- Home
- Entertainment
- రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?
రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?
MS Dhoni to Appear in Ram Charan Movie: మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ సినిమాలకు సబంధించి ఏదొ ఒక అప్ డేట్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా చరణ్ సినిమాలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ థోనీ నటిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే?
- FB
- TW
- Linkdin
Follow Us
)
MS Dhoni to Appear in Ram Charan's Upcoming Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రస్తుతం టైమ్ కలిసి రావడంలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత దూసుకుపోతాడు అనుకుంటే వరుసగా ప్లాప్ లు అందుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ టైమ్ లోనే ఆచార్య సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న రామ్ చరణ్.. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. ఇలా వరుసగా రెండు ప్లాప్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్నారు. నెక్ట్స్ సినిమా హిట్ అవ్వకుంటే చరణ్ ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ రికార్డ్ చేరినట్టే.
Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
అందుకే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి భారీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రూరల్ బ్యాగ్రౌండ్ స్టోరీతో రూపొందతున్న ఈమూవీలో రామ్ చరణ్ స్పోర్ట్స్ మెన్ గా కనిపిస్తారట. టాలీవుడ్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక RC16 సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read:ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?
అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి అనేది సినిమా రిలీజ్ అయితేనో..లేక మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనో తెలుస్తాయి. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈమూవీలో రామ్ చరణ్ తో పాటు స్టార్ క్రియెటర్ థోని కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట. రామ్ చరణ్ క్రికెటర్ పాత్ర పోషిస్తుండగా.. థోని రామ్ చరణ్ కు ట్రైయినర్ గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆమిర్ ఖాన్ రిజెక్ట్ చేసిన 8 సినిమాల వల్ల, ఇద్దరు హీరోలు సూపర్ స్టార్స్ అయ్యారని మీకు తెలుసా?
MS Dhoni, Ram Charan
ఇప్పటికే థోని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన హీరోగా సినిమా కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ సినిమా నిజంగా థోని నటిస్తే.. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ భారీ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ కు నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ కు థోనీ కూడా చేరితే.. ఈసినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. మరి థోని నిజంగా ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది చూడాలి.
Also Read:కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?
రామ్ చరణ్ సినిమా కోసం భారీ గా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకుగా ఈసినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read:బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ? కానీ బాలయ్య ఏం చేశారంటే?