Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
మీరు వేసుకున్న డ్రెస్ లాంటిదే వేరేవాళ్లు వేసుకుంటే ఎలా ఉంటుంది? అంటూ ఆర్తి రవి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది నటుడు రవి మోహన్ కు పరోక్షంగా ఇచ్చిన కౌంటరా? అనే చర్చ జరుగుతోంది.

Jayam Ravi and Aarthi Ravi divorce controversy
ఆర్తి రవి ఇన్‌స్టా స్టోరీ
ఆర్తి రవి తన ఇన్‌స్టా స్టోరీలో డ్రెస్, కలర్ మ్యాచింగ్ గురించి ఓ పోస్ట్ షేర్ చేశారు. 'మీరు ఒక చోటికి వెళ్లినప్పుడు, అక్కడ వేరేవాళ్లు కూడా మీరు వేసుకున్న డ్రెస్ లాంటిదే, అదే రంగులో వేసుకుంటే ఊరుకుంటారా? మీకెలా అనిపిస్తుంది?' అని ఆమె ప్రశ్నించారు.
జయం రవి నుంచి రవి మోహన్‌గా
స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు రవి మోహన్. కొద్ది రోజుల క్రితమే ఆయన తన పేరును జయం రవి నుంచి రవి మోహన్‌గా మార్చుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న ఈయన, గత కొన్ని నెలలుగా భార్యకు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాదే ఆర్తి రవితో విడిపోతున్నట్లు రవి మోహన్ ప్రకటించినా, వారి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఈ నేపథ్యంలో వీరి సోషల్ మీడియా పోస్టులు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
ఆర్తి పరోక్షంగా పోస్ట్
ఈ స్టోరీ చూసిన అభిమానులు, ఇది కేవలం డ్రెస్ గురించి కాదని, దీని వెనుక ఏదో అంతరార్థం ఉందని భావిస్తున్నారు. ఇటీవల రవి మోహన్ ఓ నటితో ఒకే రంగు దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను ఉద్దేశించే ఆర్తి పరోక్షంగా ఈ పోస్ట్ పెట్టారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

