Nayanthara Surprise : నయనతార సర్‌ప్రైజ్, మాజీ ప్రియుడు శింబు బర్త్ డే రోజే ప్రకటన
Nayanthara Surprise on Simbu Birthday : సౌత్ సూపర్ స్టార్ నయనతార సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 3న కీలక ప్రకటన చేయబోతున్నారట. అయితే అదే రోజు ఆమె మాజీ ప్రియుడు శింబు పుట్టినరోజు కావడం విశేషం. మరి ఆమె ఏం చేయబోతోంది.

నయనతార ప్రకటన
సౌత్ స్టార్ నటి నయనతార. 40 ఏళ్ళు దాటినా ఇంకా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళం,కన్నడ,హిందీ,మలయాళం సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలకు పైనే ఉన్నాయి.
Also Read: రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?
40 ఏళ్ళు దాటినా బిజీ నయనతార
కెజియఫ్ స్టార్ యష్ హీరోగా పాన్ ఇండియా సినిమాలో ముఖ్యమైన పాత్రలో నయన్ నటిస్తున్నారు. దీనితో పాటు టెస్ట్ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, మాధవన్, మీరా జాస్మిన్ నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?
ఓటీటీలో నయనతార
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి 3న ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు నయనతార తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో తదుపరిది అని పోస్టర్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో నయనతార పెళ్లి డాక్యుమెంటరీ ఇప్పటికే వివాదాస్పదమైన నేపథ్యంలో, ఈ ప్రకటన ఏమిటో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: 22 ఏళ్ల తరువాత తెరపైకి హీరోగా తమన్, మ్యుూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అవుతాడా..?
నెట్‌ఫ్లిక్స్‌లో టెస్ట్
అంతే కాదు ఫిబ్రవరి 3న నయనతార మాజీ ప్రియుడు శింబు పుట్టినరోజు కావడంతో.. ఆమె ప్రకటన ఏంటా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. నయనతార నటించిన టెస్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రానుందని సమాచారం.
Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్