Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun craze In Pakistan : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..? పుష్ప 2 మూవీ ఎంత పనిచేసింది.

Allu Arjun craze In Pakistan : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..? పుష్ప 2 మూవీ ఎంత పనిచేసింది.

Allu Arjun Pushpa2 craze In Pakistan:  పుష్ప2 సినిమాతో సంచలనాలు క్రియేట్ చేశాడు అల్లు అర్జున్.  ఈసినిమా దేశ వ్యాప్తంగా ఏరేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రెస్పాన్స్ అదిరిపోతోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లో బన్నీకి ఎంత క్రేజ్ ఉందంటే...? 

Mahesh Jujjuri | Published : Feb 01 2025, 10:49 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

Allu Arjun Pushpa2 craze In Pakistan:  అల్లు అర్జున్ అనుకున్నది సాధించాడు. ఒక రకంగా చెప్పాలంటే.. అనుకున్నదానికంటే ఎక్కువగానే సాధించాడు. ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను కూడా క్రాస్ చేసి దూసుకుపోయింది. దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది ఈసినిమా.

ఇక దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈసినిమాకు క్రేజ్ మూములుగా రావడంలేదు. అయితే పుష్ప2 మరికొన్ని దేశాల్లో రిలీజ్ చేయాల్సి ఉంది. చైనా, జపాన్ మార్కెట్ లో సెపరేట్ గా ఈసినిమాను రిలీజ్  చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ కలెక్షన్లు కూడా వస్తే.. ఈ సినిమా సత్తా ఏంటో తెలుస్తోంది. 
 

25
Asianet Image

ఓవర్ ఆల్ గా 2000 కోట్ల మార్క్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు టీమ్. ఇక ఈసినిమాకు తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ రాష్ట్రాల్లో కంటే కూడా నార్త్ ఇండియాలోనే భారీగా కలెక్షన్లు వచ్చాయి. అక్కడి జనం అల్లు అర్జున్ ను ఓన్ చేసుకున్నారు. ఈసినిమాకు కనకవర్షం కురిపించారు. ఈమూవీకి వచ్చిన 1800 కోట్ల కలెక్షన్స్ లో 900 కోట్లకు పైగా నార్త్ నుంచి వచ్చినవే. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఈసినిమాకు బుకింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. ఒక్క బుక్ మై షో నుంచే దాదాపు 6 కోట్ల టికెట్లు బుక్ అయ్యాయి. 

Also Read: రామ్ కి అనిల్ రావిపూడి కి మధ్య ఏంటి గొడవ, మూవీ ఎలా ఆగిపోయింది.

35
Asianet Image

ఇక థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఈసినిమా రికార్డ్ లు తిరగరాస్తోంది. రీసెంట్ గా నెట్ ప్లిక్స్ లోకి రిలీజ్ అయిన పుష్ప2  మూవీ.. 18 గంటలకే టాప్ 1 లోకి వచ్చింది. ప్రపంచంలో ఏసినిమా అయినా ఓటీటీలో టాప్ 10 లోకి రావాలి అంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. కాని ఈమూవీ చాలా  తక్కువ టైమ్ లోనే టాప్ 1  లోకివచ్చేసింది. కేవలం ఇండియా లో మాత్రమే కాదు, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, బెహ్రెయిన్, మాల్దీవ్స్, ఒమెన్, శ్రీలంక, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెన్యా, యునైటెడ్ కింగ్డమ్, ఇలా మరిన్ని దేశాల్లో ఈసినిమాకు భయంకరమైన రెస్పాన్స్ వచ్చేస్తోంది. 

Also Read: రజినీకాంత్ సల్మాన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా?

45
Asianet Image

ఇక ఈ రెస్పాన్స్ తో అల్లుఅర్జున్ గ్లోబల్ హీరోగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు, మరీ ముఖ్యంగా పాకిస్థాన్ లో పుష్ప2కి  మామూలు రెస్పాన్స్ రావడంలేదు. టాలీవుడ్  నుంచి ప్రభాస్ కు పాకిస్తాన్ లో భారీ క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఆ స్థానాన్ని కొల్లగోట్టాడు. ఓటీటీలో ప్రస్తుతం పాకిస్థాన్ లో టాప్ 1 లో ఉంది పుష్ప2. అక్కడ బన్నీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందట. 
 

Also Read: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు గుర్తుపట్టకుండా మారిపోయిన స్టార్స్ ఎవరు..?

55
Asianet Image

పుష్ప పార్ట్ 1 నుంచే అల్లు అర్జున్ పై అభిమానం పెంచుకున్న పాకిస్థానియులు.. పుష్ప2 ను అంతకు మించి ఆదరించారని సమాచారం. ఇక విదేశాల్లో టాప్ 10 లో ఏడాదిపాటు ట్రెండ్ అయిన మూవీస్ లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి పుష్ప2 అంతకుమించి సాధిస్తుందా లేదా అనేది చూడాలి మరి.
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
అల్లు అర్జున్
బాలీవుడ్
పాకిస్తాన్
తెలుగు సినిమా
తెలుగు సినిమా
 
Recommended Stories
కమల్‌ హాసన్‌ కి రానా అదిరిపోయే కౌంటర్‌.. ఆర్టిస్ట్ ల పని ఎంటర్‌టైన్‌ చేయడమే, సమాజానికి దారి చూపడం కాదు
కమల్‌ హాసన్‌ కి రానా అదిరిపోయే కౌంటర్‌.. ఆర్టిస్ట్ ల పని ఎంటర్‌టైన్‌ చేయడమే, సమాజానికి దారి చూపడం కాదు
అమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే మతిపోవాల్సిందే, అదిరిపోయే కాంబో
అమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే మతిపోవాల్సిందే, అదిరిపోయే కాంబో
పూజా హెగ్డే నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. జిమ్‌ ఫోటో పంచుకుంటూ మృణాల్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్
పూజా హెగ్డే నిన్ను చాలా మిస్‌ అవుతున్నా.. జిమ్‌ ఫోటో పంచుకుంటూ మృణాల్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్
Top Stories