- Home
- Entertainment
- Nani Gym Pic: జిమ్ములో కుమ్మేస్తోన్న నాని, నేచురల్ స్టార్ కష్టం అంతా ఆ సినిమా కోసమేనా?
Nani Gym Pic: జిమ్ములో కుమ్మేస్తోన్న నాని, నేచురల్ స్టార్ కష్టం అంతా ఆ సినిమా కోసమేనా?
Nani Gym workouts for Hit 3 Movie : నేచురల్ స్టార్ నాని తనను తాను మరింతగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే జిమ్ములో చెమటోడుస్తున్నాడు స్టార్ హీరో. ఇంతకీ నాని ప్లాన్ ఏంటి..?

నేచురల్ స్టార్ నాని అంటే ఇష్టపడటని ప్రేక్షకులు ఉండరు. పక్కింటి కుర్రాడిలా.. మన ఇంటి అబ్బాయిలా.. ప్రతీ ఫ్యామిలీ ఓన్ చేసుకునే హీరోలా అనిపిస్తుంటాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నాని అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వారికి తగ్గట్టే నాని చాలా కాలం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని సక్సెస్ అవ్వగా.. మరికొన్ని మాత్రం దారుణమైన ఫలితాలు చూపించాయి.
Also Read: రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?
రాను రాను నాని సినిమాలు మోనాటనీ అనిపించి.. వరుసగా ప్లాప్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దాంతో మోనాటనీ నుంచి బయటకు పడ్డాడు నాని. సేఫ్ జోన్ నుంచి ప్రయోగాల వైపు అడుగు పెట్టాడు. స్టార్టింగ్ లో కొన్ని ప్లాప్ అయినా.. తరువాత తరువాత నాని కష్టానికి ఫలితం లభించింది. ముందుగా లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడటం కోసం మాస్ సినిమాలు ట్రై చేశాడు నాని.
Also Read: నయనతార సర్‌ప్రైజ్, మాజీ ప్రియుడు శింబు బర్త్ డే రోజే ప్రకటన
నాని ఊరమాస్ క్యారెక్టర్ లో కనిపించి నటించిన సినిమా దసర. ఈసినిమాలో నాని నటనకు 100కు వంద మార్కులు పడ్డాయి. అలా మాస్ హీరో అనిపించుకున్న నాని.. ఆతరువాత తన ఫిట్ నెస్ ను యాక్షన్ సీక్వెన్స్ లను చూపించడానికి రెడీ అయ్యాడు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటించబోతున్నాడు. అందుకు తగ్గట్టు ఫిట్ నెస్ ను పెంచి.. సిక్స్ ప్యాక్ తో కనపించబోతున్నాడు నాని. టోన్డ్ బాడీతో ఆడియన్స్ కు షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..? పుష్ప 2 మూవీ ఎంత పనిచేసింది.
ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తానునటిస్తున్న రెండు సినిమాలను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సక్సెస్‌ఫుల్ సీక్వెల్ మూవీ అయిన ‘హిట్-3’ షూటింగ్‌లో నాని బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్
దీనితో పాటు తనకు దసర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదేల తో ది ప్యారడైజ్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. దసరాను మించి ఈసినిమాలో నాని పాత్ర చాలా విధ్వంసకరంగా ఉండబోతుందని సమాచారం.
ఇక ఈ రెండు పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు...బాడీ పెంచుతున్నాడు. జిమ్‌లో ఆయన చెమటోడుస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాని ఇంత వరకూ షర్ట్ విప్పి తన బాడీ చూపించింది లేదు. ఇక ఈసారి సిక్స్ ప్యాక్ తో షాక్ ఇవ్వబోతున్నాడునేచురల్ స్టార్.
Also Read:టాలీవుడ్ కు టాటా చెప్పనున్న శ్రీలీల, నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుస్తే షాక్ అవుతారు