MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

స్టార్ సీనియర్ హీరోయిన్  మీనాని, నయనతార అవమానించిందని  ఫిల్మ్ ఇండస్ట్రీలో రచ్చ జరుగుతుంది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న మీనాకు నయనతార వల్ల అంత అవమానం ఏం జరిగింది? ఈ అవమానానిక మీనా ఇచ్చిన  స్ట్రాంగ్  కౌంటర్ ఏంటి?  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 14 2025, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సౌత్ ఇండియాన్  సినిమాలో నయనతార టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే  హీరోయిన్లలో  ఆమె మొదటి స్తానంలో ఉంది.  హీరోయిన్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుని వరుసగా సూపర్ హిట్  సినిమాలు చేస్తోంది నయనతారు. ఇక ఈ స్టార్ డమ్ వల్ల ఆమె యాటిట్యూడ్ లో మార్పు వచ్చిందంటున్నారు కొంత మంది నెటిజన్లు. దాంతో ఆమె వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. 

Also Read:  ఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

28
1 కోటితో వేసిన సెట్

1 కోటితో వేసిన సెట్

ప్రస్తుతం ఆమె వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తోంది. సుందర్ సి దర్శకత్వంలో 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నయనతార. రీసెంట్ గా 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా కోసం గ్రాండ్ పూజ జరిగింది. దీనికోసం నిర్మాత ఐసరి గణేష్ 1 కోటి రూపాయలతో ప్రత్యేకంగా సెట్ వేసి పూజ చేశాడు. 

Also Read: మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా

38
లైవ్ లో జరిగిన షూటింగ్

లైవ్ లో జరిగిన షూటింగ్

మూకుత్తి అమ్మన్ 2 సినిమా షూటింగ్ లైవ్ లో జరిగింది. అంతే కాదు ఈ సీన్ సినిమాలో పెట్టబోతున్నట్టు కూడా మూవీ టీమ్ వెల్లడించారు. ఈ గ్రాండ్ పూజలో 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా డైరెక్టర్ సుందర్ సి, నయనతారతో పాటు మీనా, ఖుష్బూ, రెజీనా కసాండ్రా, యోగి బాబు, కేఎస్ రవికుమార్, ఐసరి గణేష్, హిప్ హాప్ ఆది, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. 

Also Read: కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?

48
మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజ

మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజ

అయితే మూకుత్తి అమ్మన్ 2 సినిమా పూజలో నయనతార ఓవర్ గా ఆటిట్యూడ్ చూపిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా  స్టార్ నటి మీనాని పట్టించుకోలేదని, కనీసం పలకరించలేదని నయనతాపై  వరుస విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు సౌత్ సినిమాను తన కంట్రోల్ లో పెట్టుకున్నది మీనా. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

58
45 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్న మీనా

45 ఏళ్లుగా సినిమాలో నటిస్తున్న మీనా

చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చిన మీన, చిరంజీవి,  రజినీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, సత్యరాజ్, ప్రభు, కార్తీక్, అజిత్ లాంటి చాలా మంది మాస్ హీరోలతో కలిసి నటించింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న మీనా ఇప్పటికీ మంచి మంచి పాత్రలో నటిస్తూనే ఉంది. 

ఎన్నో సినిమాల్లో నటించిన మీనా ఎలాంటి అశ్లీలత లేకుండా, హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ  తమిళ, భాషల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలో 'మూకుత్తి అమ్మన్ 2' కార్యక్రమంలో మీనాని కనీసం హాయ్ అని కూడా విష్ చేయలేదట నయనతార. 

68
ఖుష్బూకి దక్కిన గౌరవం మీనాకు దక్కలేదు

ఖుష్బూకి దక్కిన గౌరవం మీనాకు దక్కలేదు

ఖుష్బూ, మీనా ఇద్దరూ కలిసి స్టేజి మీదకు వచ్చారు. అప్పుడు ఖుష్బూని కౌగిలించుకున్న నయనతార, మీనాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న నవ్వు కూడా నవ్వలేదు. దీంతో నయనతార ఓవర్ గా ఆటిట్యూడ్ చూపిస్తుందని ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పటికీ అస్సలు మాట్లాడుకోలేదు.

 

78
నయనతారకు సపోర్ట్ చేస్తున్న అభిమానులు

నయనతారకు సపోర్ట్ చేస్తున్న అభిమానులు

దీంతో మీనా సీనియర్ నటి అని కూడా చూడకుండా నయనతార ఓవర్ ఆటిట్యూడ్ చూపిస్తుందని విమర్శలు వచ్చాయి. దీనికి నయనతార అభిమానులు లేదు లేదు అలా మాట్లాడకండి. నయన్, మీనా ఇద్దరూ మాట్లాడుకున్నారు అని ఆమెకు సపోర్ట్ గా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మీనా, నయనతారకు పరోక్షంగా.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ముఖం మీద కొట్టినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 

88
మీనా ఇన్స్టా స్టోరీ పోస్ట్:

మీనా ఇన్స్టా స్టోరీ పోస్ట్:

తన ఇన్ స్టా స్టోరీలో చాలా గొర్రెలు మధ్య ఉన్న సింహం ఫోటోను షేర్ చేసింది. అందులో ఎప్పుడూ ఒంటరిగా ఉండే సింహం, గొర్రె తన గురించి ఏం అనుకుంటుంది, ఏం చెబుతుంది అని దేని గురించి పట్టించుకోదు అని ఉంది. ఇంకా మీ మంచి మనసును చూసి గర్వపడండి. అది అందరి దగ్గర ఉండదు అని మరో పోస్ట్ పెట్టింది.

ఈ రెండు స్టోరీలను మీనా నయనతారని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. గత కొన్ని నెలలుగా నయనతార తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం అలవాటుగా చేసుకుంది. దీనికి ముందు ధనుష్ సినిమా వ్యవహారం, పబ్లిక్ ఈవెంట్ లో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది... ఆ లిస్ట్ లో ఇప్పుడు ఈ సమస్య కూడా చేరింది.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved