ్యమంత్రికి ఉన్న సబంధాన్ని వెల్లడించాడు. 26 ఏళ్ళ రహస్యాన్ని ఆయన బయటపెట్టాడు.
Also Read: బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?
26 ఏళ్ల తర్వాత కె.ఎస్.రవికుమార్ చెప్పినరహస్యం:
దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 1999లో విడుదలైన సినిమా 'నరసింహ'. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణన్ రెండో హీరోయిన్ గా నటించగా, శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, రాధారవి, నాజర్, మణివణ్ణన్, సెంథిల్, అబ్బాస్, ప్రీత, రాజా రవింద్ర, సత్యప్రియ, మన్సూర్ అలీఖాన్ వంటి భారీ స్టార్స్ కనిపించారు.
Also Read: మెడ నిండా రుద్రాక్షలతో టాలీవుడ్ స్టార్ హీరో, మహాకుంభమేళాలో మెరిసిన ఈ స్టార్ ను గుర్తు పట్టారా?
నరసింహ కథ.
మెకానికల్ ఇంజనీర్ అయిన నరసింహ (రజనీకాంత్), స్వగ్రామానికి వచ్చినప్పుడు, పేద అమ్మాయి వసుంధర (సౌందర్య) ప్రేమలో పడతాడు. కానీ నీలాంబరి( రమ్యకృష్ణ) నరసింహను ఇష్టపడటం మొదలుపెడుతుంది. నీలాంబరి అన్నయ్యకు, పడయప్ప చెల్లెలికి పెళ్ళి నిశ్చయమైన తర్వాత, ధర్మలింగం (శివాజీ గణేశన్) నుండి అన్ని ఆస్తులను ఆయన తమ్ముడు రామలింగం (మణివణ్ణన్) లాక్కుని బయటకు పంపిస్తాడు. పడయప్ప కుటుంబం దగ్గర డబ్బు లేదని తెలుసుకుని, రామలింగం కూతురిని నీలాంబరి అన్నయ్య పెళ్ళి పెళ్ళిచేసు కుంటాడు.
Also Read: ఎన్టీఆర్ భార్య ప్రణతి కు ఇష్టమైన పాన్ ఇండియా హీరో ఎవరు.? బాగా నచ్చిన సినిమా ఏది?
రమ్యకృష్ణ పాత్ర
తన కూతుర్ని పెళ్లి చేసుకోమని నరసింహను ఆయన నాన్న కోరగా, పడయప్ప అమ్మ సావిత్రి (లక్ష్మి) కొడుకు మనసులోనిది తెలుసుకుని నీలాంబరి ఇంట్లో పనిపిల్లగా ఉన్న వసుంధరను తన కొడుకుకి పెళ్లి చేస్తుంది.
Also Read: 50 వేల కోట్ల ఆస్తి ఉన్న హీరో, చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాడు కారణం ఏంటి..?
రజనీకాంత్ కంటే ఎక్కువ ఇమేజ్
ఆస్తులు పోగొట్టుకున్ననరసింహ పేరు మీద ఆయన నాన్న కొన్న ఒక పొలంలో ఉన్న చిన్న కొండ గ్రాండ్ మైన్ అని తెలుస్తుంది. దాంతో నరసింహ కోట్లకు పడగలెత్తుతాడు. ఇంట్లోనే ఉండిపోయిన నీలాంబరి బయటకు వచ్చి, విలనిజంలో భయపెడుతుంది. రజనీకాంత్‌కి ఎదురుగా ఆమె నటించిన సన్నివేశాలు థియేటర్లను దద్దరిల్లించాయి. ఈ సినిమాలో రజనీకాంత్ కంటే ఎక్కువగా నీలాంబరి పాత్ర చేసిన రమ్యకృష్ణకు వచ్చింది. అయితే ఇందులో ఓ చిన్న రహస్యం ఉంది.
Also Read: సినిమాలు మానేసి, డాక్టర్ గా ప్రాక్టీస్ చేయబోతున్న హీరోయిన్? షాక్ లో ఫ్యాన్స్
నీలాంబరి పాత్రకు స్ఫూర్తి:
ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతున్న తరుణంలో, ఈ సినిమా గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమాలోని నీలాంబరి పాత్రకు స్ఫూర్తి ఎవరో డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితే ఈ పాత్రకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసని, 'నరసింహ' సినిమా చూసిన జయలలిత నీలాంబరి పాత్ర హైలైట్‌గా ఉందని చెప్పారని కూడా ఆయన అన్నారు. ఈ విధంగా రమ్యకృష్ణకు.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఉన్నబంధాన్నిఆయన రివిల్ చేశారు.