- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?
పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?
Pawan Kalyan and Anushka Shetty Missed Two Movies: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఈ ఇద్దరి కాంబినేషన్ లో, ఒకటి కాదు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయని మీకు తెలుసా. ఇతకీ ఆ రెండు సినిమాలు ఏంటి? ఎలా మిస్ అయ్యారు.

Pawan Kalyan and Anushka Shetty Missed Two Blockbusters: ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అదే టైమ్ లో మరికొన్ని కాంబోలు డిజాస్టర్లు అవుతాయి. అయితే టాలీవుడ్ లో అసలు కలిసి సినిమాలు చేయని వారు ఉన్నారని తెలుసా? వారి కాంబినేషన్స్ లో సినిమా చేయాలి అనుకున్నా.. ఆ టైమ్ కు మిస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
అలాంటి జంటలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి ఉన్నారు. వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. కాని వీరిద్దుర హీరో హీరోయిన్లుగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం మిస్ అయ్యాయి. ఇంతకీ ఎంటా సినిమాలు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ?
అనుష్క శెట్టి – పవన్ కళ్యాణ్... వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావల్సి ఉంది. కొన్నికారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి అనుష్క శెట్టి తప్పుకోవల్సి వచ్చిందట. ముందుగా అనుష్క అనుకున్నారు.. కాని ఆమె తప్పుకోవడంతో.. హీరోయిన్ ను మార్చేశారట. మేకర్స్.. ఇంతకీ ఆ సీనిమా ఏంటీ..? మార్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
ఆ సినిమా ఏదో కాదు.. బంగారం . పవన్ కళ్యాణ్ కెరియర్ లో యావరేజ్ గా నిలిచినా..మంచి సినిమాగా గుర్తింపు పొందింది ఈసినిమా. ఇక ఈ మూవీలో ముందుగా హీరోయిన్ గా అవకాశం అందుకుంది అనుష్క శెట్టి. అయితే ఇది చాలా చిన్న క్యారెక్టర్.. కావడంతో అనుష్క ఈ అవకాశాన్ని వదిలేసుకుందట.
చిన్న క్యారెక్టర్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా...? అదే . క్లైమాక్స్ సీన్ లో .. లాస్ట్ మినిట్లో త్రిష ట్రైన్ ఎక్కుతుంది.. అప్పుడు పవన్ కళ్యాణ్ చేయి అందిస్తాడు కదా ఆ పాత్ర కోసం అనుష్కను అనుకున్నారట మేకర్స్.
Also Read: ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
Anushka Shetty
స్టార్ హీరోయిన్ తో ఆ ఒక్క సీన్ ఉంటుంది .ఆ సీన్ డైరెక్టర్ అనుష్క శెట్టితో ఊహించుకున్నాడట . అయితే అనుష్క శెట్టి ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. కేవలం ఒక్క సీన్ కోసం నటించాలా..? అంటూ అనుష్క శెట్టి ఈ సినిమా ఆఫర్ ను వదులుకునిందంట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది కూడా. పవన్ ఫ్యాన్స్ కూడా అప్పుడు హర్ట్ అయ్యారట.
Also Read: 15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?
విక్రమార్కుడు (2006) బడ్జెట్ 11 కోట్లు - షేర్స్ 26 కోట్లు
ఇక పవన్ కళ్యాణ్ అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన మరో బ్లాక్ బస్టర్ మూవీ విక్రమార్కుడు. అయితే ఈసారి మాత్రం అనుష్క మిస్ అవ్వడం కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీస్ అయ్యాడు. రాజమౌళి విక్రమార్కుడు సినిమాను పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట. అయితే పవన్ ఎందుకో ఈసినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈమూవీని రవితేజ తో కంప్లీట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు జక్కన్న.
Also Read:కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?
అయితే ఈసినిమాలో పవన్ కళ్యాణ్ హీరో అయినా కూడా అనుష్కనే హీరోయిన్ గా తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి. అనుష్క శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాని పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయకపోవడంతో వీరిద్దరి కాంబోబోలో బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యింది. ఇలా రెండు సినిమాలు వీరి కాంబినేషన్ లో మిస్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని... సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.
Also Read:ఆమిర్ ఖాన్ రిజెక్ట్ చేసిన 8 సినిమాల వల్ల, ఇద్దరు హీరోలు సూపర్ స్టార్స్ అయ్యారని మీకు తెలుసా?