- Home
- Entertainment
- Sreeleela Bollywood Entry : టాలీవుడ్ కు టాటా చెప్పనున్న శ్రీలీల, నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుస్తే షాక్ అవుతారు
Sreeleela Bollywood Entry : టాలీవుడ్ కు టాటా చెప్పనున్న శ్రీలీల, నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుస్తే షాక్ అవుతారు
Sreeleela Bollywood and Kollywood Entry : టాలీవుడ్ కు టాటా చెప్పబోతోందట స్టార్ హీరోయిన్ శ్రీలీల. అంతే కాదు ఇక్కడ నుంచి షిప్ట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందట. ఇంతకీ శ్రీలీలా ప్లాన్ ఏంటి..? ఏం చేయబోతోంది. డాక్టరమ్మ మనసులో ఏముంది..?

Sreeleela Bollywood and Kollywood Entry : టాలీవుడ్ లో చాలా తక్కువ టైమ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. వెంటనే శ్రీలీల పేరే ముందు వినిపిస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేసింది శ్రీలీలకు. అయితే అదికూడా ప్లాప్ సినిమాతో స్టార్ గా మారిన ఏకైక హీరోయిన్ కూడా శ్రీలీలనే. వరుస అవకాశాలు.. సీనియర్, యంగ్ హీరో అని తేడా లేకుండా వచ్చిన మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది ఈ బ్యూటీ.
Also Read: రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?
SreLeela
స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. చాలా తక్కువ టైమ్ లోనే బ్లాక్ బస్టర్ సినిమాలు చూసిన ఈ బ్యూటీ.. ప్లాప్ సినిమాలను కూడా ఫేస్ చేసింది. లాస్ట్ ఇయర్ మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడతపెట్టిన ఈ బ్యూటీ.
ఇక టాలీవుడ్ కు టాటా చెప్పి.. తమిళ్ పై కన్నేసిందట. అంతే కాడు బాలీవుడ్ డెబ్యూకి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అందరు అన్ని ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్ సినిమాలు చేయాలని తహతహలాడుతుంటే.. ఈమె టాలీవుడ్ కు బై చెపుతుందట.
Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?
అయితే ఈ ఏడాది మాత్రమే లుక్స్ కాస్త పక్క ఇండస్ట్రీల మీదకు తిప్పుతుందట. ఈ ఏడాది అంతా కోలీవుడ్, బాలీవుడ్ ను టార్గెట్ చేసిందట శ్రీలీల. ఇప్పటికే తమిళ్ లో తన ఫస్ట్ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.
శివకార్తికేయన్, అథర్వ మురళి, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధకొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ లో శ్రీలీల రెట్రో లుక్ దర్శనం ఇచ్చింది. ఈసినిమాతో ఫస్ట్ టైమ్ తమిళ తెరపై మెరవబోతోంది శ్రీలీల.
Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్
ఇప్పటి వరకూ తెలుగు ఆడియన్స్ ను ఆడేసుకున్న శ్రీలీల ఈ సంవత్సరం నుంచి తమిళ ప్రేక్షకులను కూడా అలరించబోతోంది. ఇక తమిళం మాత్రమే కాదు అటు బాలీవుడ్ ప్లాన్స్ కూడా భారీగానే వేసింది బ్యూటీ. ఇప్పటికే బీటౌన్ లో రెండు మూడు సినిమాలకు సైన్ చేసిందట బ్యూటీ.
ఈమధ్య సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ కనిపించింది. స్టోరీ సిట్టింగ్స్ తో.. ముంబయ్ లో కొంత కాలం ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తో ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇబ్రహీం, శ్రీలీల ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారట.
Also Read: నయనతార సర్‌ప్రైజ్, మాజీ ప్రియుడు శింబు బర్త్ డే రోజే ప్రకటన
Sreeleela, samantha,#Pushpa2
ప్రస్తతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అతనితో పాటు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ జోడీగా తుమేరీ మే తేరా సినిమాలో కూడా నటించబోతుందంటూ బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇలా ఈ ఏడాది టాలీవుడ్ కు టాటా చెప్పేసి.. కోలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసిందట శ్రీలీల. ఇప్పటికే పుష్ప 2 సాంగ్ తో శ్రీలీలకు ఎక్కడ లేనిక్రేజ్ వచ్చేసింది. కిస్సిక్ సాంగ్ తో పాన్ ఇండియాలోపాపులర్ అయ్యింది శ్రీలీల. మరిఈ రెండు ఇండస్ట్రీలలో విజయ పతాకం ఎగరేస్తుందా లేదా చూడాలి.
కొంత మంది వాదన ప్రకారం ఆమె కొన్ని సినిమాలు చేసి.. ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెపుతుందని అంటున్నారు. ఇప్పటికే శ్రీలీల MBBS చదువుతోంది శ్రీలీల. సినిమాలు చేసుకుంటూ చదువు కంటీన్యూ చేస్తోంది. ఇక సినిమాలు ఆపేసి ఆమె హాస్పిటల్ కట్టబోతోంది అని కూడా టాక్ వస్తోంది. భారీ స్థాయిలో హాస్పిటల్స్ ను నిర్మించే ప్లాన్ లో ఉందట బ్యూటీ. డాక్టర్ గా సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తోందట. సినిమాల నుంచి వచ్చిన సంపాదనను అందుకోసం ఉపయోగించబోతోందట.