- Home
- Entertainment
- Ram charan Blind Character : రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్
Ram charan Blind Character : రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్
Ram charan Blind Character In Buchibabu Movie: రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలంలో చెవిటి చిట్టిబాబు పాత్రలో ఎంత అద్భుతంగా నటించాడో అందరు చూశారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడి పాత్రలోకనిపించబోతున్నాడట గ్లోబల్ స్టార్. ఇంతకీ ఇందులో నిజం ఎంత..?

Ram charan Blind Character In Buchibabu Movie: రీసెంట్ గా గేమ్ ఛేజర్ సినిమాతో మరో ప్లాప్ ను చూశాడు మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో రామ్ చరణ్ నెక్ట్స్ మూవీపై అందరి దృష్టి పడింది. ఈసినిమా మటుకుహిట్ అవ్వకపోతే.. రామ్ చరణ్ కెరీర్ ఇబ్బందుల్లో పడినట్టే. రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. ఎందుకంటే జేమ్స్ కామరూన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్ ట్రిపులర్ ఆర్ లో రామ్ చరణ్ నటనను ప్రశంసించారు.
ఇక రామ్ చరణ్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పేదేముంది. అయితే చరణ్ మంచిమంచి పాత్రలు చేశారు. డీ గ్లామర్ అయినా సరే కథ బాగుంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. రంగస్థలం సినిమాదానికి పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. ఈసినిమాలో రామ్ చరణ్ చెవిటి చిట్టిబాబుగా కనిపించి మెప్పించారు. ఈసినిమాలో ఆయన యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. ఫ్యాన్స్ అయితే ఉర్రూతలూగిపోయారు.
Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?
ఇక ప్రస్తుతం మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడట రామ్ చరణ్. అవుతను రంగస్థలం సినిమాలో చెవిటిపాత్ర చేసనట్టుగానే .. బుచ్చిబాబు సినిమా కోసం గుడ్డివాడిగా నటించబోతున్నాట రామ్ చరణ్. అయితే ఈసినిమా అంతా ఆయన గుడ్డివాడిలా ఉంటాడా..? లేక కథలో పాత్ర డిమాండ్ చేయడంతో.. కథలో భాగంగా.. గుడ్డివాడిగా నటించాల్సి వస్తుందా..?అనేది తెలియదు కాని.. రామ్ చరణ్ మాత్రం ఏ పాత్ర చేయడానికి అయితే వెనకాడడు.
Also Read: రామ్ కి అనిల్ రావిపూడి కి మధ్య ఏంటి గొడవ
రంగస్థలం సినిమాలో చెవిటి చిట్టిబాబుగా పాత లుంగీ కట్టుకుని పల్లెటూరి వాడిలా చరణ్ నటించి మెప్పించాడు. మరి ఈసినిమాలో చరణ్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడు అనేది ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిసతున్నాడు.
Also Read: చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..?
Ram Charan Buchi Babu
ఇక ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసేశాడట రెహమాన్. ఇక ఈసినిమాకు పెద్ది టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా.. రెండు షెడ్యుల్స్ అయిపయాయట. మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.