MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

ఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

సెలబ్రిటీలు కాస్ట్లీ వస్తువులు కొనడం కామన్. స్టార్ హీరోలు చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షలు కోట్లు పెడుతుంటారు. ఎన్టీఆర్ అయితే చెప్పనక్కర్లేదు. కోట్లు విలువ చేసే వస్తువులు ఎన్టీఆర్ దగ్గర చాలా ఉన్నాయి. ఇక  తాజాగా తారక్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఎంతో తెలుసా? 
 

Mahesh Jujjuri | Published : Mar 14 2025, 11:07 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
NTR

NTR

స్టార్ సెలెబ్రిటీల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఏం చేసినా..? ఏది కొన్నా ప్రత్యేకంగానే ఉంటుంది. కాస్ట్ కూడా అంతకుమించి ఉంటుంది. నచ్చిన వస్తువు దక్కించుకోవడం కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇవి చూసి వాటి రేటును సెర్చ్ చేసి..వైరల్ చేస్తుంటారు. తమ అభిమాన నటుడు అన్ని కోట్లు పెట్టి అవి కొన్నారు.. ఇవి కొన్నారు అని మురిసిపోతుంటారు. 
 

25
Asianet Image

ఇక టాలీవుడ్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలలో ముందున్నారు. ఆయన ప్రతీ చిన్న వస్తువుకు భారీగా ఖర్చు పెడతారు. లగ్జరీ కార్లు, బట్టలు, షూస్, వాచ్, ఫోన్స్ ఇలా రకరకాల వస్తువలకోసం కోట్లు ఖర్చుపెట్టానికి వెనకాడరు. కాస్ట్లీ వస్తువులు కొనడంలో ఎన్టీఆర్ మార్క్ సెపరేట్ గా ఉంటుంది.

చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షలు, కోట్లు పెడుతుంటాడు ఎన్టీఆర్. చివరకు ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ కోసం వేలకు వేలు పెట్టిన సందర్భాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కార్లు అయితే రెండు కోట్ల నుంచి 10 కోట్ల వరకూ తనకు నచ్చిన మెచ్చిన కార్లతో.. గ్యారేజ్ నిండిపోయి ఉంది. 

35
Asianet Image

తారక్ కు చాలా ఇష్టమైన వాటిలో వాచ్ లు కూడా ఉన్నాయి. వాచ్ ల కోసం ఆయన కోట్లు ఖర్చు చేస్తుంటారు. గతంలో ఎన్టీఆర్ కలెక్షన్ లో రెండు కోట్ల వాచ్ ను పెట్టుకోవడం చూశాం. ఇక ఇప్పుడు అంతకు మించిన వాచ్  పెట్టుకుని అందరికి షాక్ ఇచ్చాడు తారక్. ఇంతకీ ఆ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా, అక్షరాలా 7 కోట్ల 47 లక్షలు. అవును కాస్ట్ తెలిస్తే కళ్లు తిరుగుతున్నాయి కదా. మద్య తరగతి వారు ఈ వాచ్ కాస్ట్ తో హైదరాబాద్ లో ఓ 5 ఇళ్ళు కట్టుకోవచ్చు. 
 

45
Asianet Image

ప్రస్తుతం హిందీ లో వార్ 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు తారక్. రీసెంట్ గా ఆయన  ముంబై విమానాశ్రయంలో చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఎన్టీఆర్ కొత్త లుక్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఇక ఆ లుక్ లో భాగంగా యంగ్ టైగర్ చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

మరి ఆ వాచ్ అంత బాగుంటే.. దాని వివరాలు బయటకు తీయ్యకుండా ఉంటారా. వెంటనే తారక్ ఫ్యాన్స్ ఆ వాచ్ జాతకం అంతా తీశారు.  జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు 7.47 కోట్ల రూపాయలు. ఒక రకంగా చెప్పాలంటేఎన్టీఆర్ రోల్స్ రాయిస్ కారు కంటే ఖరీదైన వాచ్ ధరించాడు. 
 

55
Asianet Image

ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్  రిచర్డ్ మిల్లె 40-01 టర్బైన్ మెక్‌లారెన్ స్పీడ్‌డయల్ బ్రాండ్ కు చెందినది. ఈ  వాచ్ విదేశాల నుండి దిగుమతి చేసుకుని, అన్ని పన్నులు చెల్లించిన తర్వాత, దాని ఖర్చు 8 కోట్లు దాటుతుంది. అంతే కాదు ఈ వాచ్ చాలా అరుదుగా దొరుకుతుంది.  

ఈ మోడల్ వాచ్ ప్రపంచవ్యాప్తంగా 106 మాత్రమే తయారు చేశారట. ఇక వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉంది. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ బిజీలో ఉన్న ఎన్టీఆర్, త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు దేవర 2 కూడా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను ఆయన ఎలా బ్యాలన్స్ చేస్తారు అనేది చూడాలి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories